సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావుతో పాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డా...అనూహ్యంగా ఆమె వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగలారు.
చదవండి: రాజ్యసభలో టీడీపీ ఖాళీ!
రాజ్యసభలో టీడీపీపీ బీజేపీలో విలీనం
జ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని తక్షణమే బీజేపీలో విలీనం చేయాలంటూ ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందచేశారు. 10వ షెడ్యూల్‌ను అనుసరించి విలీనం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంతో ప్రేరణ పొందామని, దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పార్టీని విలీనం చేస్తున్నట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. ఇక నుంచి తమను బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని, తమ పార్టీ విలీనం అంగీకరించాలని బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశామంటూ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు సంతకం చేశారు. లెజిస్లేటివ్ పార్టీలో రెండింట మూడొంతులు ఫిరాయిస్తే విలీనం లాంఛనమే. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి విలీనం లేఖను ఇచ్చిన అనంతరం నలుగురు ఎంపీలు బీజేపీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment