
రాజ్యసభ సభ్యులు కెకె, సుజనా చౌదరి, రాప్రోలు ఆనంద్ భాస్కర్
ఢిల్లీ: ఎప్పుడూ ఎడ్డెం అంటే తెడ్డె అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులందరూ ఈ రోజు రాజ్యసభలో ఒకే కోరిక కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని టిఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి, కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌లు కేంద్రాన్ని కోరారు. ఉద్యోగుల విభజన చేయకుంటే పాలనకు అనేక సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ఈ అంశంపై కేంద్రమంత్రి జితేందర్ సింగ్ స్పందించారు. కొద్ది వారాల్లోనే ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సర్వేపై తాము ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సుజనాచౌదరి చెప్పారు. సర్వేపై వివరణ మాత్రమే కోరినట్లు తెలిపారు. సర్వే వల్ల తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బందులేనన్నారు.