కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు | Conference on Cambodia to the MP rapolu | Sakshi
Sakshi News home page

కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు

Published Wed, Oct 22 2014 2:26 AM | Last Updated on Fri, Aug 10 2018 4:39 PM

కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు - Sakshi

కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు

న్యూఢిల్లీ: ఏషియన్ ఫోరం ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్, డెవలప్‌మెంట్(ఏఎఫ్‌పీపీడీ), కాంబోడియన్ ఎఫ్‌పీపీడీ సంయుక్త ఆధ్వర్యంలో కాంబోడియాలో నిర్వహించనున్న సదస్సులో రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు మూడు రోజులపాటు జరగనున్న సదస్సుల్లో రాపోలుతోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎంపీ విప్లవ్‌ఠాకూర్ పాల్గొననున్నారు.  ‘మహిళలు, చిన్నారులపై హింసను అరికట్టడం’ అన్న అంశంపై ఎంపీ రాపోలు ఈ నెల 25న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎంపీ వెంట ఆయన సతీమణి సరోజ కూడా వెళుతున్నారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఈ నెల 27న వారు ఢిల్లీకి చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement