Kambodiyan
-
Cambodia: పుట్టిన తేదీని మార్చుకున్న ప్రధాని.. కారణం ఏంటో తెలుసా?
పరిస్థితులు అనుకూలించడం లేదనో, ఏ పని చేసిన కలిసి రావడం లేదనో కొంతమంది పేరు మార్చుకోవడం, పేరులో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఓ దేశానికి ప్రధాని కేవలం అదృష్టాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. అందుకోసం కోసం.. ఏకంగా పుట్టినతేదీనే మార్చుకున్నాడు. పైగా అంత అత్యున్నతి పదవిలో ఉండి ఆ పని చేయడమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు!. కంబోడియా ప్రధాన మంత్రి హన్ సెన్.. పుట్టిన తేది ఏప్రిల్ 4, 1951. కానీ ఆయన ఆ తేదీని ఆగస్టు 5, 1952కి చట్టబద్ధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు ఓ బలమైన కారణం ఉందన్నది ఆయన వాదన. హన్సెన్ సోదరుడు.. సింగపూర్‌లో వైద్యం చేయించుకుని కంబోడియాకు తిరిగి వచ్చిన పదిరోజులకే చనిపోయాడు. దీంతో హన్ సెన్.. అత్యవసరంగా తన డేట్ ఆఫ్ బర్త్ను మార్చేసుకోవాలనుకున్నాడు. ఈ అనుహ్యమైన నిర్ణయం వెనుక.. తన సోదరుడి రెండు పుట్టిన రోజుల దోషం కూడా ఉందన్నది ఆయన వాదన. వాస్తవానికి కంబోడియా 1975 నుంచి 1979 వరకు ఖైమర్ రూజ్ పాలన కాలంలో ఉండేది. ఆ సమయంలో చాలామంది అధికారిక రికార్డుల కోల్పోయినందున వల్ల 50 ఏళ్లు పైబడ్డ కంబోడియన్లందరికీ రెండేసి పుట్టిన రోజులు ఉండిపోయాయి. అలా తన సోదరుడికి రెండు పుట్టినరోజులు ఉండడం, రాశిచక్రం దోషం వల్ల చనిపోయి ఉంటాడని హన్ సెన్ నమ్ముతున్నాడు. తన వరకు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు.. ఒకే పుట్టినరోజు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే చట్టబద్ధంగా.. తన పుట్టిన తేదీని మార్చుకునే అంశంపై.. న్యాయ శాఖ మంత్రి కోయుట్ రిత్తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన కొత్త పుట్టిన తేదీని చట్టబద్ధంగా రిజిస్ట్రర్ చేసుకుని.. ప్రకటించే అవకాశం ఉంది. (చదవండి: మాతృభాషకు అసలైన గౌరవం... ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా..ఎల్లప్పుడూ కన్నడిగే!) -
35 ఏళ్ల తర్వాత ఆ ఏనుగుకు విముక్తి!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో 35 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్న కావన్ అనే ఏనుగుకు ఎట్టకేలకు గుంపుతో తిరిగే అవకాశం దొరికింది. అమెరికన్ సింగర్ చేర్ ఆదివారం కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాకు తీసుకెళ్లనున్నారు. ఇంతకాలం ఒంటరిగా జీవిస్తూ వచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగైన కావన్ ఇకపై ఏనుగులతో జూలో ఉండనుంది. కావన్‌ను విమానంలో తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చేర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురూ కావన్‌ను తరలించడానికి అంగీకరించారు. అనంతరం కావన్‌ను కాంబోడియాకు పంపేందుకు సహాయపడిన ఇమ్రాన్‌కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు చేర్. మరోపక్క కావన్‌ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్‌కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే పర్యావరణ కార్యక్రమాల్లో చేర్ పాల్గొనాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ కోరినట్టు పీఎంఓ ఆఫీసు ఓ ప్రకటన విడుదల చేసింది. కావన్‌ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్‌కు తరలించనున్నారు. -
కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఫోరం ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్, డెవలప్మెంట్(ఏఎఫ్‌పీపీడీ), కాంబోడియన్ ఎఫ్పీపీడీ సంయుక్త ఆధ్వర్యంలో కాంబోడియాలో నిర్వహించనున్న సదస్సులో రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు మూడు రోజులపాటు జరగనున్న సదస్సుల్లో రాపోలుతోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎంపీ విప్లవ్ఠాకూర్ పాల్గొననున్నారు. ‘మహిళలు, చిన్నారులపై హింసను అరికట్టడం’ అన్న అంశంపై ఎంపీ రాపోలు ఈ నెల 25న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎంపీ వెంట ఆయన సతీమణి సరోజ కూడా వెళుతున్నారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఈ నెల 27న వారు ఢిల్లీకి చేరుకుంటారు.