దానం నాగెందర్, రాపోలు ఆనంద భాస్కర్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు పలువురు ఈ విందుకు హాజరయ్యారు. అయితే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీ-కాంగ్రెస్ నేతలు ఈ విందును బహిష్కరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు విందుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాలేదు..
Comments
Please login to add a commentAdd a comment