మన్సూరాబాద్/ చాదర్‌ఘాట్: మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చేస్తున్న చిల్లర పనులను అందరూ అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మన్సూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు మన్నె ప్రతాప్‌రెడ్డిని బుధవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక్క ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దొంగల ముఠాగా ఏర్పడి మునుగోడులో దిగారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలపై ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహంతో టీఆర్‌ఎస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని, అదేవిధంగా పలివెలలో ఈటల రాజేందర్‌పై, విశ్వేశ్వరరెడ్డిపై దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో బండి సంజయ్‌కుమార్ పేరుతో వైరల్ అవుతున్న లెటర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ అదెవరో ఫాల్తుగాళ్లు చేస్తున్నారు. ఆ ఫాల్తుగాళ్లపై ఫిర్యాదు కూడా చేయను అని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారు
నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో తిష్టవేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. స్థానికేతరులైన ఇతర పార్టీల నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించకుంటే బీజేపీ శ్రేణులు కూడా మునుగోడుకు తరలివస్తాయని ఆయన హెచ్చరించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో గాయపడి మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త రమేష్ యాదవ్‌ను పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు.
చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment