సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలతో మొదలైన పొలిటికల్ హీట్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో మరింత ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా తరుణ్‌చుగ్, బండి సంజయ్ స్పందించారు.
ఈ క్రమంలో తరుణ్‌చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా ఓ కట్టుకథ. ఈ వ్యవహారంతో బీజేపీకి సంబంధమేలేదు. ఇదంతా టీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామా. ఇది నిరూపించేందుకే బండి సంజయ్ తడి బట్టలతో వెళ్లి యాదాద్రిలో ప్రమాణం చేశారు. కేసీఆర్‌కు నిజంగా సచ్ఛిలుడు అయితే యాదాద్రికి ఎందుకు రాలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కేరాఫ్‌గా మారింది. తెలంగాణలో ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల జస్ట్ ట్రైలర్ మాత్రమే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కర్నాటకలో డ్రగ్స్ కేసు ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రిలో సంప్రోక్షణ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. నాస్తికుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నువ్వు, నీ కుటుంబం మోసకారి కుటుంబం. మీరు గద్దె దిగాక తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తామన్నారు. మీ ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతి భవన్ నుంచి ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం పాపం
Comments
Please login to add a commentAdd a comment