
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు చేసినందుకుగాను బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్‌కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫలితాల తప్పిదాలనకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment