inter result
-
Watch Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్‌కు సహకరించిన లెక్చరర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఆర్, ఓఎంఆర్ సాంకేతికతను ఉపయోగించుకుని ఫలితాలు నిర్ణయించినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫలితాలు www.sakshieducation.com లో చూడవచ్చు. -
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 18న ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది. పరీక్షల ప్రక్రియను ఇప్పటికే బోర్డు పూర్తి చేసింది. పరీక్షల ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెబ్ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. -
ధర్నాచౌక్ వద్ద అఖిలపక్ష బృందం దీక్ష
-
ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు చేసినందుకుగాను బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్‌కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫలితాల తప్పిదాలనకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
పరీక్షలో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బన్సీలాల్‌పేట్: ఇంటర్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికిలోనైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతానికి చెందిన గణేష్ కుమార్తె అనామిక(16) చాచానెహ్రునగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెట్లో ఫెయిలయ్యింది. దీంతో మనస్తాపానికిలోనైన అనామిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ ఫలితాల్లో మన స్థానం ఆరు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : ఇంటరీ్మడియెట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ఆరోస్థానం దక్కించుకుంది. 45,598 మంది ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా 28,168 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 62 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 38,963 మంది పరీక్షలు రాయగా 28,135 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఏడోస్థానంలో నిలువగా ఈసారి ఒక అడుగు ముందుకేసి ఆరుకు చేరుకుంది. ప్రథమ సంవత్సరంలో జిల్లా ఐదోస్థానం సాధించింది. ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చాలామంది సెల్ఫో¯ŒS ద్వారా తమ ఫలితాలను తెలుసుకున్నారు. గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయంటే కిటకిటలాడే ఇంటర్నెట్ నెట్ సెంటర్లు, మీసేవా కేంద్రాలు వెలవెలబోయాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెంటనే పరీక్షలు రాసేలా మే 15న అడ్వా¯Œ్సడ్ సప్లిమెంటరీ పరీక్ష జరగనుంది. అలాగే ఫలితాలపై అనుమానం ఉంటే రీకౌంటింగ్‌కు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.220, రీ వెరిఫికేష¯ŒSకు రూ.1,020 చెల్లించాల్సి వుంది. ఈ విషయమై ఆన్లై¯ŒS ద్వారా ఏపీబీఐఈ.సీజీజీ.గవ్.ఇ¯ŒS అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చు. రాజవొమ్మంగి, దేవీపట్నం ప్రభుత్వ కళాశాలలు ప్రథమం ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల 78 శాతం ఉత్తీర్ణతతో ప్రథమంలో నిలిచింది. కాకినాడ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 70 శాతంతో రెండోస్థానం, తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల 66 శాతంతో ద్వితీయస్థానంలో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో దేవీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల 89 శాతంతో ప్రథమస్థానం సాధించింది. తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88 శాతంతో రెండోస్థానం, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజవొమ్మంగి 86 శాతంతో తృతీయస్థానం సాధించాయి. సత్తాచాటిన జిల్లా విద్యార్థులు ఇంటరీ్మడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల కళాశాల విద్యార్థులు బైపీసీ ప్రథమసంవత్సరంలో యు.సత్యవెంకటరాధ రాష్ట్రస్థాయిలో ప్రథమస్థాయి సాధించింది. ఆమె 440కు గాను 436 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరానికి చెందిన పి.లీన బైపీసీలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించింది. ఆమె 990కు 980 మార్కులు సా«ధించింది. ఇంటర్ ప్రథమసంవత్సరం హెచ్ఈసీలో రాజమహేంద్రవరం శ్రీషిరీ్డసాయి విద్యానికేత¯ŒSకు చెందిన ఎమ్.చైతన్యసూరజ్ 475కుగాను 446 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచాడు. అలాగే 440 మార్కులతో ఎం.కోటిరెడ్డి ద్వితీయస్థానం, 436 మార్కులతో ఎం.శ్రీదేవి తృతీయస్థానం సాధించారు. ఇంటరీ్మడియట్ ద్వితీయసంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో రాజమహేంద్రరంలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న రెడ్డి దీక్షితారెడ్డి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. దీక్షితారెడ్డి 1000కు గాను 989 మార్కులు సాధించి ఈ స్థానం కైవసం చేసుకుంది. సీనియర్ ఎంపీసీలో శ్రీచైతన్య కళాశాలకు చెందిన కోలా జ్యోత్స్న 1000కి 989 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమంగా నిలిచింది.