ఇంటర్ ఫలితాల్లో మన స్థానం ఆరు
Published Thu, Apr 13 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) :
ఇంటరీ్మడియెట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ఆరోస్థానం దక్కించుకుంది. 45,598 మంది ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా 28,168 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 62 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 38,963 మంది పరీక్షలు రాయగా 28,135 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఏడోస్థానంలో నిలువగా ఈసారి ఒక అడుగు ముందుకేసి ఆరుకు చేరుకుంది. ప్రథమ సంవత్సరంలో జిల్లా ఐదోస్థానం సాధించింది. ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చాలామంది సెల్‌ఫో¯ŒS ద్వారా తమ ఫలితాలను తెలుసుకున్నారు. గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయంటే కిటకిటలాడే ఇంటర్నెట్ నెట్ సెంటర్లు, మీసేవా కేంద్రాలు వెలవెలబోయాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెంటనే పరీక్షలు రాసేలా మే 15న అడ్వా¯Œ్సడ్ సప్లిమెంటరీ పరీక్ష జరగనుంది. అలాగే ఫలితాలపై అనుమానం ఉంటే రీకౌంటింగ్‌కు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.220, రీ వెరిఫికేష¯ŒSకు రూ.1,020 చెల్లించాల్సి వుంది. ఈ విషయమై ఆన్‌లై¯ŒS ద్వారా ఏపీబీఐఈ.సీజీజీ.గవ్.ఇ¯ŒS అనే వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
రాజవొమ్మంగి, దేవీపట్నం
ప్రభుత్వ కళాశాలలు ప్రథమం
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల 78 శాతం ఉత్తీర్ణతతో ప్రథమంలో నిలిచింది. కాకినాడ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 70 శాతంతో రెండోస్థానం, తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల 66 శాతంతో ద్వితీయస్థానంలో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో దేవీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల 89 శాతంతో ప్రథమస్థానం సాధించింది. తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల 88 శాతంతో రెండోస్థానం, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజవొమ్మంగి 86 శాతంతో తృతీయస్థానం సాధించాయి.
సత్తాచాటిన జిల్లా విద్యార్థులు
ఇంటరీ్మడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తాచాటారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల కళాశాల విద్యార్థులు బైపీసీ ప్రథమసంవత్సరంలో యు.సత్యవెంకటరాధ రాష్ట్రస్థాయిలో ప్రథమస్థాయి సాధించింది. ఆమె 440కు గాను 436 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరానికి చెందిన పి.లీన బైపీసీలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించింది. ఆమె 990కు 980 మార్కులు సా«ధించింది. ఇంటర్ ప్రథమసంవత్సరం హెచ్‌ఈసీలో రాజమహేంద్రవరం శ్రీషిరీ్డసాయి విద్యానికేత¯ŒSకు చెందిన ఎమ్.చైతన్యసూరజ్ 475కుగాను 446 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచాడు. అలాగే 440 మార్కులతో ఎం.కోటిరెడ్డి ద్వితీయస్థానం, 436 మార్కులతో ఎం.శ్రీదేవి తృతీయస్థానం సాధించారు. ఇంటరీ్మడియట్ ద్వితీయసంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో రాజమహేంద్రరంలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న రెడ్డి దీక్షితారెడ్డి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. దీక్షితారెడ్డి 1000కు గాను 989 మార్కులు సాధించి ఈ స్థానం కైవసం చేసుకుంది. సీనియర్ ఎంపీసీలో శ్రీచైతన్య కళాశాలకు చెందిన కోలా జ్యోత్స్న 1000కి 989 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమంగా నిలిచింది.
Advertisement
Advertisement