AP: కళ్యాణ మండపంలో రేవ్‌ పార్టీ.. ఐదుగురు మహిళలు అరెస్ట్‌ | AP Police Conduct Raids On Rave Party At East Godavari | Sakshi
Sakshi News home page

AP: కళ్యాణ మండపంలో రేవ్‌ పార్టీ.. ఐదుగురు మహిళలు అరెస్ట్‌

Published Mon, Dec 30 2024 1:52 PM | Last Updated on Mon, Dec 30 2024 3:16 PM

AP Police Conduct Raids On Rave Party At East Godavari

సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్‌ పార్టీ ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్‌ సందర్భంగా కళ్యాణ మండపంలో రేవ్‌ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుడుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో రేవ్‌ పార్టీ జరుగుతోంది.  దీనిపై సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున రేవ్ పార్టీపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో రేవ్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, న్యూ ఇయర్‌ సందర్భంగా రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్‌ కంపెనీకి చెందిన వారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రేవ్‌ పార్టీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement