సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 3,91,048 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 1,90,475 మంది ఫస్ట్ ఇయర్, 2,00,573 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఫలితాలపై వరుస సెలవులు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శింవచ్చని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి జయప్రదబాయి స్పష్టం చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.com, www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment