
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు.
ఇంటర్మీడియట్‌లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు.