ఇంటర్‌ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్‌!  | TS Intermediate Board Conducts First Year Exams From 25th October | Sakshi
Sakshi News home page

TS Inter 1st Year Exams: ఇంటర్‌ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్‌! 

Published Thu, Oct 21 2021 9:19 AM | Last Updated on Thu, Oct 21 2021 10:46 AM

TS Intermediate Board Conducts First Year Exams From 25th October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్‌ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటున్నారు. విద్యార్థులను తికమకపెట్టే డొంక తిరుగుడు ప్రశ్నలను సాధ్యమైనంత వరకూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండబోతున్నాయనే భరోసాను అధికారులు కలి్పస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్‌ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఫస్టియర్‌ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలుందని బోర్డు వర్గాలు అంటున్నాయి.  
ప్రశ్నల తీరు ఇలా.... 
►సబ్జెక్టుల్లో సగానికి సగం చాయిస్‌ ఇస్తున్నారు. ముఖ్యంగా గణితంలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు సాధ్యమైనంత వరకూ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గణితంలో మూడు సెక్షన్లుంటాయి. ‘ఎ’సెక్షన్‌లో 2 మార్కులు, ‘బి’లో 4, ‘సీ’లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్‌లోని 10 ప్రశ్నల కూ సమాధానం ఇవ్వాలి. ‘బీ’లో 10 ప్రశ్నలకుగాను 5, ‘సీ’లో 10 ప్రశ్నలకుగాను ఐదింటికి రాయాలి. 
►భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్‌లో 2, బీ సెక్షన్‌లో 4, సీ సెక్ష న్‌లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్‌ ఏలో ఉన్న మొ త్తం పది ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, ‘సీ’ లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలివ్వాలి. 
►రసాయనశాస్త్రంలో సెక్షన్‌ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్‌ బీలో 4, సెక్షన్‌ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. ‘ఏ’లో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకుగాను 6, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలు రాయాలి. 
►బోటనీ సెక్షన్‌–ఏలో 2 మార్కులు, సెక్షన్‌–బీలో 4 మార్కులు, సెక్షన్‌–సీలో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్‌–ఏలో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకు గాను ఆరింటికి, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి జవాబులు రాయాలి.
►అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో సెక్షన్‌–ఏలో 10, సెక్షన్‌–బీలో 5, సెక్షన్‌–సీలో 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్‌లో 6 ప్రశ్నలకుగాను 3, ‘బీ’లో 16 ప్రశ్నలకుగాను ఎనిమిదింటికి, ‘సీ’లో 30 ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 

వాళ్ల సంగతేంటి? 
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు గతంలో ఫీజు కట్టిన వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. అయితే, అప్పట్లో 10 వేల మంది ఫీజులు చెల్లించలేదు. ఈ సమయంలో పరీక్షలు లేకుండా అందరినీ రెండో ఏడాదిలోకి ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజు కట్టని వాళ్లకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. వీళ్లంతా ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తూ ఆ ఏడాదితో పాటే, ఫస్టియర్‌ పరీక్షలూ రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement