సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు.
దాంతో ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment