reverification
-
మరో 10,542 టెన్త్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సంబంధించి మరో 10,542 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 55,996 మంది రీ వెరిఫికేషన్/ రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.మార్కుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసిన 43,714 మంది జవాబు పత్రాలను ఈ నెల 23న ఆయా స్కూళ్లకు ఆన్లైన్లో పంపించారు. మరో 10,542 మంది జవాబు పత్రాలను సోమవారం ఆయా స్కూళ్లకు పంపించగా, మిగిలిన 1,710 జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసి త్వరలోనే పంపిస్తామని తెలిపారు. -
విద్యార్థుల ఆందోళనబాట.. బోర్డు దోబూచులాట
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు దోబూచులాట రానురానూ వివాదాస్పదమవుతోంది. ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వక పోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రెండో సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవ డానికే పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయ డంతో ఫెయిలైన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయమేంటని అయోమయం పెరుగుతోంది. అందరినీ పాస్ చేయాలని తాము ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. నిర్ణయం తీసుకోవడం జాప్యమవు తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ పాస్ చేయాలని రోజూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే 39 వేల రీ వెరిఫికేషన్ దరఖాస్తులు ఇటీవలి ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఫెయిల్ అయ్యారు. వీరిలో 39,039 మంది రీ వెరిఫికేషన్ కోసం.. 4,200 మంది రీ కౌంటింగ్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తుదారులకు వారి జవాబు పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. రీ కౌంటింగ్ అయితే మార్కులను మరోసారి లెక్కి స్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా అధ్యాప కులను నియమించాలి. కానీ ఇంకా ఈ దిశగా పని మొదలుకాలేదు. అందరినీ పాస్ చేయాలనే డిమాండ్ వస్తుండటంతోనే జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఫస్టియర్‌పై నిర్ణయం రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీన్ని తీవ్రం చేసేందుకూ వ్యూహాలు రచిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాలకు ఆన్లైన్ విద్య అందలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవర్గాలకు చెందినవారే ఎక్కువ మంది ఫెయిలయ్యారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. దీంతో అలందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బోర్డు కార్యాలయం వద్ద జగ్గారెడ్డి ధర్నా ఇంటర్లో ఫెయిలైన 2.36 లక్షల మంది విద్యార్థులను తక్షణమే పాస్ చేయాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట 2 గంటలు ధర్నా చేశారు. విద్యార్థులు చనిపోతుంటే సర్కారు మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ఆన్లైన్ క్లాసులే సరిగా జరగనప్పుడు, పేదలకు ఆ విద్య చేరనప్పుడు పరీక్షలెలా రాస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో బోర్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. -
పెన్షన్ కార్డుల రీవెరిఫికేషన్పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
రేపు ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, ఇతరత్రా కారణాలతో ఫెయిలైన 3.28 లక్షల విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు, జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను ఈ నెల 27న బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 27వ తేదీలోగా విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్ ప్రతులను వెబ్సైట్లో పొందుపరుచాల్సివుంది. అందుకనుగుణంగా చర్యలు చేపట్టిన ఇంటర్‌బోర్డు ఈ నెల 27న అదే విషయాన్ని కోర్టు తెలియజేయాలని నిర్ణయించింది. కోర్టు అంగీకరిస్తే వాటిని అదే రోజు విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. -
‘ఇంటర్’పై గడువు 27 వరకు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల పత్రాలను రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసిన ఫలితాలు, మార్కుల జాబితాలు, ఆన్సర్ షీట్లు ఈనెల 27 సాయంత్రం అయిదు గంటల్లోగా ఆన్లైన్లో ఉంచాలని ఇంటర్మీడియట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ మూడింటిని వేరువేరు తేదీల్లో వెల్లడిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని ఆశించిన విద్యార్థులు తిరిగి గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంటుందని, ఆన్లైన్లో తన పత్రాల్ని స్వయంగా చూసుకోవడం ద్వారా ఆందోళనకు గురికాకుండా ఉంటారని హైకోర్టు అభిప్రాయపడింది. ‘ఆన్లైన్లో పత్రాలు ఉండటం వల్ల గతంలో వచ్చిన మార్కులు, ఇప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల తర్వాత వచ్చిన మార్కుల్ని విద్యార్థులు స్వయంగా బేరీజు వేసుకునే వీలుంటుంది. తాము రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు లభించాయో లేదో కూడా చూసుకుంటారు. ఫలితంగా విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడదు. తిరిగి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఈ కోణంలో మూడింటినీ ఒకే రోజు వెల్లడించాలి’అని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ధర్మాసనం సూచించింది. గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్‌ను ప్రతివాదిగా చేయాలని కోరుతూ గతంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన హైకోర్టు ఆ సంస్థకు నోటీసు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను బాధ్యులను చేయాలని, మరణించిన 16 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు, న్యాయవాది రాపోలు భాస్కర్ వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు మరోసారి విచారించింది. 27లోగా అందుబాటులో ఉంచుతాం ‘ఫలితాలతోపాటు జవాబు పత్రాలను కూడా ఆన్లైన్లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కార్ అనుమతిస్తే.. ఫలితాల్ని 15వ తేదీన (గురువారం) వెల్లడించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. 16వ తేదీ సాయంత్రానికి ఆన్లైన్లో మార్కుల జాబితాలు అందుబాటులో ఉండేలా చేస్తాం. 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పూర్తి చేసిన మొత్తం జవాబు పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. మొత్తం 9,43,005 మంది ఇంటర్ పరీక్షలకు హాజరైతే 5,60,889 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 3,82,116 మంది ఫెయిల్ అయ్యారు. ఫలితాల వివాదం తలెత్తిన తర్వాత 12 స్పాట్ వాల్యుయేషన్స్ సెంటర్స్ ద్వారా 5,831 మంది అర్హులైన అధ్యాపకులతో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశాం’.. అని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ దాఖలు చేసిన అఫిడవిట్లో విషయాల్ని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పైవిధంగా సూచన చేయడంతో అందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అందుకు 27 వరకూ సమయం కావాలని సంజీవ్‌కుమార్ కోరారు. తొమ్మిది లక్షల పైచిలుకు జవాబు పత్రాలకు 24 పేజీల చొప్పున బుక్లెట్ ఉంటుందని, ఇంత భారీ సంఖ్యలో పత్రాల్ని ఆన్లైన్లో అప్‌లోడ్‌కు సమయం కావాలన్నారు. పొరపాట్లు పునరావృతం కావొద్దనే.. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారని, గడువు ఇస్తే నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురౌతాయని, కనీసం రెండో ఏడాది ఇంటర్ ఫలితాలనైనా విడుదల చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది డి.దామోదర్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేసిందని, విద్యార్థుల భవిష్యత్ కోణంలో పరిశీలన చేయాలన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం చెప్పింది. రీకౌంటింగ్, రీట్యాలీ ప్రక్రియలను గ్లోబరీనా టెక్నాలజీస్ పూర్తి చేసిందని, ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక తర్వాత డేటా టెక్ మెథడెక్స్ అనే మరో ఏజెన్సీకి బాధ్యతలు అప్పిగించినట్లుగా ప్రభుత్వం చెబుతోందని, సమయం ఇవ్వకపోతే హడావుడిగా చేశారంటారని, ఉత్తీర్ణుల సంఖ్యలో తేడాలు వస్తే ఇంత జరిగినా ప్రభుత్వం తప్పు చేసిందంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలను ముందుగా ప్రకటించడం కూడా వీలుకాదని, ఇంటర్ రెండో ఏడాది రాసిన విద్యార్థుల్లో చాలా మంది మొదటి ఏడాది పరీక్షలు కూడా రాశారని, ప్రథమ, ద్వితీయ పత్రాలను వేరువేరు చేసేలా కంప్యూటర్ పోగ్రాం లేదని సంజీవ్ కుమార్ చెప్పారు. వాదనల అనంతరం ధర్మాసనం.. ఫలితాలు, మార్కుల జాబితా, జవాబు పత్రాలను ఆన్లైన్లో పొందుపర్చే మొత్తం ప్రక్రియను 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది. -
ఇంటర్ బోర్డు వివాదం.. ఈ నెల 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు. దాంతో ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్
-
ఓపెన్ ‘ఇంటర్’లో విశేష ప్రతిభ
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ శ నివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో నగర విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితాల సరళిని పరిశీలిస్తే.. నగరంలో గతేడాది కన్నా రెట్టింపు ఉత్తీర్ణత లభించింది. శివారులో కూడా ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగింది. గత ఏప్రిల్/మే నెలల్లో జరిగిన ఈ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి మొత్తం 4545మంది అభ్యర్థులు హాజరు కాగా 2385మంది( 52.48శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఉత్తీర్ణత 25.55 శాతం కన్నా తాజా ఉత్తీర్ణత 26.93 శాతం అధికం. రంగారెడ్డి జిల్లా నుంచి 8035 మంది పరీక్షలకు హాజరు కాగా, 3197మంది( 39.79శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కన్నా స్వల్పంగా ఉత్తీర్ణత(8.4శాతం) మెరుగైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం రూ.200, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఈనెల 25నుంచి 31వ తేదీ లోగా సమీప ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.