సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, ఇతరత్రా కారణాలతో ఫెయిలైన 3.28 లక్షల విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు, జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను ఈ నెల 27న బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 27వ తేదీలోగా విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్ ప్రతులను వెబ్‌సైట్‌లో పొందుపరుచాల్సివుంది. అందుకనుగుణంగా చర్యలు చేపట్టిన ఇంటర్‌బోర్డు ఈ నెల 27న అదే విషయాన్ని కోర్టు తెలియజేయాలని నిర్ణయించింది. కోర్టు అంగీకరిస్తే వాటిని అదే రోజు విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది.
రేపు ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు అప్‌లోడ్
Published Sun, May 26 2019 1:12 AM | Last Updated on Sun, May 26 2019 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment