సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు.
సీఎం కేసీఆర్ రంగప్రవేశం చేసి గంటల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment