marks list
-
Parenting Tips: పిల్లలందరూ బాగా రాయాలనే అనుకుంటారు! కానీ ఒక్కోసారి
How To Deal With Children When Scoring Low Marks: దసరా సెలవులు వచ్చేశాయి. పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాశారు.. కొందరు రాస్తున్నారు. అందరూ మార్కులు ఎన్నొచ్చాయో ఇంట్లో చెబుతారు. ఎక్కువ రావచ్చు.. తక్కువ రావచ్చు. పిల్లలతో ఎలా మాట్లాడాలి? మరో ఆరు నెలల కాలంలో వారు చదువులో ఎదగడానికి ఇప్పుడు మాట్లాడేదే ముఖ్యం.వారిని నొప్పించవద్దు. మరింత బాగా చదివేలా ఒప్పిద్దాం. వాటి గురించి పిల్లలు హుషారుగా ఎదురు చూసే ముందు పరీక్షలు వస్తాయని వారికి తెలుసు. అవి రాయాలి. మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రుల, టీచర్ల మెప్పు పొందాలి. ఆ తర్వాత సెలవుల్ని ఎంజాయ్ చేయాలి. తల్లిదండ్రులు కూడా పరీక్షలు బాగా రాయి... సెలవుల్లో ఫలానా చోటుకు తీసుకెళతాము అని చెబుతుంటారు. బాగా రాయడం అంటే బాగా రాయాలనే పిల్లలందరూ అనుకుంటారు. కాని సబ్జెక్ట్లన్నీ ఒకటి కాదు. పిల్లలందరూ ఒకటి కాదు. అన్ని సబ్జెక్టుల్లో అందరు పిల్లలూ ఒక్కలా తెలివి ప్రదర్శించలేరు. తెలివైన పిల్లలు కూడా ఇష్టపడని, సరిగా రాయని సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఇవాళ్టి పరీక్షలకు గత రెండు మూడు వారాల్లో ఏవైనా ఇంట్లో అవాంతరాలు, పిల్లలకు అనారోగ్యాలు వస్తే వాటి ప్రభావం ఉంటుంది. పరీక్షల సమయంలో తెలిసిన ప్రశ్నకు జవాబు తెలిసినా సరిగ్గా రాయకపోవడం ఉంటుంది. పరీక్షలు అయ్యాక పిల్లలు తెచ్చే జవాబు పత్రాలు, వాటిలో కనిపించే మార్కుల వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. కాని తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మార్కులు వందకు వంద, ఎనభైకు ఎనభై, యాభైకు యాభై, ఇరవై అయిదుకు ఇరవై అయిదు కనిపిస్తేనే ఆనందం. సంతోషం. బాగా చదివినట్టు లెక్క. మార్కులు మాత్రమే పిల్లలు బాగా చదివినట్టు నిరూపిస్తాయా? సంతృప్తికి హద్దు పూర్వం తల్లిదండ్రులు పరీక్షల్లో 60 శాతం మార్కులు వస్తే సంతోషపడేవారు. తర్వాత అది ఎనభైకి చేరింది. ఆ తర్వాత తొంభై శాతం మార్కులు తెచ్చిన పిల్లలను నలుగురికీ గర్వంగా చూపేవారు. ఇవాళ వంద శాతం తెచ్చుకుంటే తప్ప తల్లిదండ్రుల ముఖాలలో చిర్నవ్వు కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఎదుట ముఖం చెల్లుబాటు అయ్యేందుకు, తల్లిదండ్రుల తిట్లు (కొందరు కొడతారు) తప్పించుకునేందుకు ఆ సబ్జెక్ట్‌లు వచ్చినా రాకపోయినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే వొత్తిడి పిల్లలు ఎలా తట్టుకోవాలి? టీచర్లు సమర్థులేనా? పిల్లలు మార్కులు తెచ్చారు. వాటిని తల్లిదండ్రులు చూశారు. కొన్ని పేపర్లలో మంచి మార్కులు వచ్చాయి. కొన్నింటిలో తక్కువ వచ్చాయి. వెంటనే ఇరుగింటి వారి ముందు పొరిగింటి వారి ముందు తిట్టడం మొదలుపెట్టకూడదు. ‘గ్రేడ్స్ షేమింగ్’... అంటే ఇతర పిల్లల మార్కులు కనుక్కొని మన పిల్లల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అవమానించవద్దు. వారికి ఎందుకు వచ్చాయి నీకు ఎందుకు రాలేదు అని దబాయించవద్దు. మొదట పిల్లలతో మాట్లాడాలి. స్నేహంగా కూచోబెట్టుకోవాలి. సమస్య ఏమిటో అడగాలి. కొన్ని సబ్జెక్ట్‌లు ఎందుచేతనో పిల్లలకు పట్టుబడవు. కొందరు ఇంగ్లిష్‌లో బాగా చదివి లెక్కల్లో పూర్‌గా ఉంటారు. కొందరు సైన్స్ బాగా చదివి తెలుగు తప్పులు రాస్తారు. ఏ సబ్జెక్ట్‌లో వారికి ఎటువంటి సమస్య ఉందో తెలుసుకోవాలి. స్కూల్లో ఆ సబ్జెక్ట్‌లు చెప్పే టీచర్లతో వారికి స్నేహం ఉందా లేదా ఆ టీచర్లు ఆసక్తిగా చెబుతున్నారా కటువుగా చెప్తున్నారా తెలుసుకోవాలి. వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లు ఇంట్లోగాని ట్యూషన్ ద్వారా గాని చెప్పే అవకాశం గురించి ఆలోచించాలి. ఇవన్నీ లేకుండా మార్కులు తక్కువ వచ్చాయని దండనకు దిగడం పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. పిల్లలూ తప్పులు చేస్తారు పిల్లలు కూడా తప్పులు చేస్తారు. నిర్లక్ష్యంగా ఉంటారు. సరిగా చదవకుండా ఎలాగోలా రాయొచ్చులే అనుకుంటారు. తీరా పరీక్షలు రాశాక తెల్లమొఖం వేస్తారు. మార్కులు వచ్చాక చేసిన తప్పు తెలుసుకుంటారు. వారు కూడా తమకు వచ్చిన మార్కులకు సిగ్గు పడతారు. ఆ స్థితి గమనించి తల్లిదండ్రులు ‘పర్వాలేదు. ఈసారి జాగ్రత్త పడు’ అని చెప్పేలా ఉండాలి. ఇప్పుడు క్వార్టర్లీ రాశారు కనుక హాఫ్ ఇయర్లీ వరకూ ఇంప్రూవ్ కావాలని... యాన్యువల్ ఎగ్జామ్స్‌కు ది బెస్ట్‌గా ఎదగవచ్చని ధైర్యం చెప్పాలి. అందుకు తాము సాయం చేస్తామని భరోసా ఇవ్వాలి. తక్కువ మార్కులు వచ్చి అసలే ఇబ్బంది పడుతున్న పిల్లలను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. వాస్తవాన్ని అంగీకరించమని చెప్పాలి కష్టపడి చదివి రాయవలసినంత రాయి.. మార్కుల సంగతి ఆ తర్వాత అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లల ఆలోచనలు పరి పరి విధాలుగా పోయే అవకాశం ఉంది. తమ వాస్తవిక పరిస్థితిని వారు అంగీకరించి దానిని తల్లిదండ్రులకు చెప్పే వాతావరణం ఇంట్లో ఉండాలి. ‘అమ్మో మార్కులు తక్కువ వచ్చాయి. తిడతారు. ఎక్కువ వచ్చాయని అబద్ధం చెబుదాం’ అని పిల్లలు అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఫెయిల్ అయినట్టు లెక్క. ఒక్కోసారి మార్కులు తక్కువ వస్తే పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయారంటే ఆ తల్లిదండ్రులు ఇంకా దారుణమైన పెంపకం వహిస్తున్నట్టు. పిల్లలు ఎలాంటి ఇబ్బంది అయినా తల్లిదండ్రులతో చెప్పే స్నేహం అవసరం. అందుకు సమయం ఇస్తున్నామా లేదా అని తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి. క్వార్టర్లీ పరీక్షలు మీ పిల్లల పరిస్థితిని, వారి పట్ల మీ అవగాహనను తెలియచేశాయి. వార్షిక పరీక్షలకు పిల్లలతో పాటు మీరు వారితో కలిసి ప్రయాణించడానికి ప్రేమతో, ఓర్పుతో, స్నేహంతో దారి వేసుకోండి. పిల్లలను ఉత్సాహపరిస్తే అద్భుతాలు చేస్తారు. బెదరగొడితే చతికిల పడతారు. గమనించండి. ప్రోత్సాహకాలు పిల్లలు బాగా చదివితే ప్రోత్సాహకాలు ఇచ్చి తల్లిదండ్రులు వారిని ఉత్సాహపరచాలి. రోజూ వారితో పాటు కాసేపు కూచుని వారు చదువుకుంటూ ఉంటే మెచ్చుకోవాలి. వారికి సందేహాలుంటే తాము తీర్చగలిగితే తీర్చాలి. లేదా వారి అనుమతితో (వారు వద్దంటే వద్దు) ట్యూషన్లు పెట్టాలి. అన్నింటి కంటే ముఖ్యం ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి దసరా సెలవుల వంటి సందర్భాల్లో కూచోబెట్టి బలవంతంగా చదవమని శిక్ష విధించకూడదు. పిల్లలు వారి సరదా సమయాలను ఎంజాయ్ చేయనివ్వాలి. అదే సమయంలో బాగా చదవడం వారి బాధ్యత అని వారికి తెలియచేయాలి. చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే.. -
‘చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ రంగప్రవేశం చేసి గంటల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాసైనా ఫెయిలే..
పర్సనల్ ఐడెంటిఫికేషన్లో నిగ్గుతేలుతున్న నిజాలు తప్పుల తడకగా మార్కుల జాబితాలు ఆందోళనలో విద్యార్థులు నందగోపాల్ (పేరు మార్చాం) డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాశాడు. పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫెయిల్ చేశారు. డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టులు 70 శాతం పైగా వచ్చాయి. దీంతో పీజీలో ర్యాంకు వచ్చినప్పటికీ అవకాశం దక్కలేదు. ప్రతిభావంతుడైన విద్యార్థి కావడంతో అనుమానం వచ్చింది. పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నాడు. తీరా చూస్తే ఉత్తీర్ణుడయ్యాడు. అపుడు మార్కులు సరిగా లెక్కించకపోవడంతో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. ఇలా నందగోపాల్ ఒక్కడే కాదు ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు. ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనంలో అధ్యాపకుల నిర్లక్ష్యానికి విద్యార్థులు బలిఅవుతున్నారు. కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిల్ అయినట్లు నిర్ధారించడంతో బాధిత విద్యార్థులు లబోదిబోమంటున్నారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్లో నిజాలు నిగ్గుతేలుతున్నాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం అనంతరం ప్రత్యేకంగా స్రూటినీ చేస్తారు. అవార్డు షీట్లో మార్కులు వేసిన తరువాత యూజీ విభాగంలోని బోధనేతర సిబ్బందితో స్పెషల్ అసిస్టెన్స్ నిర్వహిస్తారు. ఆవార్డుషీట్, జవాబు పత్రంలోని మార్కులు మధ్య వ్యత్యాసాలను పరిశీలిస్తారు. అయినప్పటికీ తప్పిదాలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్క్స్కార్డుల్లో మార్కుల గల్లంతు ప్రొవిజనల్ మార్క్స్ కార్డులు కూడా తప్పుల తడకగా మారాయి. భాస్కర్ అనే విద్యార్థికి వాస్తవానికి పేపర్ – 2 లో 1226 మార్కులు రావాల్సి ఉంది. కానీ 1150 మార్కులుగా తప్పుల తడకగా నమోదు చేశారు. మూల్యాంకనంతో పాటు మార్కుల నమోదులోనూ సిబ్బంది తాత్సారం స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు కూడా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో విద్యార్థుల గోడును పట్టించుకునేనాథుడే కరువయ్యారు. -
మార్కుల లిస్ట్ లో మంత్రి ఫొటో!
ముంబై: మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మరో వివాదానికి తెర తీశారు. విద్యార్థుల మార్కుల లిస్టులపై తన ఫొటోను ప్రచురించి ముక్కున వేలేసుకునేలా చేశారు. బుధవారం పంపిణీ చేసిన పదో తరగతి సామర్థ్య పరీక్ష మార్కుల లిస్టుల్లో వినోద్ తావ్డే ఫొటో ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. విద్యార్థులకు అభినందనల సందేశంతో పాటు, ఈ పరీక్ష ఎందుకు నిర్వహించారో వివరిస్తూ మార్కుల లిస్టులో వినోద్ తావ్డే ఫొటో ప్రచురించారు. విద్యార్థుల మార్కుల లిస్టులను సొంత ప్రచారాలకు వాడుకోవడం తగదని సీనియర్ ఉపాధ్యాయుడొకరు వ్యాఖ్యానించారు. అంతకుముందు వినోద్ తావ్డే ఇంజనీరింగ్ పట్టాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన అప్టిట్యూడ్ పరీక్షను 15 లక్షల మందిపైగా విద్యార్థులు రాశారు. పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలు, అభిరుచుల గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్రలో తొలిసారిగా ఈ పరీక్ష నిర్వహించారు. -
ఇంటర్ విద్యార్థులకు 'ఆధార్' పరీక్ష
- జిల్లాలో ఆధార్ కార్డులు లేని 10వేల మంది విద్యార్థులు - ఆధార్ నంబర్ అప్లోడ్ కాకపోతే ఫలితాల నిలిపివేత - ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇక ఆధార్ కార్డు కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులందరూ ఆధార్ నంబరును సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధన విధించడమే ఇందుకు కారణం. ఆధార్ నంబరు లేకుండా పరీక్ష రాసినా... వారి ఫలితాలను నిలిపివేస్తామని బోర్డు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలల్లో ఆధార్ పరీక్షను పూర్తిచేసుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు ఆధార్ నంబరు సమర్పించలేదు. ఆధార్ కార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తమ పిల్లలకు ఆధార్ కార్డులను వీలైంత త్వరగా తీసుకొచ్చి కళాశాలల్లో ఇచ్చేందుకు తల్లిదండ్రులు నానా హైరానా పడుతున్నారు. ఆధార్ ఎందుకంటే... ఇంటర్ మార్కుల జాబితాను మరింత పకడ్బందీగా జారీచేయడం కోసమే ఆధార్ నంబరు స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జారీచేసే మార్కుల జాబితాలో విద్యార్థి పేరు, ఇతర వివరాలతోపాటు ఆధార్ నంబరు కూడా ఉంటుంది. తద్వారా నకిలీ మార్కులిస్టులను నిరోధించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మా ర్కుల లిస్టు పోయినవారు మళ్లీ కావాల్సివస్తే సులభంగా పొందేందుకూ అవకాశం ఉంటుంది. జిల్లాలో 95 శాతం పూర్తి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 64,590 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 65,989 మంది ఉన్నారు. గత నెల రోజులుగా ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించి 95 శాతం మేర ఆధార్ వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 1,21,630 మంది విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆప్‌లోడ్ చేశారు. మరో పది వేల మంది వరకు ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐవో ఎన్.రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థుల రికార్డుల భద్రత కోసమే ఆధార్ ఆప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి ప్రాక్టికల్స్ గురువారం నుంచి మార్చి 4 వరకు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 51 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.