
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోవాలని మంచి నీళ్లు ఇచ్చేందుకు దీనిని వైఎస్ చేపట్టారు. ఫ్లోరైడ్‌తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గుర్తించి.. శ్రీశైలం నీళ్ళు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు. రూ.1925 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కావాల్సి ఉండే.. కానీ కాలేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది.’’ అని జగ్గారెడ్డి తెలిపారు.
‘‘హరీష్‌రావు ఆర్థిక మంత్రిగా.. ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకు?. హరీష్‌రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే.. అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. హరీష్‌రావు గొంతు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ. కిషన్ రెడ్డి బీసీలను అణచివేస్తుందని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు’’ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment