సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్‌ఎస్ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి. సీఎం రేవంత్‌ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.
రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్‌ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్ రావు సహా, బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా తీశారు. బీఆర్‌ఎస్ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: రేవంత్.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment