సంగారెడ్డికి మెట్రో వేయండి.. | MLA Jagga Reddy Demands Of Metro Rail Services Up To Sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డికి మెట్రో వేయండి..

Published Mon, Feb 13 2023 1:31 AM | Last Updated on Mon, Feb 13 2023 1:31 AM

MLA Jagga Reddy Demands Of Metro Rail Services Up To Sangareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ నుంచి సంగారెడ్డి రాంమందిర్‌ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు.

అదే విధంగా గ్రూప్‌–1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.  సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్‌ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్‌లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement