సాక్షి, సంగారెడ్డి జిల్లా: 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. గురువారం పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్‌చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినట్లు చెప్పారు. పటాన్‌చెరులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడస్తున్నాయన్నారు. పటాన్‌చెరుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని, మూడు మున్సిపాల్టీలకు రూ. 30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
‘ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో తీసుకొచ్చాం. 15 రోజుల్లోనే అనుమితచ్చేలా చర్యలు చేపట్టాం. అధికారుల టేబుల్‌పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1000 ఫైన్ వేస్తున్నాం. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉండటం తెలంగాణకు గర్వకారణం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
చదవండి: డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment