multi speciality hospital
-
మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, సంగారెడ్డి జిల్లా: 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. గురువారం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పటాన్చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినట్లు చెప్పారు. పటాన్చెరులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడస్తున్నాయన్నారు. పటాన్‌చెరుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని, మూడు మున్సిపాల్టీలకు రూ. 30కోట్ల నిధులు, మూడు డివిజన్లకు రూ.30కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చాం. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో తీసుకొచ్చాం. 15 రోజుల్లోనే అనుమితచ్చేలా చర్యలు చేపట్టాం. అధికారుల టేబుల్‌పై ఫైల్ ఆగితే రోజుకు రూ. 1000 ఫైన్ వేస్తున్నాం. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉండటం తెలంగాణకు గర్వకారణం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే.. -
సేవా సంపన్నత
అది 1993, సెప్టెబర్ 13వ తేదీ. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందో పీజీ స్టూడెంట్. ఆ అమ్మాయి కడపలో దిగాలి. నడవలేని వ్యక్తి, అతడికి సహాయంగా మరో వ్యక్తి కూడా అదే కంపార్ట్మెంట్లో ఎక్కారు. రైలు కదిలింది. ఆ నడవలేని వ్యక్తి సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ‘మేము తినాలి, పడుకోవాలి. మీరు లేవండి’ అని గట్టిగా చెబుతున్నారొకరు. అప్పుడర్థమైందా అమ్మాయికి ఆ వ్యక్తికి రిజర్వేషన్ లేదని... ఆ బెర్తును రిజర్వ్ చేసుకున్న వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని! అంతే... సీట్లో స్థిమితంగా కూర్చోవడం కష్టమైందామెకి. ఎదుటి వారు కష్టంలో ఉంటే ‘నాకెందుకు, నా బెర్త్ నాకుంది చాలు’ అనుకోలేని సున్నితమైన గుణమే... ఈ రోజు ఆమెను ఓ శ్రీమంతురాలిని చేసింది. శ్రీమంతుడు సినిమాలో రీల్ హీరో మహేశ్ బాబు ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం మనకు తెలుసు. ఈ రియల్ శ్రీమంతురాలు కామారెడ్డి జిల్లా, సీతారామ పల్లి గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్రీమంతురాలి పేరు మారంరెడ్డి రజనీరెడ్డి. తండ్రి కడప గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. పెళ్లితో పాతికేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జనగామలో అడుగుపెట్టారు. ఎల్ఐసీ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన లైఫ్ జర్నీని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది విద్యావంతుల కుటుంబం. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యంగా ఉండేది. నా భర్త నన్ను బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర దించి తాను ఆఫీస్‌కి వెళ్లాలని, సాయంత్రం పికప్ చేసుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరాలని... నా ఊహలు సాగుతుండేవి. మా వారిది వ్యవసాయ కుటుంబం. ఆడవాళ్లు పెద్ద చదువులు చదవడం, ఉద్యోగం చేయడం అలవాటు లేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కోడలిగా రావడం మా మామయ్యకు ఇష్టంగా ఉండేది. కానీ ‘మన గ్రామాల్లో ఉండగలదా’ అనే సందేహం ఇంట్లో వాళ్లలో. మా అత్తమ్మ మాత్రం ‘ఒకమ్మాయికి మాట ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి పోకూడదు’ అని మా వారికి మద్దతుగా నిలిచింది. అలా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చాను. గొప్ప మలుపు అప్పట్లో మా దగ్గర డబ్బు పెద్దగా ఉండేది కాదు. ఓ రోజు మావారు ఒక దోమకొండ కుర్రాడి గురించి చెప్పారు. ఆ కుర్రాడికి టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. కాలేజ్ ఫీజులు కట్టడం కూడా కష్టమే. దాంతో కాలేజ్ వాళ్లతో మాట్లాడి ఫీజు తగ్గించి, ఆ కుర్రాడికి ఐదు వేలు ఇవ్వగలిగాం. సుభాష్ బిల్డర్‌గా కామారెడ్డిలో చిన్న కాంట్రాక్ట్‌లు చేసినప్పటికీ జీవితం అప్పటికింకా గాడిలో పడలేదు. 2004లో హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి కూడా మినిమమ్ గ్యారంటీ నా ఉద్యోగమే. అయితే హైదరాబాద్ రావడం మా లైఫ్‌లో గొప్ప టర్నింగ్ పాయింట్. ఒక ఏడాదిలోనే నిలదొక్కుకోగలిగాం. మరో ఏడాదికి భరోసా వచ్చింది. ‘కష్టపడినంత కాలం కష్టపడ్డావు, రోజూ హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉద్యోగం మానేయచ్చు కదా’ అన్నారు. చదువుకోవడానికి వచ్చే బంధువుల పిల్లలతో నాకు ఇంటి బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. సమాజం గురించి ఆలోచించే సమయం వచ్చింది కూడా అప్పటి నుంచే. మా ఊరికి అవసరమైన పనులు చేసే వెసులుబాటు కూడా వచ్చింది. భర్త చదువుకున్న స్కూల్ జనగామలో ‘ఇంటిగ్రేటెడ్ సచివాలయం’ పేరుతో పంచాయితీ భవనం కట్టాం. అన్ని ఆఫీసులూ అందులోనే. ఆ తర్వాత లైబ్రరీ, వీథుల్లో ఎల్ఈడీ లైట్లు కూడా వేయించాం. మా ఊరిని చూసి పొరుగు గ్రామాల వాళ్లు కూడా అడిగేవాళ్లు. అలా మరో 30 గ్రామాలకు కూడా ఎల్ఈడీ లైట్లు వేయించాం. మంచి నీటి కోసం ఐదు గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు పెట్టించాం. బీబీపేటలో మా వారు చదువుకున్న స్కూల్‌ని పునర్నిర్మించాం. ఆ స్కూల్‌ని చూసిన వాళ్లు మా వారి చేతికి ఎముకలేదంటుంటారు. కోటితో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆరు కోట్లకు చేరింది. ఆయన బిల్డర్ కావడం తో నాణ్యత విషయంలో రాజీ పడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే... మా ఊరిలో పేదవాళ్లకు ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే. ఆ బడ్జెట్ నుంచి మిగుల్చుకోవడానికే చూస్తారెవరైనా. అత్తమామలు సుశీల – నారాయణ రెడ్డిల పేరిట బీబీపేటలో కట్టించిన స్కూల్ ఆయన మాత్రం ప్రతి ఇంటికి అదనంగా రెండు లక్షలు కలిపి యాభై రెండు ఇళ్లు మంచి క్వాలిటీతో కట్టారు. మన ఊరి వాళ్లకే కదా, లెక్క చూసుకోవడం ఎందుకన్నారు. మా ఊరితోపాటు జంగంపల్లిలో మరో యాభై ఇళ్లను కూడా అలాగే కట్టారు. నాలుగు నెలల కిందట సీతారామపల్లిని దత్తత చేసుకున్నాం. ఆరు వందల జనాభా ఉన్న గ్రామం అది. ఊరంతా డ్రైనేజ్ పనులు, సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి. ఇక ఇంటిగ్రేటెడ్ సచివాలయం, కమ్యూనిటీ హాలు, లైట్లు... చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇళ్లకు మంచి నీటి సరఫరా లైన్లు మామూలుగా వేస్తే ఊరంతటికీ సమంగా అందవు. కొన్ని ఇళ్లకు ప్రెషర్ బాగా ఉంటుంది, కొన్ని వీథులకు యావరేజ్‌గా, మరికొన్ని ఇళ్లకు అరకొరగా అందుతాయి. ఆ ఇబ్బంది లేకుండా న్యూమాటిక్ సిస్టమ్ అనుసరించాలని ఎక్స్‌పర్ట్‌లతో మాట్లాడుతున్నాం’’ అని వివరించారు రజని. ఇరవై శాతం సమాజం కోసం సమాజం కోసం ఇంతగా చేస్తున్నా ఎప్పుడూ వార్తల్లో కనిపించరామె. ‘‘గ్రౌండ్ వర్క్ నాది, ప్రశంసలందుకునేది మా వారు. మహేశ్‌బాబు నుంచి కేటీఆర్ వరకు ప్రశంస లు కురిపించేది ఆయనకే. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం లాభాలు సొసైటీ కోసమే అనే నియమం పెట్టుకున్నాం. ఆయన లాభాలెంత, మిగులు ఎంత అనే లెక్క నా దగ్గరే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త పని తీసుకోవచ్చు, ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చనే అంచనా కూడా నాకే బాగా తెలుసు. తన ఖర్చులకు కూడా డబ్బు నేనే ఇవ్వాలి’’ అన్నారామె నవ్వుతూ. వీటితో సంతృప్తి చెందినట్లేనా ఇంకా చేయాలనుకుంటున్నవేమైనా ఉన్నాయా అన్నప్పుడు... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు రజని. ‘మంచి వైద్యం కోసం మా గ్రామాల వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కువమందికి అనువైన ప్రదేశం చూసి చారిటీ హాస్పిటల్ కట్టించాలి. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలి. కంఫర్టబుల్‌గా జీవించే అవకాశం వచ్చింది, ఇప్పుడైనా పదిమందికి ఉపయోగపడాలి కదా’ అన్నారామె సౌమ్యంగా. తన బెర్త్‌ను దివ్యాంగుడికి ఇచ్చి తాను నిలబడిన నాటి సౌమ్యతే ఇప్పుడు కూడా ఆమె మాటల్లో. రియల్ లవ్ స్టోరీ మా పరిచయం చాలా సినిమాటిక్‌గా, రీల్ లవ్‌స్టోరీలా జరిగింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వెళ్తున్నాను. ఆమె కడపకు వెళ్తోంది. చాలా సేపటి నుంచి నిలబడి ఉంది... బహుశా టికెట్ కన్ఫర్మ్ కాలేదేమో అనుకుని పలకరించాను. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్‌కి తన బెర్త్ ఇచ్చి తాను నిలబడి ఉండడం నా మనసును కదిలించింది. అలా మాటలు కలిశాయి. ఆమె రైలు దిగి వెళ్లి పోతే ఇక ఎప్పటికీ కనిపించదేమోనని భయం పట్టుకుంది. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. పేపర్ మీద నా అడ్రస్ రాసి, ‘నేను తిరుపతి నుంచి తిరిగి మా ఊరికి వెళ్లేటప్పటికి మీ నుంచి ఉత్తరం ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆ కాగితాన్నిచ్చాను. నేను కోరుకున్నట్లే ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ప్రతి పనిలో నన్ను వెన్నంటి నడిపిస్తోంది. మనం సెటిల్ అయిన తర్వాత లాభాల్లో మిగులును సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన పాలసీనే నేను ఫాలో అయిపోతున్నాను. – టి. సుభాష్ రెడ్డి, ఎం.డి, కెడాల్ డెవలపర్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
రూ.240 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.. శంకుస్థాపనకు సీఎం జగన్
సాక్షి, తిరుపతి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో నిర్మించనున్న చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మే 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చి ఆస్పత్రిని, బర్డ్‌లో స్మైల్ ట్రైన్ వార్డును, మొదటి విడతలో పూర్తయిన శ్రీనివాససేతును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆస్పత్రి స్థలాన్ని, టాటా క్యాన్సర్ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో తాత్కాలికంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించామని, ఆరునెలల్లో 300 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామని చెప్పారు. చదవండి: (తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..) -
గరీబుకూ ..ఖరీదైన వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన వైద్యసేవలు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకూడదనే ఆలోచనతో హైదరాబాద్ నలు దిక్కులా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా నివసిస్తోందని, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా బాగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రమే వైద్య సేవల భారం మొత్తం పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) పేరుతో హైదరాబాద్ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అందుబాటులో ఖరీదైన వైద్య సేవలు ‘ఏ సమస్య వచ్చినా గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్కో పరిగెత్తకుండా ఈ ఆసుపత్రుల నిర్మా ణం ద్వారా నగరానికి నలువైపులా (ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ ఉంది) నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆసుపత్రు లతో కలిపి మొత్తం 6 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో 1,000 నుంచి 1,500 వరకూ ఐసీయూ పడకలు ఉండేలా చూస్తున్నాం. నిమ్స్‌లో కూడా 2 వేల పడకలను పెంచుతు న్నాం. టిమ్స్‌లో అన్ని సేవలతో పాటు వందో, రెండు వందల పడకలతోనో ప్రత్యేకమైన ప్రసూతి కేంద్రం కూడా ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్లీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకోవాలి..’అని సీఎం అన్నారు. పటిష్టమైన వైద్య వ్యవస్థతో తక్కువ నష్టం ‘మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే.. నేను బేజారై కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా భవిష్యత్తులో రానున్నాయన్నారు. కాబట్టి కరోనా లాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వైరస్లు లేకుం డా చేసే వ్యవస్థ లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వారు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎక్కడైతే వైద్య వ్యవస్థ బాగా ఉండదో అక్కడ లక్షల మంది చనిపోతారు. విద్య, వైద్యం పేదలకు అందాలనేదే మా లక్ష్యం. వైద్య విద్య మీద బాగా దృష్టి పెట్టనున్నాం. కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. టీకా సెంటర్‌గా హైదరాబాద్ ‘ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకి వచ్చి తమ సంస్థలు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం వల్లే హైదరాబాద్‌లో 7 ఏళ్లలో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 10–15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, యూనివర్సిటీ తేనున్నాం. ప్రపంచంలోనే 33% టీకాలు తయారు చేసే సెంటర్ హైదరాబాద్..’అని సీఎం పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం ‘మనది కొత్త రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇవన్నీ ఎప్పటినుంచో పెద్ద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ మన తలసరి ఆదాయం వీటన్నింటినీ మించి నమోదైంది. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తెలంగాణ పచ్చబడాలె, ఇంకా ముందుకు పోవాలె. దేశానికి తలమానికంగా ఉండేలా మారాలె. దాని కోసం ఎంతధైర్యంగానైనా ముందుకు పోతాం. ఎవరితోనైనా పోరాడతాం..’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల, సబిత, తలసాని, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, సంతోశ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. టిమ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న దవాఖానా కట్టరు. ఇక్కడ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. వీటి ద్వారా నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు.అన్ని మతాలు, కులాలని సమానంగా ఆదరించే గొప్ప దేశం మనది. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ గాకుండా పోతాం. సామరస్యతను దెబ్బతీసే కేన్సర్ లాంటి జబ్బు మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. కానీ దేశంలో కరెంటు ఉంటే వార్త. ప్రధాని ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ఏడేళ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకూ ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు ‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు (మంగళవారం) రాజకీయ సభలు జరుపుతున్నాయి. కానీ మనం కంటోన్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదీ వాళ్లకు మనకూ ఉండే తేడా. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం వచ్చాక మారిన పరిస్థితులు చూడాలి. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు. ఫలానా వాళ్ల షాపులో ఇది కొనొ ద్దు. అది కొనొద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు. దీనిపై ప్రజలుగా మీరు ఆలోచన చేయాలి. కొందరు కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మతపిచ్చి అనేది ఏదో తాత్కాలికంగా మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. విదేశాల్లో పనిచేస్తున్న 13 కోట్ల మంది భారతీయుల్ని ఇలాగే వెనక్కి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అందువల్ల అటువంటి సంకుచిత ధోరణులకు తెలం గాణలో ఆస్కారమివ్వొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
అందరికీ ‘ఆర్టీసీ’ వైద్యం!
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిలో సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. తాజాగా దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వసతులు మెరుగుపరచాలని, ఇతరులకు కూడా వైద్యం అందించేలా రూపొందించాలని భావిస్తోంది. విశాలమైన ప్రాం గణం, పెద్ద భవనాలు అందుబాటులో ఉన్నందున, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, అదే సమ యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా సమకూరుతుందనేది ఆలోచన. కాగా ఈ ప్రక్రియను క్రమంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. సరిపడ నిధులు, పర్యవేక్షణ లేక పడక ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించిన ఈ ఆసుపత్రి ఆ తర్వాత పర్యవేక్షణ లేక పడకేసింది. చాలినన్ని నిధులు లేక వసతులు కూడా మృగ్యమయ్యాయి. క్రమంగా వైద్యుల కొరత ఏర్పడింది. కావాల్సిన మందుల సరఫరా లేక బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం అందక రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్క సంవత్సరంలో చెల్లించే రెఫరల్ బిల్లులను ఆసుపత్రిపై వెచ్చిస్తే అది మెరుగ్గా మారుతుందన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వంపై ఆధార పడకుండా.. తాజాగా దీనావస్థలో ఉన్న ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను విస్తరించటం ద్వారా వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తేవాలని నిర్ణయించారు. దీనికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విధానం ద్వారా నిధులు సమకూర్చు కోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధమైంది. ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు. ఇటీవలే డయాలసిస్ కేంద్రాన్ని మొదలుపెట్టారు. త్వరలో సహాయ సిబ్బంది నియామకం ఆస్పత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించుకుని, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోబోతున్నారు. ఇందులో నర్సులు, డయాలిసిస్ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. సంస్థ ఎండీ సజ్జనార్ బుధవా రం వరకు సెలవులో ఉన్నారు. గురువారం ఆయన అనుమతితో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఆధునిక వైద్య పరికరాలు, బెడ్లకు కావాల్సిన నిధుల సమీకరణ జరుగుతోంది. కోవిడ్ సెంటర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. విశ్రాంత సర్జన్ ఆధ్వర్యంలో.. గతంలో గాంధీ ఆసుపత్రిలో కీలక పోస్టులో కొన సాగి పదవీ విరమణ పొందిన ఓ సర్జన్‌కు తార్నాక ఆసుపత్రి విస్తరణ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన కొద్ది రోజులుగా దగ్గరుండి దీనిని నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ తరహాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సూచనలు అందిస్తోంది. -
లింగ నిర్ధారణ కేసులో ఎవరి పాత్ర ఎంత?
సాక్షి, కామారెడ్డి: పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ చిక్కిన కౌసల్య ఆస్పత్రి నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అబార్షన్లు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గత గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడ, మగ అన్నది వెల్లడించగా నిర్వాహకుడిని పట్టుకున్నారు. ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అర్హతలు లేని వ్యక్తి స్కానింగ్ చేయడం, లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం వంటి వాటిని గుర్తించిన అధికారులు ఆస్పత్రి యజమానిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేసిన విష యం తెలిసిందే. పట్టణ పోలీసులు ఆస్పత్రి నిర్వాహకుడు సిద్ధిరాములుపై 312, 420, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్(గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష) తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. అధికారుల సీరియస్ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది లింగ నిర్ధారణ పరీక్షల్లో ఏ మేరకు భాగమయ్యారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పరీక్షలు చేయడే కాకుండా అబార్షన్లు కూడా నిర్వహించడాన్ని వైద్య ఆరోగ్యశాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. దీనిపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది పాత్రపై కూపీ లాగుతున్నారు. ఎంత మందికి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపారు ? ఎన్ని అబార్షన్లు చేశారన్నదానిపై లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి చాలా మంది పరీక్షల కోసం ఇక్కడికి వచ్చి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అబార్షన్లు కూడా నిర్వహించినా ఇంతకాలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. తప్పించుకునే యత్నం ఆస్పత్రి యాజమాన్యం కేసులో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కేసులో అరెస్టు కా కుండా ఉండి, కేసు తీవ్రతను తగ్గింపజేసుకోవడం ద్వారా కేసులో నుంచి బయటపడాలని ప్రయతి్నస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడానికి వైద్యు లు, సిబ్బంది సహకారం కచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి పాత్రను గుర్తించే పనిలో పోలీసులు ఉండగా, వారిని తప్పించేందుకు యాజమాన్యం ప్రయతి్నస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఆస్పత్రి యజమానిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతు న్నామని సీఐ మధుసూదన్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎవరి పాత్ర ఎంతన్నదానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ఆడబిడ్డ అయితే ‘సీత కష్టం’.. మగబిడ్డ అయితే 'రామ రామ'
సాక్షి, కామారెడ్డి: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కౌసల్య ఆస్పత్రి గుట్టు రట్టయింది. లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఇష్టారీతిన అబార్షన్లు చేస్తున్న వైనాన్ని అధికార యంత్రాంగం బట్టబయలు చేసింది. ఆస్పత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొంత కాలంగా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో గురువారం ‘డెకాయ్ ఆపరేషన్’ నిర్వహించారు. అక్కడ గర్భిణికి లింగ నిర్ధారణ స్కానింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆడో, మగో నిర్ధారించి చెబుతున్న విషయాన్ని గమనించి దాడులు నిర్వహించారు. స్కానింగ్ కూడా ఎలాంటి అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తుండడం, లింగ నిర్ధారణ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుండడంతో ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో అబార్షన్లు కూడా నిర్వహిస్తుండడం, స్కానింగ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యంపై పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. కోడ్ భాషలో చెప్పేస్తారు.. కౌసల్య ఆస్పత్రిలో కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెరుగుతున్నది ఆడ బిడ్డ అయితే ‘సీత కష్టం’ అని, మగ బిడ్డ అయితే ‘రామ రామ’ అని కోడ్ భాషలో చెబుతారు. సీత కష్టం అనగానే చాలా మంది అబార్షన్ చేసుకోవడానికి డాక్టర్‌తో ధర మాట్లాడుకుంటున్నారు. ‘రామ రామ’ అని చెప్పడంతో ఆనందంతో ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఈ ఆస్పత్రి వ్యవహారంపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సరైన ఆధారాలు లేక అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిహద్దులు దాటి వస్తున్నారు.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోధన్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్, ధర్మాబాద్, ఔరద్ తదితర ప్రాంతాల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఆడ బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి అర్హతలు లేని వారు అబార్షన్లు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అబార్షన్లకు రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధే అన్నీ.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ మాజీ ప్రజాప్రతినిధి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి అర్హలు లేకున్నా తనే రేడియాలజిస్టు అవతారం ఎత్తి స్కానింగ్‌లు చేయడం, లింగ నిర్ధారణ వివరాలు బయటకు చెబుతూ దండుకుంటున్నట్టు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. వైద్యుల కుటుంబానికి చెందిన సదరు ఆస్పత్రి యజమాని సొంతంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుని ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదించిన సదరు యజమాని.. శ్రీరాంనగర్ కాలనీలోనే సొంత భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఆస్పత్రి సీజ్, యజమానిపై కేసు.. కౌసల్య ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించిన అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. యజమాని సిద్దిరాములుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపులో పెరుగుతన్న బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ తెలిపారు. స్కానింగ్ చేసిన వారితో పాటు ప్రోత్సహంచిన వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆడ పిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గడానికి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని ఆమె చెప్పారు. -
విపరీతంగా జ్వరం వస్తే రెండే రెండు గోళీలు వేసుకోమన్నారు డాక్టర్లు: కేసీఆర్
-
వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ పరిశ్రమల కేంద్రంగా కావాలని ఆయన తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ రూరల్ వరంగల్ జిల్లాగా ఉంటుందన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఉంటాయన్నారు. వరంగల్ కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు చాలా బాగున్నాయన్నారు. నిన్ననే వరంగల్ జిల్లాలకు వెటర్నరీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ పేరు కూడా మార్చాలన్నారు. అది బ్రిటిష్ కాలంలో పెట్టిన పేరు అని తెలిపారు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ సమస్యలు తీరాయన్నారు. పారదర్శకత పెరిగితే పైరవీలు ఉండవన్నారు. వరంగల్ విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి పాత తాలుకాలో మాతాశిశు సెంటర్లు రావాలని, వరంగల్‌కు డెంటల్ కాలేజీతోపాటు ఆస్పత్రి మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. వైద్యరంగంపై దాడులు సరికావు ‘వైద్యరంగం మీద దాడులు సరికావు. చైనాలో 28 గంటల్లో 10 అతస్తుల భవనం కట్టారు. ఏడాదిన్నరలో ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలి. ప్రపంచంలోనే వైద్య సేవలు కెనడాలో బాగున్నాయని అంటారు. అక్కడ వైద్య శాఖ అధికారులు పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలి. కరోనాపై దుష్ప్రచారం సరికాదు. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వస్తే టెంపరేచర్ పెరుగుతుంది. విపరీతంగా జ్వరం వస్తే రెండే రెండు గోళీలు వేసుకోమన్నారు డాక్టర్లు. పారసిటమాల్ లేదా డోలో గోలి. ఇంకేం అవసరం లేదు. రెండోది ఏందయ్యా అంటే ఏదన్న ఒక యాంటీ బయాటిక్ గోలీ వేసుకోమన్నారు. మీ శరీరానికి ఏదైతే మంచిగ పడుతదో ఆ యాంటీ బయాటిక్ వేసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దు. జైలు కూల్చతే నాకేమైనా వచ్చేది ఉందా. అయినా కూడా కొందరు విమర్శించారు. ఆశా వర్కర్లు ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేశారు. వాళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వరంగల్‌లో కరువు మాయం కావాలి. దేవాదుల ప్రాజెక్టు వరంగల్ జిల్లాకే అంకితం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం పరితపించారు. 50 ఏళ్లు పోరాటం చేశారు. జులై 1-10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు చదవండి: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన -
వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న ఎంజీఎం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీని సీఎం ప్రారంభించారు. అలాగే హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించానున్నారు. తరువాత ఎక్సైజ్ కాలనీలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో భోజనం చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. చదవండి: నేడు యాదాద్రికి కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి -
21న భూమిపూజ: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం..
హైదరాబాద్ నుంచి కూడా రోగులు వైద్యం కోసం వరంగల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేలా ఈ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, పక్క రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు, ఇతరచోట్ల నుంచి ఎయిర్ అంబులెన్సుల్లో రోగులను ఇక్కడకు తరలించేలా హెలీప్యాడ్ ఏర్పాటు ఎలాంటి వైరస్లు వచ్చినా వాటికి దీటుగా చికిత్స అందించేలా, పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్ ఆస్పత్రులను సైతం తలదన్నేలా.. వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం.. ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 24 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇలాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదని, కెనడాలో ఉన్న ఒక ఆసుపత్రిని మోడల్‌గా తీసుకొని దీన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కెనడా వెళ్లి ఆ ఆసుపత్రిని పరిశీలించి రావాలని సూచించారు. ముఖ్యమంత్రే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నందున ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణానికి, అందులో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలో, 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. రెండు వేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు ఉంటాయి. దాదాపు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పనిచేస్తారు. మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రై నాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు దాదాపు ఐదు అంతస్తుల్లో ప్రత్యేకంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఆక్సిజన్, వెంటిటేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా విదేశాల నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ప్రతి అంతస్తులోనూ బాగా గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
మురళీకృష్ణ ఆసుపత్రికి నోటీసులు
సాక్షి, పశ్చిమగోదావరి: అనధికారికంగా కోవిడ్ బాధితులకు వైద్యం చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యశాఖ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల సోదాలనంతరం ఆసుపత్రి లోని పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి లేకున్న చికిత్స చేసినట్లు అధికారులు ద్రువీకరించారు. కాగా 11మంది చికిత్స పొందుతూ మృతి చెందినా, ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కరోనా చికిత్స పేరుతో లక్షల రుపాయలను యాజమాన్యం వసూలు చేసిందని, అయితే గరిష్ఠంగా తొమ్మిది లక్షల రూపాయలను మురళీకృష్ణ ఆసుపత్రి వసూళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. 15 రోజులలో వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి ఎండీ మురళీకృష్ణ కు వైద్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ పదిహేను రోజుల పాటు ఆసుపత్రి సేవలు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. కరోనా సోకిన వ్యక్తికి రెండు లక్షల రుపాయలు గరిష్ఠంగా వసూళ్లు చేశారని, రోజుకు లక్ష రుపాయలు వసూళ్లు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో వాడుతున్న సుమారు 10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధికారులు సీజ్ చేశారు. చదవండి: ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్ -
ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్
-
ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాకం..
సాక్షి, పశ్చిమగోదావరి: అనధికారికంగా కోవిడ్ బాధితులకు వైద్యం చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన ఏలూరులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యాధికారులు శనివారం సీజ్ చేశారు. బాధితులు నుంచి మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లక్షలు దోచుకుంటున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆసుపత్రిపై డీఎంహెచ్‌వో, ఏలూరు రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహించారు. సుమారు 10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కూడా సీజ్ చేశారు. (కరోనా బూచి.. డబ్బు దోచి!) ఆసుపత్రికి చేరుకున్న జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ సునంద, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఆర్డీవోలు విచారణ చేపట్టారు. విచారణలో ఆస్పత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తి కి రెండు లక్షల రుపాయలు గరిష్ఠంగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. రోజుకు లక్ష రుపాయలు వసూళ్లు చేసినట్లు ధ్రువీకరించారు. వెంటిలేషన్ సదుపాయం లేకుండానే రోగుల వద్ద నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కరోనా బాధితుడికి పీపీఈ కిట్ పేరుతో రోజుకు రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆసుపత్రి పై అధికారులు దాడి చేసిన సమయంలో 18 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మరొక ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో విచారణ ఇంకా కొనసాగుతుంది. -
కడవరకూ జగన్‌తోనే ఉంటాం: ఎంపీ భరత్‌రామ్
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అన్ని విభాగాల్లో శిథిలావస్థకు చేరిన గదులను చూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్థన్‌ను కలిసి ట్రామాకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. పేపర్‌మిల్లు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను సేకరించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆసుపత్రి ఫొటోలు తీయించి అభివృద్ధి చేసిన తరువాత తిరిగి ఫొటోలు తీస్తామన్నారు. కడవరకూ జగన్‌తోనే ఉంటాం... వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్‌రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారన్నారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారక్ప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, సివిల్ సర్జన్లు కోటేశ్వరరావు, పద్మావతి, ప్రదీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సెగ్మెంట్‌కు మొబైల్ వాటర్ ట్యాంక్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ వాటర్‌ట్యాంకు ఉండే బాగుంటుందని దానిపై ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లో ఆయన కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్‌పై పార్లమెంటు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామంలో మంచినీటి సమస్య వస్తే నీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ట్యాంకులు సులువుగా చిన్న వీధులలో మలుపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటర్ హెడ్ ట్యాంకులు పైపులైను నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలని, వాటికి కొంత సమయం పడుతుందని ఈలోపు వాటర్ ట్యాంకులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు ఈ విషయంపై ఏవిధంగా చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీ ఆరాతీయగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని డీఈలు తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలకు పరిపాలనా పరమైన ఆమోదాలు వచ్చాయన్నారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని డీఈలు ఎస్.రవికుమార్, సీహెచ్ రమేష్, పి.శ్రీనివాస్, ఎంఎస్ స్వామి పాల్గొన్నారు. -
కల నిజమాయే..!
► జిల్లాకు నిమ్స్ తరహా ఆస్పత్రి ► ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యసేవలు ► కరీంనగర్ చుట్టూ స్థలాలపై దృష్టి కరీంనగర్ హెల్త్ : జిల్లా ప్రజల కల నిజంకాబోతోంది. కరీంనగర్‌తోపాటు పరిసర ప్రాంతాల ప్రజల కు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) తరహా ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 350 పడకల ఆస్పత్రిని 500 పడకలకు మార్చడంతోపాటు కొత్తగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇంతేకాకుండా జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో మరో అడుగు ముందుకేసి 750 పడకలతో నిమ్స్ తరహాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఎం సూచనలతో ఆర్థికశాఖ 2017–18 బడ్జెట్లో నిధులు కేటాయించింది. ప్రజల దరికి మెరుగైన వైద్యం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న ఆస్పత్రిని బాగుచేయడంతోపాటు రూ.10లక్షలతో ఐసీయూను ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 350 పడకల ఆస్పత్రికి తోడు 150 పడకల మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. అనంతరం కళాశాలతోపాటు 500 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచింది. స్థల సేకరణపై దృష్టి : ఆస్పత్రి ఏర్పాటుకు స్థలం సేకరణపై అధికారులు దృష్టి సారించా రు. కలెక్టరేట్ పక్కన గల హెలిప్యాడ్ స్థలం బాగుంటుందని గతంలోనే పరిశీలించారు. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో వీటిపై దృష్టిపెట్టలేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అధికారులు స్థలాన్వేషణలో పడ్డారు. కరీంనగర్‌తోపాటు చుట్టూ పరిసర గ్రామాల్లో అనువైన స్థలాలు ఉన్నాయి. కలెక్టరేట్ పక్కన హెలిప్యాడ్గ్రౌండ్తోపాటు శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన 40 ఎకరాల స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దాదాపు 500 ఎకరాలు ఉన్న డెయిరీకి చెందిన స్థలం, చింతకుంటలోని ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించిన స్థలాలు కూడా అనువైనవిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మాణానికి అనువైన భూమితోపాటు బైపాస్‌రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. నగరంలోని గోదాంగడ్డలోగల గోదాములకు భారీ వాహనాల రాకపోకలతోపాటు కిలోమీటర్ మేర చుట్టుపక్కల ఇళ్లలోకి లక్కపురుగులు వస్తున్నాయని వాటిని ఇక్కడి నుంచి తరలించాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ గోదాంలను తరలించి అక్కడ నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అన్ని చికిత్సలూ ఇక్కడే నిమ్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తీవ్రమైన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాలు జరిగి కొన ఊపిరితో ఉన్న వారిని సైతం బతికించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రమాదకరమైన వ్యాధులు, ప్రమాదాలు జరిగినప్పుడు మనకు వరంగల్‌లోని గాంధీ హాస్పిటల్ లేదంటే హైదరాబాదే దిక్కు. ఇప్పుడు అలాంటి వాటికి కాలం చెల్లనుంది. దీర్ఘకాలిక షుగర్, కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధులే కాకుండా గుండె ఆపరేషన్లు, ప్రమాదాలు జరిగినప్పుడు మెదడు, నరాలు, ఎముకల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. హైదరాబాద్‌లో అందే వైద్యసేవలు కరీంనగర్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. -
ఆడపిల్లను అమ్మేశారు!
⇒ కాసుల కక్కుర్తితో తెలంగాణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల దుర్మార్గం ⇒ అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ⇒ మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో నిరాశ.. ⇒ అసంతృప్తిని కనిపెట్టి.. పాపను అమ్మేయాలంటూ ఒత్తిడి ⇒ డబ్బులు వస్తాయంటూ ప్రలోభపెట్టిన వైద్యుడు ⇒ మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయం ⇒ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ⇒ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఏడుగురు అరెస్టు ఇబ్రహీంపట్నం డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ ఆస్పత్రి నిర్వాహకులు తమ ఆస్పత్రిలో పుట్టిన ఓ ఆడపిల్లను అమ్మేశారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నందున పెంచడం కష్టమవుతుందంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఒప్పించారు. మూడు రోజుల పసికందును ఓ మధ్యవర్తి సహాయంతో రూ.35 వేలకు విక్రయించేశారు. అందులోంచి ఓ పదివేలు తల్లిదండ్రుల చేతిలో పెట్టి పంపేసి.. మిగతా సొమ్మును పంచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వాహకుల దుర్మార్గమిది. మూడు నెలల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువు తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన దంపతులు, ఆస్పత్రి నిర్వాహకులు, మధ్యవర్తిని అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ ఇందుకు సంబంధించిన వివ రాలను గురువారం మీడియాకు వెల్లడించారు. అమ్మేసి, డబ్బులు తీసుకోండి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి అనుబంధంగా ఉన్న సత్తి తండాకు చెందిన కొర్ర వనిత, జవహర్లాల్ దంపతులకు గతంలోనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గతేడాది నవంబర్ 28న వనిత ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో మళ్లీ ఆడపిల్లను ప్రసవించింది. దీంతో ఆ దంపతులు నిరాశకు గురయ్యారు. అది చూసిన ఆస్పత్రి డైరెక్టర్, వైద్యుడు నేరెళ్ల శంకర్, అడ్మినిస్ట్రేటర్ నాయినంపల్లి శ్రీనివాస్‌లు.. ఆడపిల్ల పుడితే తప్పేమిటని, బాగా పెంచుకోవాలని చెప్పాల్సింది పోయి ఆ పాపను అమ్మేసుకోవాలని సలహా ఇచ్చారు. పైగా డబ్బులు వస్తాయని ఆశ చూపి శిశువును అమ్మేలా ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో వనిత, జవహర్ దంపతులు పాపను అమ్మేందుకు అంగీకరించారు. మధ్యవర్తి ద్వారా విక్రయం ఆస్పత్రి నిర్వాహకులు పాపను అమ్మే విషయాన్ని తమకు పరిచయమున్న ఆరుట్ల గ్రామానికి చెందిన శాంత అనే మహిళకు తెలిపారు. తమ వద్ద ఆడశిశువు ఉందని, ఎవరికైనా కావాలంటే విక్రయిస్తామని చెప్పారు. దీంతో శాంత కందుకూర్ క్రాస్‌రోడ్డులో నివసించే తమ బంధువులు ఏసరి వరలక్ష్మి, రవి దంపతులను సంప్రదించింది. వారికి పిల్లలు కలకపోవడంతో ఈ పాపను కొనుక్కొమ్మని సూచించింది. మూడు రోజుల శిశువును తెచ్చి పెంచుకుంటే భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ ఉండవని సలహా ఇచ్చింది. దీనికి వారు అంగీకరించడంతో రూ.35 వేలకు బేరం కుదిరింది. ఆస్పత్రి నిర్వాహకులు, శాంత కలసి డబ్బులు తీసుకుని డిసెంబర్ ఒకటిన పాపను రవి, వరలక్ష్మి దంపతులకు అప్పగించారు. ఆ సొమ్ములో నుంచి తల్లిదండ్రులకు రూ. పది వేలు ఇచ్చి... మిగతా సొమ్మును శాంత, ఆస్పత్రి నిర్వాకులు పంచుకున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ తప్సీర్ ఇక్బాల్, వెనుక నిందితులు సందేహాలతో.. శిశువు తమ బిడ్డేనని ఆమెను తీసుకెళ్లిన దంపతులు చెప్పుకోవడంతో.. గర్భవతి కాని వరలక్ష్మికి బిడ్డ ఎలా పుట్టిందని స్థానికులు, ఇరుగుపొరుగు వారికి సందేహాలు తలెత్తాయి. మరోవైపు అటు శాంతకు, ఆస్పత్రి సిబ్బందికి ఏదో అంశంలో విభేదాలు వచ్చాయి. చివరికి పాపను విక్రయించిన విషయంపై ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగి ఆరా తీయగా.. శిశువు అమ్మకం నిజమేనని తేలింది. దీంతో శిశువు తల్లిదండ్రులు వనిత, జవహర్, కొన్న దంపతులు రవి, వరలక్ష్మి, మధ్యవర్తి శాంత, ఆస్పత్రి నిర్వాహకులు డా.శంకర్, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. శిశువును హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న శిశువిహార్‌కు తరలించారు. ఆస్పత్రిపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. -
పైసలే పరమావధి
► అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో నిబంధనల ఉల్లంఘన ► అబార్షన్’ సమాచారంతో వైద్యాధికారుల తనిఖీ ► సదరు గర్భిణికి సర్వజనాస్పత్రిలో వైద్యపరీక్షలు ► గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు నిర్ధారణ ► భ్రూణ హత్యగా అనుమానం అనంతపురం మెడికల్ : జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైసలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భ్రూణహత్యలకు సైతం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’లో జరిగిన ఘటన ఈ అనుమానాలను బలపరుస్తోంది.గార్లదిన్నె ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఇర్షాద్ అహమ్మద్ పేరుకు ప్రభుత్వ వైద్యుడైనా సేవ మాత్రం ప్రైవేట్‌లోనే. ‘అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్’ను ఈయనే నెలకొల్పారు. పైగా ఈ ఆస్పత్రిలో కనీన నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి గైనిక్ విభాగంలో వైద్యురాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ లక్ష్మీకాంత కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వజనాస్పత్రిలోనే విధులు నిర్వర్తించాలి. కానీ ఈమె మధ్యాహ్నం 12 గంటల నుంచే అహ్మద్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటానంటూ బోర్డు పెట్టుకుని మరీ వైద్యం చేస్తున్నారు. ఆదివారం జిల్లా వైద్యాధికారుల తనిఖీలో ఈ విషయాలు బట్టబయలయ్యాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి శనివారం ‘అహ్మద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’కు వెళ్లింది. అప్పటికే ఆమెకు రెండేళ్ల కుమార్తె ఉంది. కడుపునొప్పి కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెబుతున్నా.. లింగ నిర్ధారణ చేసి ఆడశిశువని తేలితే అబార్షన్ చేయించుకోవాలనేది ప్లాన్. ఈ విషయం ఓ వ్యక్తికి తెలియడంతో చైల్డ్‌లైన్ -1098కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైద్యాధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఇక్కడ వైద్యులు, సిబ్బంది తదితర వివరాలేవీ రికార్డుల్లో లేవు. ఆపరేషన్లు ఎవరు చేస్తున్నారన్న సమాచారం కూడా లేదు. సుమారు 13 రికార్డులను తనిఖీ చేయగా అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోగి పేరు, చిరునామా తప్పిస్తే వారికి అందించిన వైద్య సేవలు నమోదు చేయలేదు. ఆస్పత్రిలో మెడికల్ స్టోర్ లేకపోయినా రెండు గదుల్లో మందులు నిల్వ చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అంటే కనీసం 20 పడకలుండాలి. కానీ పది పడకలు కూడా కన్పించలేదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం డాక్టర్ లక్ష్మీకాంత పేరుమీద రిజిస్టరైంది. ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న ఈమె అనుమతి తీసుకున్న చోట కాకుండా మరో చోట పరీక్షలు చేస్తున్నట్లు వెలుగు చూసింది. గత ఏడాది జులై నుంచి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసినా అవి ఎవరికి చేశారు.. ఆ ఆస్పత్రికి వారిని ఎవరు రెఫర్ చేశారన్న వివరాలను పొందుపరచలేదు. ప్రస్తుతం చికిత్సకు వచ్చిన మహిళకు సంబంధించిన కేస్ షీట్లో కూడా వైద్యపరమైన వివరాలేవీ లేవు. దీంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ట్రాసౌండ్ యంత్రం, మరికొన్ని పరికరాలు సీజ్ చేసి.. ఎగ్జామినేషన్ గదికి తాళం వేశారు. తనిఖీల్లో ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డెమో హరిలీలాకుమారి, చైల్డ్‌లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమాచారి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రమణ్యం, హెల్ప్ జిల్లా కో ఆర్డినేటర్ కొండప్ప, హెచ్ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గర్భంలోనే మృతి చెందిన శిశువు అహ్మద్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గర్భిణికి బ్లీడింగ్ జరుగుతుండటంతో ఆమెను ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రేడియాలజిస్టులు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డ్యూటీ డాక్టర్లు పరీక్షించి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, అయితే గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బాధితురాలు, ఆమె భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు తెలియజేశారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ వైద్యులకు సూచించారు. కాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ ఆస్పత్రిలో హడావుడి చేశారు. సదరు మహిళను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వాగ్వాదానికి దిగారు.అయితే.. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ రాజకీయం చేయొద్దని డీఎంహెచ్ఓ సూచించడం వారు వెనుదిరిగారు. -
'ఏపీలో తమిళనాడు తరహా వైద్యవిధానం'
చెన్నై: తిరుపతి, విజయవాడ, వైజాగ్‌లలో నిర్మించే ఆస్పత్రుల్లో తమిళనాడు తరహా వైద్యవిధానాన్ని ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన చెన్నైలోని ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ.. సామాన్యులకు మంచి వైద్యం అందించడంలో తమిళనాడు ముందుంజలో ఉందని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ తమిళనాడు తరహా వైద్య సేవలిందిస్తామని మంత్రి కామేనేని వెల్లడించారు. -
రేపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాక
లబ్బీపేట : భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ఆదివారం నగరానికి రానున్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పి.రమేష్‌బాబు గుంటూరులో ఏర్పాటుచేసిన 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వస్తున్న ఆయన తాడిగడపలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను కూడా సందర్శించనున్నారు. కలాం ఇప్పటివరకు నగరానికి మూడుసార్లు వచ్చారు. 1998లో ఆయన పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. అప్పుడు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీ వో) చీఫ్‌గా ఉన్నారు. అప్పట్లో చాలా సాదాసీదాగా ఒక డిఫెన్స్ కారులో ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి వెళ్లారు. 2006లో రాష్ట్రపతి హోదాలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ. ఆస్పత్రి, సిరీస్ కంపెనీలను సందర్శించారు. మరోసారి 2008 ఏప్రిల్‌లో రామకృష్ణ మిషన్ విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత కలాం నగరానికి రానున్నారు. -
ఏమిటీ సీక్రెట్..!
‘డర్టీ పిక్చర్’తో ఓ ఊపు ఊపేసిన విద్యాబాలన్ ఈ మధ్య ముంబైలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రెగ్యులర్‌గా విజిట్ చేస్తోందట. విషయం ఏమిటనేది అంతుపట్టక బీ-టౌన్ జనం జుట్టు పీక్కుంటున్నారట. ఇంతకీ ఎందుకిలా ఆసుపత్రి చుట్టూ చక్కర్లు కొడుతోందని ఆరా తీస్తే... అమ్మడు గర్భవతి అని సమాచారం. దానికి తగ్గట్టుగానే విద్య... సుజయ్ ఘోష్ తీయబోయే సినిమా నుంచి తప్పుకుందట. కానీ... విద్యాబాలన్ సన్నిహితులు మాత్రం.. ‘వరుస షూటింగ్‌లతో అలసిపోయిన విద్య కొంత కాలం బ్రేక్ కావాలనుకుంది’ అని చెబుతున్నారు.