
'ఏపీలో తమిళనాడు తరహా వైద్యవిధానం'
చెన్నై: తిరుపతి, విజయవాడ, వైజాగ్లలో నిర్మించే ఆస్పత్రుల్లో తమిళనాడు తరహా వైద్యవిధానాన్ని ప్రవేశపెడతామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన చెన్నైలోని ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ.. సామాన్యులకు మంచి వైద్యం అందించడంలో తమిళనాడు ముందుంజలో ఉందని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ తమిళనాడు తరహా వైద్య సేవలిందిస్తామని మంత్రి కామేనేని వెల్లడించారు.