మెడికల్ షాపులు బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్ : మెడికల్ షాపులు బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో కామినేని మాట్లాడుతూ.. బంద్ సందర్భంగా అన్ని ఆసుపత్రులకు అటాచ్మెంట్గా ఉన్న మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరామని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్ని జిల్లాల డ్రగ్ ఉన్నతాధికారులను ఆదేశించామని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.