నామమాత్ర సేవలు
సర్కారు దవాఖానాల్లో వైద్యసేవలు నామమాత్రంగా అందుతున్నాయి. అందుకు నిధుల కొరత, సిబ్బంది కొరత కారణం. దీంతో ఆరోగ్య కేంద్రాలకు వెళ్లే గ్రామీణులకు కనీస వైద్యసేవలు లభించడం లేదు. రక్తపరీక్షలు చేసే వైద్య సిబ్బంది కూడా లేకపోవడం, ఏళ్ల తరబడి పలు విభాగాల వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.
గుంటూరు మెడికల్ : నవ్యాంధ్ర రాజధాని జిల్లాగా గుంటూరులో హడావిడి ఉన్నా.. వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మిషన్ ఇంధ్రదనస్సు’ రెండో విడత వర్క్‌షాప్ జరగనుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొనే ఈ వర్క్‌షాపునకు వైద్య, ఆరోగ్యం, వైద్య విద్య శాఖల మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య రంగంలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జిల్లా అంతటా సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడకక్కడ విషజ్వరాల బారిన పడి మృత్యువాతలు పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో జలకాలుష్యంతో డయేరియా వంటి వ్యాధులు, దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్ గిన్యా తదితర వ్యా దులు చుట్టుముట్టాయి. గ్రామీణ పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు కునారిల్లుతున్నాయి. ఆయా కేంద్రాల్లో రక్తపరీక్షలు చేసే ల్యాబ్‌టెక్నీషియ న్లు లేకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు రోగులను పిండుకుంటున్నారు.
ఎక్సరే మిషన్లు అలంకారప్రాయంగా మిగిలాయి. ఆల్రాసౌండ్ స్కానింగ్‌లు మచ్చుకైనా కనిపించవు. ఇక వైద్యులు మొదలు పారామెడికల్ సిబ్బం ది వరకు అధికశాతం జిల్లాకేంద్రంలో నివా సం ఉంటూ ఆయా కేంద్రాల్లో మొక్కుబడిగా విధులకు హాజరవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. నర్సులేదా ఫార్మసిస్టుపై ఆధారపడి పనిచేసే ఆరోగ్యకేంద్రాలు అధికసంఖ్యలో ఉ న్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
వైద్యసిబ్బంది కొరత..
జిల్లాలో వైద్యశాఖ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా పోస్టులు కేటాయించకపోవడం, ఖాళీలను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో పలు పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది కొరత ఉంది. జిల్లాలో 77ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 32, సీహెచ్‌సీలు 17, సబ్‌సెంటర్లు 680 ఉన్నాయి. 175మంది వైద్యాధికారులను కేటాయిం చగా 25 పోస్టులు ఖాళీగాఉన్నాయి. జి ల్లాలో 63 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను ప్రభుత్వం కేటాయించగా 23 ఖాళీలు, మల్టీపర్సస్‌హెల్త్ అసిస్టెంట్(మేల్) పో స్టులు 554కుగాను 277 ఖాళీలు, మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులు 612 కేటాయించగా 200 ఖాళీలు, సెకండ్ ఏఎన్‌ఎం పోస్టులు 679కిగాను 126 ఖాళీలు, అదనపు ఏఎన్‌ఎం పోస్టులు 115 కేటాయించగా 21 ఖాళీగా ఉన్నాయి. ఇక నాలుగో తరగతి పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి. నిధుల కొరత కూడా అధికంగా ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రభుత్వం పెంచడం లేదు.