సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న ఎంజీఎం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీని సీఎం ప్రారంభించారు. అలాగే హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించానున్నారు. తరువాత ఎక్సైజ్ కాలనీలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో భోజనం చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు.
చదవండి: నేడు యాదాద్రికి కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి
Comments
Please login to add a commentAdd a comment