
సాక్షి,వరంగల్: బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. మంగళవారం(నవంబర్ 19)వరంగల్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
‘ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 2014-19 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారు. పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే కొండను బద్దలు కొట్టినట్లు కొట్టింది ఒక ఆడబిడ్డనే. తెలివిగల తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్‌ను గెలిపించారు.
కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి కేసీఆర్‌కు పదేళ్లు చేతులు రాలేదు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment