lay foundation programe
-
Live: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
Live: మచిలీపట్నం పోర్టు భూమి పూజ
-
ఉత్సాహంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల శంకుస్థాపనలు
-
ఏపీ: మెగా గ్రౌండింగ్ రెట్టింపు విజయవంతం
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనే విషయాన్ని అధికార యంత్రాంగం వలంటీర్లు, పేదవర్గాల భాగస్వామ్యంతో మరోమారు నిరూపించింది. ఇటీవలే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 13.50 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పేదల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన పేదల ఇళ్ల ‘మెగా గ్రౌండింగ్ మేళా’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలి దశలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు రికార్డు స్థాయిలో ఆదివారం సాయంత్రానికి 6 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. మూడు రోజుల్లో 6,05,833 శంకుస్థాపనలు గృహ నిర్మాణ శాఖ రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల ఇళ్ల శంకుస్థాపనలు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. జిల్లా స్థాయి యంత్రాంగాలు 3.85 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, రాజకీయ నాయకత్వ మార్గదర్శకత్వం సరిగా ఉంటే ఏదైనా సాధించగలమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు గల ప్రభుత్వ యంత్రాంగం నిరూపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన మార్గనిర్దేశం చేయడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి యంత్రాంగం నుంచి గ్రామ వలంటీర్ల వరకు పేదల ఇళ్ల నిర్మాణాల ప్రారంభంలో సమష్టిగా పనిచేయడంతో ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది. గురువారం, శనివారం, ఆదివారం మూడు రోజుల్లో 3,85,714 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయించాలని జిల్లాల యంత్రాంగాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. మొత్తంగా 6,05,833 ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు పూర్తయ్యాయి. ఇక నిర్మాణాలపైనే దృష్టి: అజయ్ జైన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంతో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగంతో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు సమష్టిగా పనిచేయడంతో పాటు పేదలు కూడా ఉత్సాహంతో ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంతో మూడు రోజుల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు సాధ్యమయ్యాయని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఇకనుంచి ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. శంకుస్థాపనలు చేసిన లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా సిమెంట్, ఇసుక, స్టీలు, ఇతర మెటీరియల్ సరఫరా చేస్తామన్నారు. ఇళ్ల శంకుస్థాపనల ఉద్యమ స్ఫూర్తిని నిర్మాణాలు పూర్తిచేసే వరకు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా లబ్ధిదారుల చేత కూడా ఇళ్ల నిర్మాణాలకు త్వరగా శంకుస్థాపనలు చేయించి, నిర్మాణాలు చేపట్టడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. -
మూడో రోజు ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతోంది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండల కేంద్రంలోని సామూహిక గృహ నిర్మాణాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెంకట శేషయ్య, సర్పంచ్ రాజేశ్వరి పాల్గొన్నారు. విశాఖ జిల్లా: విశాఖలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మూడో రోజు రికార్డు స్థాయిలో 12 వేల ఇళ్లకు లబ్ధిదారులు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 37 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయగా, నిన్నటి వరకు 20 వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా: దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి, శ్రిపర్రు గ్రామాల్లో సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, సర్పంచ్ షేక్ రహేమా బేగం హాసేనా పాల్గొన్నారు. 179మందికి ఇండ్లపట్టాలు పంపిణీ చేశారు. వీరవాసరం మండలం తల తాడితిప్ప గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: ఉయ్యురు మండలం నాగన్నగుడం లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీలో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భూమి పూజ చేశారు. మండవల్లి మండలం గన్నవరం లో వైఎస్సార్ జగనన్న కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. బందరు మండలం మేకవానిపాలెం లేఅవుట్లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి మండలం కనసానపల్లి, ఆగిరిపల్లి మండలాల్లో వైఎస్సార్ జగనన్న ఇళ్ల కాలనీల్లో సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. మైలవరం మండలం చంద్రాలలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. -
వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించనున్న ఎంజీఎం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీని సీఎం ప్రారంభించారు. అలాగే హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించానున్నారు. తరువాత ఎక్సైజ్ కాలనీలోని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో భోజనం చేయనున్నారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. చదవండి: నేడు యాదాద్రికి కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి -
ట్రెండింగ్ : గో బ్యాక్ మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ : మదురైలో ఏయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం తమిళనాడు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్లో నిరసన సెగ తగిలింది. గోబ్యాక్ మోదీ హాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. మోదీ తమిళనాడు పర్యటనను రెండు లక్షలకు పైగా ట్విటర్ ఖాతాదారులు తిరస్కరిస్తుండగా.. ఆయనకు వెల్కం చెబుత్ను వారి సంఖ్య కేవలం 30 వేల మందే ఉండడం గమనార్హం. ఇంకా కొంతమంది ఏకంగా ద్రవిడ ఉద్యమ నిర్మాత, హేతువాది పెరియార్ రామస్వామి మోదీని బయటకు నెట్టేసే కార్టూన్‌ను కూడా జతచేస్తున్నారు. తమిళనాడుపై గజ తుపాన్ విరుచుకుపడగా కేంద్రం సాయమందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకనే ప్రధాని పర్యటనపట్ల నిరసన తెలుపుతున్నామని చెప్తున్నారు. ఇదిలాఉండగా..గత నవంబర్‌లో గజ తుపాను ధాటికి తమిళనాడు విలవిల్లాడింది. దాదాపు 59 మంది మృత్యువాత పడగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది. ఇక మధురైలో ఏయిమ్స్ ఏర్పాటు చేస్తుండడం పట్ల వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధురై థాంక్స్ మోదీ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. టీఎన్ వెల్కం మోదీ మోదీ హ్యాష్ ట్యాగ్‌తో తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. ఏయిమ్స్‌తో పాటు మధురై రాజాజీ మెడికల్ ఆస్పత్రి, తంజావూరు మెడికల్ ఆస్పత్రి, తిరునర్వేలి మెడికల్ ఆస్పత్రిల్లో సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కేరళకు వెళ్లనున్నారు. మోదీకి రాకకు వ్యతిరేకంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్‌టాగ్‌కు తమ పార్టీకి ఏ సంబంధం లేదని డీఎంకే ఐటీ సెల్ చీఫ్ పి.త్యాగరాజన్ స్పష్టం చేశారు. బీజేపీ ఐటీ సెల్ మాదిరిగా తాము చేయబోమని అన్నారు. కాగా, మోదీ గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ గతంలో కూడా ఓసారి ట్రెండ్ అయింది. గతేడాది ఏప్రిల్‌లో డిఫెన్స్ ఎక్స్పో సందర్శించడానికి మోదీ తమిళనాడుకు వెళ్లిన సందర్బంలో ఇది జరిగింది. When we were affected by Gaja cyclone, no words from you, so now for you #GoBackModi — bastin (@bastinmaradona) January 27, 2019 Since you have not kept your promises on ... Please #GoBackModi — Pon adhavan (@PonAdhavan) January 27, 2019 Not about to understand the psychology of those who trend #GoBackModi while that person is coming to improve medical facilities in the state.#TNWelcomesModi#TNThanksModi #MaduraiWelcomesModi #MaduraiThanksModi https://t.co/R8vRFGk70e — தேள் 🇮🇳 (@Tweets_CS) January 27, 2019 -
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
-
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష నేత రాసిన లేఖపై మంత్రులు విమర్శలు చేయడం మాని వివరణ ఇవ్వాలని అన్నారు. తామెదో ఉద్దేశ పూర్వకంగా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదనుకుంటే పొరపాటవుతుందని, ఎంతోమందిని బాధపెట్టి నిర్మిస్తున్న రాజధాని కార్యక్రమానికి తాము హాజరై వారి బాధను అవమానించలేమని, వారి కన్నీళ్లను తొక్కి అవమానించలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన పార్థసారథి.. రాజధాని పేరిట ప్రభుత్వం నిర్వహించిన తంతును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. సాక్షాత్తు ప్రధాని సైతం భూసేకరణ బిల్లు విషయంలో అందరి ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని, రైతులకు, పేదవారికి అనుకూలంగా ఉండేలా భూసేకరణ ఉంటుందని, అలా మార్పులు చేసేవరకు భూసేకరణ ఉండబోదని చెప్పినా.. అదే భూసేకరణ బిల్లుతో చంద్రబాబునాయుడు ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం 14 వేల ఎకరాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 5వేల ఎకరాలు అవసరం ఉండగా ఎందుకు 33 వేల ఎకరాలు సేకరించారని ప్రశ్నించారు. భూమిని సేకరించిన ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, వృత్తిపై ఆధారపడి బతుకులీడ్చేవారి భవిష్యత్తుకు ఏ మేరకు భరోసా ఇచ్చారని, వారంతా ఎటుపోతారని నిలదీశారు. మెడలు వంచి ఇళ్లలో నుంచి లాగేసి మరి పేదవారి భూములను రాజధాని పేరిట కొల్లగొట్టారని, ఇప్పుడు వారంతా కంటతడిపెడుతుంటే.. ఏ విధంగా రాజధాని శంఖుస్ధాపన కార్యక్రమానికి రావాలని చెప్పారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే, అంతకంటే ముందు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తేనే బావుంటుందనేది తమ అభిప్రాయం అన్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వం ఊహించుకుంటున్న రాజధాని కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.