
పశ్చిమగోదావరి జిల్లా మాదేపల్లి గ్రామంలో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతోంది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు.
నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండల కేంద్రంలోని సామూహిక గృహ నిర్మాణాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెంకట శేషయ్య, సర్పంచ్ రాజేశ్వరి పాల్గొన్నారు.
విశాఖ జిల్లా: విశాఖలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మూడో రోజు రికార్డు స్థాయిలో 12 వేల ఇళ్లకు లబ్ధిదారులు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 37 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయగా, నిన్నటి వరకు 20 వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది.
పశ్చిమ గోదావరి జిల్లా: దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి, శ్రిపర్రు గ్రామాల్లో సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, సర్పంచ్ షేక్ రహేమా బేగం హాసేనా పాల్గొన్నారు. 179మందికి ఇండ్లపట్టాలు పంపిణీ చేశారు. వీరవాసరం మండలం తల తాడితిప్ప గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా: ఉయ్యురు మండలం నాగన్నగుడం లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీలో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భూమి పూజ చేశారు. మండవల్లి మండలం గన్నవరం లో వైఎస్సార్ జగనన్న కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
బందరు మండలం మేకవానిపాలెం లేఅవుట్‌లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి మండలం కనసానపల్లి, ఆగిరిపల్లి మండలాల్లో వైఎస్సార్ జగనన్న ఇళ్ల కాలనీల్లో సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. మైలవరం మండలం చంద్రాలలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment