సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళుతు న్నారు కాబట్టే ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీని తిరిగి గాడినపెట్టడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారని అన్నారు.
తెలంగాణ అనే పదాన్ని తన పార్టీ నుంచి తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో జగ్గారెడ్డి విలేకరు లతో మాట్లాడుతూ కేసీఆర్ తన పార్టీ నుంచి టీ అనే అక్షరాన్ని తొలగించి తెలంగాణను అవమా నించారని విమర్శించారు. కేసీఆర్‌లో ఎక్కడో మూలన సమైక్య భావన నెలకొందని, అందుకే తెలంగాణ వాదాన్ని ఆయన చంపేశారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌తో కేసీఆర్ సక్సెస్ కాలేరన్న జగ్గారెడ్డి... తెలంగాణలో ఇకపై సీరి యస్ పాలిటిక్స్ నడుస్తాయని, పొత్తుల గురించి ముందుముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
రూ. 120 కోట్లు ఏ మూలకు?
కాంగ్రెస్ హయాంలో చిరు వ్యాపారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వట్లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల మైనారిటీ కార్పొరే షన్‌కు ఇచ్చిన రూ. 120 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ కార్పొరేషన్‌కు కనీసం రూ. 1,500 కోట్లు కేటాయించడంతోపాటు రుణాలదరఖాస్తు గడువును జనవరి 5 నుంచి మరో నెలపాటు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment