సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడుతుంటే.. విపక్షాలు తిట్లలో పోటీ పడు తున్నాయని అని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘పాపం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు.. గతంలో ఆయన ఐటీ ఐటీ అనే వారు.. ఇప్పుడు మాట్లాడకూడదేమో కానీ.. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఐటీతో పాటు, పల్లెల్లో వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది’ అని మంత్రి అన్నారు.
ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్య క్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కోతలు లేకుండా గృహ అవసరాలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు, ఎనిమిది పీజీ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు 3.5 లక్షల ఐటీ ఉద్యోగా లుంటే ఈరోజు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు రాష్ట్రం నిలయంగా మారిందన్నారు. దేశ జనాభాలో 3శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణ.. కేంద్రం ఇచ్చే అవార్డుల్లో 38శాతం, పట్టణాలల్లో 28శాతం అవార్డులు మనకే దక్కాయన్నారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. త్వరలో మహిళా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సబితారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment