T. Harish Rao
-
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీయే
సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు.. కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్చేసిందని, కాంగ్రెస్అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు. అవి చిత్తు కాగితాలు.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్ అభివృద్ధిలో.. విపక్షాలు తిట్లలో పోటీ
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడుతుంటే.. విపక్షాలు తిట్లలో పోటీ పడు తున్నాయని అని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘పాపం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు.. గతంలో ఆయన ఐటీ ఐటీ అనే వారు.. ఇప్పుడు మాట్లాడకూడదేమో కానీ.. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఐటీతో పాటు, పల్లెల్లో వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది’ అని మంత్రి అన్నారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు. సోమవారం సిద్దిపేటలో పలు కార్య క్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కోతలు లేకుండా గృహ అవసరాలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు, ఎనిమిది పీజీ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3.5 లక్షల ఐటీ ఉద్యోగా లుంటే ఈరోజు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు రాష్ట్రం నిలయంగా మారిందన్నారు. దేశ జనాభాలో 3శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణ.. కేంద్రం ఇచ్చే అవార్డుల్లో 38శాతం, పట్టణాలల్లో 28శాతం అవార్డులు మనకే దక్కాయన్నారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. త్వరలో మహిళా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సబితారెడ్డి తెలిపారు. -
మెత్తబడని అసమ్మతి!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడి పది రోజులు దాటినా అసమ్మతి నేతలు మెత్తబడటం లేదు. టికెట్ దక్కించుకున్న నేతలు అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సానుకూలంగా స్పందించడం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా ఇన్నాళ్లూ అధికార బలాన్ని ఉపయోగించి తమను తొక్కిపెట్టారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు సర్దుబాటుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో అంటకాగి పదవులు, పనులు పొందిన చోటా మోటా నేతలు కూడా ఏదో ఒక సాకు చూపుతూ ప్రస్తుతం దూరం పాటిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థుల అడుగులు ముందుకు పడట్లేదు. ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు అసమ్మతిని చల్లార్చేందుకు రాయబారం నెరపుతున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. చాలా నియోజకవర్గాల్లో బుజ్జగింపుల పర్వం వికటించి కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్నారు. సొంతదారి వైపు అసమ్మతి చూపు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం బీఆర్ఎస్లో సంచలనం సృష్టించగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు సొంత దారి చూసుకోవడంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్ (ఖానాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) పార్టీనీ వీడగా మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. తాము సైతం బీఆర్ఎస్ను వీడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, కల్వకుర్తి, సంగారెడ్డి, అలంపూర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, రామగుండం తదితర నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు రద్దు చేసి తమకు కేటాయించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న అసమ్మతి దిద్దుబాటుకు మంత్రి టి.హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో తన నివాసంలో వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ అభ్యర్థుల గెలుపు కోసం కలసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అసమ్మతి నేతలు శుక్ర, శనివారాల్లో హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ రాక తర్వాత బుజ్జగింపుల పర్వం వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా పట్టాలెక్కుతుందని చెబుతున్నాయి. జనగామ, నర్సాపూర్ పంచాయితీ యథాతథం జనగామ, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్) తమకు టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలపై పీటముడి వీడే అవకాశముంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో మధ్యేమార్గంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది. -
మెదక్ నుంచే ప్రగతి శంఖారావం
మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు బుధవారం మెదక్ నుంచి శ్రీకారం చుట్టనుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ ప్యాకర్లకు, టేకేదార్లకు ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. మెదక్ నుంచే ప్రగతి శంఖారావం పూరిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేలా ఇక్కడ బహిరంగసభ ఉంటుందని, ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమానంగా ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయని పేర్కొన్నారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణ పథకాలను కేంద్రంసహా వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష అందిస్తుండగా, దీనిని కేంద్రం కాపీ కొట్టి విశ్వకర్మలకు రూ.లక్ష అప్పు ఇస్తామని ప్రకటించిందని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని కొత్త అర్థం చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ కార్యాలయం, 1.20 గంటలకు ఎస్పీ కార్యాలయం, 1.40 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే బహి రంగ సభలో మాట్లాడతారు. ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. ప్రారంభానికి ముస్తాబైన జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో సిబ్బంది అలంకరించారు. -
బీజేపీ శాపం.. కాంగ్రెస్ పాపం..కేసీఆర్ దీపం: హరీశ్
గజ్వేల్: ’’తెలంగాణకు రూపాయి ఇయ్య.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇయ్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గురువు, ఉచిత కరెంట్ వద్దన్న చంద్రబాబు రేవంత్‌రెడ్డికి గురువు. దీపం లాంటి కేసీఆర్ ఉండగా.. తెలంగాణ ద్రోహుల చుట్టూ తిరుగుతున్న శాపం లాంటి బీజేపీ, పాపం లాంటి కాంగ్రెస్ మనకెందుకు..?’’ అని మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో హోంమంత్రి మహ మూద్ అలీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉసురుపోసుకున్న బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు నిధులివ్వరా? అని అప్పట్లో తాను ప్రశ్నిస్తే ఒక్క రూపాయి ఇయ్య...ఏం చేస్తారో చేసుకోండి అన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కిషన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోయి మరిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని మండిపడ్డారు. కిరణ్, బాబు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా? తెలంగాణను రాచి రంపాన పెట్టి, ఈ ప్రాంతానికి కరెంట్, నీళ్లు ఇయ్యకపోగా.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రేవంత్‌రెడ్డికి గురువు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కిరణ్, చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? ఇది సిగ్గుచేటు అంటూ వ్యా ఖ్యానించారు. చంద్రబాటు ఇటీవల తెలంగాణపై ప్రేమ చూపినట్లు మాట్లాడు తున్నారని, అదీ ఏపీ సీఎం జగన్‌పై కోపంతో మాత్రమేనని, నిజంగా ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదని, ముమ్మాటికీ ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
8న ‘ఆరోగ్య మహిళ’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా విస్తరణ.. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించి ఆపై 1,200 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 8న ప్రారంభించే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలన్నారు. సీపీఆర్‌పై విస్తృత ప్రచారం గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్‌లకు గురైన వారిని సత్వరమే కాపాడటంలో దోహదపడే ప్రాథమిక చికిత్స కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఇలా అరెస్ట్అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యేవారికి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)ల కోసం మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ‘కంటివెలుగు’ అందరికీ చేరాలి కంటివెలుగు పథకంలో భాగంగా అందిస్తున్న కంటి పరీక్షలు అందరికీ చేరాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించే 8 పరీక్షలివే.. 1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు. 2. ఓరల్, సర్వ్యకిల్, రొమ్ము కేన్సర్ల స్క్రీనింగ్. 3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు, చికిత్స, మందులు. 4.మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు,పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు. 5.మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్. 6. నెలసరి సమస్యలపై పరీక్షలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, అవసరమైనవారికి అ్రల్టాసౌండ్ టెస్టులు. 7.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు, అవగాహన. 8.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన -
వినయ్‌కి అండగా ఉంటాం: మంత్రి హరీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సైన్స్‌ఫేర్ ఈవెంట్లో కెమికల్ మీద పడి గాయపడిన ఆరో తరగతి విద్యార్థి వినయ్‌కి అన్ని విధాలా అండగా ఉంటామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ‘అయ్యో వినయ్.. ఆదుకునేవారే లేరా?’శీర్షికన శుక్రవారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. వినయ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెంటనే తన సిబ్బందిని పంపించారు. ఆ తర్వాత బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వినయ్ ఆరోగ్యం మెరుగై సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చికిత్స ముగిసే వరకు తోడుగా ఉండి, ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటివరకు పంపిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 28న జరిగిన ప్రమాదంలో వినయ్ గాయపడగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలి: హరీశ్ రావు
సిద్దిపేట: దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు విమర్షలు గుప్పించుకుంటున్నారు. దళితబంధు పథకానికి బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారని, కానీ తమ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని హరీశ్ రావు అన్నారు. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ తేవాలని అడిగారు. ఇక రైతు బంధు, దళిత బంధు దండగ అని ఈటల అంటున్నారని, ఈటల కావాలా? టీఆర్ఎస్ కావాలా? అన్నది చర్చ పెట్టాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ ఓటు అడిగే ముందు.. రైతుబంధు, దళితబంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని.. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తేవాలని హరీశ్ రావు పేర్కొన్నారు. -
ద్రవ్య లోటును అధిగమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకున్నందున డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వ భూములు, నిరర్థక ఆస్తులు, రాజీవ్ స్వగృహ ఇళ్లు విక్రయించి ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకుంటామని మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం బడ్జెట్ సమర్పణ అనంతరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల అమ్మకంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రానికి చెందిన విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. రెండు నెలల క్రితం మద్యం ధరలు పెరిగినందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీంతో పాటు ద్రవ్య లోటును సొంత ఆదాయం పెంచుకోవడం, వ్యవస్థలోని లోపాలను పూడ్చుకోవడం, ఇతరత్రా రూపాల్లో భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని, హైదరాబాద్‌లో రియల్ వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉన్నందున, ఆదాయం కోసం భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనుకున్న ఫలితాలు సాధిస్తాం.. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలు లేనందున, ఇకపై పూర్తిగా కేబినెట్, అధికార యంత్రాంగం పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టి అనుకున్న ఫలితాలను సాధిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ చెప్పారు. కేంద్రం నుంచి టాక్స్ డివల్యూషన్ కింద 2019–20లో రాష్ట్రానికి రావాల్సింది భారీగా తగ్గిందని, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు 2020–21లో రావాల్సిన మేర గ్రాంట్లు, వనరులు రాలేదన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో భాగంగా కేంద్రం నుంచి రూ. 2,600 కోట్లే వచ్చాయని, ఇంకా రూ. 933 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి జీఎస్టీ కంపన్సేషన్ రావాల్సిన నిధుల కోత ఉన్నా, గతేడాదితోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సంక్షేమానికి కోతలు పెట్టలేదన్నారు. సంక్షేమానికి నిధుల కేటాయింపుతోపాటు ఈ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు పెట్టాలనేది పెద్ద నిర్ణయమన్నారు. కాళేశ్వరం వల్ల 150 కి.మీ. పొడవునా గోదావరి పారుతున్నందున రూ. 300 కోట్లతో గోదావరి రివర్ ఫ్రంట్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రమంత్రే ఆ విషయాన్ని చెప్పారు.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే భారీగా అప్పులు చేశారని, ఇంకా చేస్తున్నారని రాజకీయంగా వస్తున్న విమర్శలకు ఇదే తగిన సమాధాన మన్నారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ సరిగా జరగలేదని కాగ్ తెలిపిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పంపిణీ తప్పుగా జరిగిందని, తెలంగాణకు రూ.2,300 కోట్ల మేర అన్యాయం జరిగినట్లు వెల్లడించిందన్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఇప్పటికే లేఖలు రాసినందున,ఈ మేరకు రాష్ట్రానికి డబ్బు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. -
ల్యాండ్ ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది. 2,084 ఎకరాలపైనే ఆశ.. హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్‌గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్‌మెట్ 161, అజీజ్‌నగర్ 126.29, కొత్వాల్‌గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్‌నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది. బుద్వేల్ భూములు కూడా... ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని టూరిజం, హెచ్ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది. -
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్‌ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్‌కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్‌కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే’
సాక్షి, పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే భారీ మెజార్టీతో పద్మక్కను గెలిపించినందున ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం, గోదావరి నీళ్లను సింగూరుకు.. అక్కడి నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు ఇవ్వడం ద్వారా మెతుకుసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మెతుకుసీమకు గోదావరి నీళ్లు రావాలంటే టీఆర్ఎస్కే ఓటెయ్యాలన్నారు. 16మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. మెదక్ పట్టణానికి రైల్వేలైన్ తీసుకురావడంలో కృషి చేశానని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాపన్నపేట మండలం మొదటినుంచీ మెదక్ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు భారీ విజయం చేకూర్చినట్లుగానే ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సైతం ఎక్కువ మెజార్టీలో అందించాలన్నారు. పాపన్నపేట మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకున్నానని, ఈమేరకు ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. భారీ ర్యాలీ.. పాపన్నపేటలో టీఆర్ఎస్ ప్రచార సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు తమ కులవృత్తులను సూచించే పరికరాలతో ర్యాలీ కొనసాగించారు. మండల కార్యాలయం నుంచి స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో సోములు, సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, అనురాధ, లింగారెడ్డి, జగన్, శ్రీనాథ్, బాపురెడ్డి, గోపాల్‌రెడ్డి, రవి, నవీన్, ఎంపీపీ సొంగ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ సాతెల్లి స్వప్నా బాలగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గౌస్, ఇమానియల్, బాబర్, బాపురావు, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు గట్టి షాక్
సాక్షి, మెదక్: మెతుకుసీమ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇందిరాగాంధీ ఇక్కడి లోక్‌సభ నుంచి బరిలో నిలిచి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టారు. అలాంటి జిల్లాలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా ‘గులాబీ’ ఆకర్ష్‌తో విలవిల్లాడుతోంది. బడా నేతల నుంచి మొదలు దిగువ శ్రేణి నాయకుల వరకు చేయిచ్చి కారెక్కతుండడంతో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), స్టార్ క్యాంపెయినర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాక్ అనే చెప్పొచ్చు. కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆమె పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లేననే చర్చ జోరుగా సాగుతోంది. అనుచరగణంతో సహా.. సునీతారెడ్డి 1999లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి, దివంగత చిలుముల విఠల్‌రెడ్డిపై విజయం సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో్ల వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధిం చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూ శారు. అనంతరం మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి మదన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, రోçశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడమేకాదు రాష్ట్ర మహిళాæ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, కన్వీనర్‌గా పార్టీకి సేవలందించారు. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఆమె సోమవారం టీఆర్ఎస్లో చేరారు. సునీతలక్ష్మారెడ్డితోపాటు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం ఆమె వెంటే నడిచారు. ‘గులాబీ’ తీర్థం పుచ్చుకున్న వారిలో యువజన కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రజని, పలు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు సత్యనారాయణగౌడ్, సూరారం నర్సింహులు, అహ్మద్, యాదా గౌడ్, ఎల్లం, నర్సింçహారెడ్డి, హన్మంతరెడ్డి, ప్రవీణ్ తదితరులతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. చంద్రపాల్‌తోపాటు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మెదక్ మున్సిపాలిటీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ సోమవారం టీఆర్ఎస్లో చేరారు. 38 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు విశేష సేవలందించిన ఆయన తగిన గుర్తింపు లేదని కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరుల సమక్షంలో ‘గులాబీ’ కండువా కప్పుకొన్నారు. ఆయనతోపాటు పట్టణం, వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ ఇక కనుమరుగైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు వలస బాట పట్టారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన నేతలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పార్టీలో ఉన్న నేతలు కూడా శ్రేణుల్లో ధైరాన్ని నింపే ప్రయత్నం చేయకపోవడంతో వారి చూపు ఇతర పార్టీల వైపు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరవేయాలో మేము నిర్ణయిస్తాం
సాక్షి, సంగారెడ్డి: ఎన్నికలు దగ్గర పడటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రచార జోరు పెంచారు. శనివారం సంగారెడ్డిలో పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మా కోసం కష్టపడి పని చేయండి తర్వాత ఐదు ఏళ్ళు మేము మీ కోసం మేము కష్టపడి పని చేస్తామన్నారు. వచ్చే ఎంపీసీటీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేస్తామని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి సంగారెడ్డి నుంచి 30 వేల మెజారిటీ ఇవ్వాలి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వృద్ధులకు ఈ ఏప్రిల్ నుంచి రూ. 2016 ఫించను అందిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు పరిస్థితి అర్ధం అయింది. రోజుకొకరూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. పక్క పార్టీల వాళ్ళు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ రావాలి అంటే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని చెప్పారు. బీజేపీ వాళ్ళు మన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టారు. రాష్ట్రంలో వాళ్ళ గురుంచి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రాజెక్టులా విషయంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని విమర్శించారు. రానున్నా రోజుల్లో కేంద్రంలో ఎవరు జెండా ఎగురవేయలన్నది టీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో జరిగే సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి, నేను పాల్గొంటాం తెలిపారు. నర్సాపూర్‌లో నిర్వహించే సీఎం సభకు సంగారెడ్డి నుంచి 30 వేలకు పైగా కార్యకర్తలు తరలి రావాలి కోరారు. బీజేపీని ఎదుర్కొనే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
సీఎం పట్టుదలతో కాళేశ్వరం పరుగు
జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు బ్యారేజీలు, పంపు హౌస్ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రావిటీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం: సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. అనంతరం సీ–5 క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల్లో 5.81 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరగాల్సి ఉండగా ఇందని, 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగినట్లు ఆయన తెలిపారు. 58.46 లక్షల కాంక్రిట్ పనికి 30 లక్షల కాంక్రిట్ పని పూర్తయిందని తెలిపారు. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌లకు 4.5 కోట్ల సిమెంట్ బస్తాలు అవసరమవుతాయని వివరించారు. రాడ్స్( స్టీలు) 2.65 లక్ష మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ద్వారా వివిధ దశల్లో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రావిటీ కాల్వలో 1.80 కోట్ల మట్టి పనులకు 1 కోటి క్యూబిక్ మీటర్లు పూర్తయిందన్నారు. 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. గ్రావి టీ కాల్వ పనులను మే 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గడువులోగా పనులు చేయడానికి అదనంగా ఇంజనీర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నట్లు చెప్పారు. గ్రావిటీ కెనాల్లో రోజుకు 1.70 లక్షల క్యూబిక్ మీటర్ల రికార్డు లెక్కన మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు. మేడిగడ్డలో 15.50 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉండగా.. రోజులు 5 వేల క్యూబిక్ మీటర్లు కాంక్రిట్ పని చేస్తున్నట్లు వివరించారు. రోజుకు 7 వేలకు పెంచాలని సూచించినట్లు తెలిపారు. అన్నారం బ్యారేజీలో 11 లక్షల క్యూబిక్ మీటర్లకు 7.50 లక్షలు పూర్తయిందన్నారు. సుందిళ్ల బ్యారేజీలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్‌కు 6.50 లక్షల పూర్తయిందని తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్ అన్ని అప్రూవల్స్ వచ్చాయని, గ్రావిటీ కెనాల్లో 29 స్ట్రక్చర్స్ ఉన్నాయన్నారు. పంపుహౌస్‌లకు మెటీరియల్ షిప్పింగ్ ద్వారా స్పైరల్ డాప్ట్ ట్యూబు, పంపులు, మోటార్లు ఏప్రిల్ వారంలోగా వస్తున్నాయన్నారు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల ద్వారా వస్తున్న ట్లు వివరించారు. మూడు పంపుహౌస్‌ల వద్ద 400, 220, 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం ఏప్రి ల్ వరకు పూర్తవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, కాళేశ్వరం బ్యారేజీ సీఈ నల్ల వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈలు మల్లికార్జున్ ప్రసాద్, రమణారెడ్డి, డీఈ ఈలు ప్రకాష్, యాదగిరి, సూర్యప్రకాష్, ఆప్కాన్ డైరెక్టర్ మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. డీఎస్పీ ప్రసాదరావు, సీఐ రమేష్ బందోబస్తు నిర్వహించారు. మేడిగడ్డ, పోచంపల్లి బ్యారేజీ పనుల పరిశీలిన.. మహదేవపూర్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని సీపీఐ మావోయిస్టు ఇలాఖాలో శనివారం మంత్రి హరీష్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, పోచంపల్లి వద్ద బ్యారేజీలను, కన్నెపల్లి–అన్నారం పంపుహౌస్‌లు, కన్నెపల్లి–అన్నారం గ్రావిటీ కె నాల్ పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు అన్నారం చేరకున్న మంత్రి రాత్రి 7 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. పనుల పురోగతిపై చర్చించారు. -
ఇప్పుడలా లేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గొప్పగా నడుస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో ఎండిన పంట, లాంతర్లతో అసెంబ్లీకి వచ్చేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. గతంలో ఏదో ఒక అంశంపై సమావేశాలు వాయిదా పడేవని, ఇప్పుడు ఏ అంశం పైనైనా చర్చకు తాము సిద్ధమనడంతో వాయిదా ప్రసక్తే ఉండటం లేదన్నారు. గతంలో బిల్లులపై చర్చలు జరిగేవి కావని, గిలెటిన్ అయ్యేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ రోజు అంశం ఆరోజే పూర్తవుతోందని, వాయిదా తీర్మానాలపై చర్చ సాధ్యం కాదని పేర్కొన్నారు. మోదీ మాట తప్పారు అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. కోటి ఉద్యోగాలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని, తాము అలా కాదని హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ వాకౌట్ చేయడం దారుణమన్నారు. నిరుద్యోగుల గురించి ఈ రెండు పార్టీలు ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలు ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. -
నీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్ పేరు
► మంత్రి హరీష్‌రావు సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుకు.. జలసాగరుడు ఆర్.విద్యాసాగర్ రావు పేరు పెట్టనున్నట్టు భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీష్‌రావు అన్నారు. త్వరలో క్యాబినెట్ ఆమోదానికి పెడతామన్నారు. ఈ విషయం సీఎం స్వయంగా చెప్పారన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆర్.విద్యాసాగర్‌రావు స్మారక నాటకోత్సవాల సభలో మంత్రి మాట్లాడారు. సీఎం ఆశయాలు, విద్యాసాగర్‌రావు కల అయిన కోటి ఎకరాలకు నీరు పారించి చూపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా సాగుతుండంటే ఆయన ఒత్తిడే కారణమన్నారు. ‘నీళ్లు – నిజాలు’ పుస్తకంతో తెలంగాణ సమాజ స్వరూపాన్నే మార్చి వేసిన ధీరోదాత్తుడు విద్యన్న అని గుర్తు చేసుకొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు గొప్ప సాంస్కృతిక వాది, కళామూర్తి అని చెప్పారు. నటుడు, రచయిత, ప్రయోక్త అని చెప్పారు. రచయిత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నదీ జలాల్లోని అన్యాయాన్ని గుండె గొంతుకతో చెప్పిన గొప్ప ఆదర్శమూర్తి విద్యాసాగార్ రావు అన్నారు. ఈ సందర్భంగా ‘ఆర్. విద్యాసాగర్ రావు నాటకాలు – నాటికలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో సినీ దర్శకుడు బి.అమరేంద్ర, టి.సందరంలను సన్మానించారు. -
ఇద్దరి మధ్య ఎంత?
‘‘సినిమాను చూసి, మంచి సందేశాత్మక చిత్రాన్ని అందిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మా యూనిట్‌ను అభినందించిన క్షణాలు మరువలేనివి’’ అని నిర్మాత శివరాజ్‌పాటిల్ అన్నారు. నాని ఆచార్య దర్శకత్వంలో రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా సాయితేజపాటిల్ సమర్పణలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. ‘తీన్మార్’ ప్రోగ్రామ్ ఫేమ్ బిత్తిరి సత్తి కీలక పాత్ర చేశారు. ఈ నెల 21న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ. -
చేతులెత్తి దండం పెడుతున్నా..
ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు: కాంగ్రెస్‌కు హరీశ్ విన్నపం ⇒ జనం ఉసురు పోసుకోవద్దని వ్యాఖ్య ⇒ అక్రమ ప్రాజెక్టులకు గేట్లెత్తి హారతులిచ్చింది ఎవరో తెలుసంటూ విమర్శలు ⇒ గత వైఫల్యాలకు తమను బాధ్యులను చేయొద్దన్న జానారెడ్డి ⇒ తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేశారన్న డీకే అరుణ ⇒ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: ‘‘దండం పెడుతున్నా.. మా మీద కోపం ఉంటే తిట్టండి.. కానీ ప్రాజెక్టులను మాత్రం దయచేసి అడ్డుకోవద్దు. జనం ఉసురు పోసుకోవద్దు. ఇక మీ దయ..’’ అంటూ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చేతులెత్తి కాంగ్రెస్ సభ్యులను వేడుకున్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు, సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. నందికొండ దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ స్థలాన్ని మార్చడం మొదలు ప్రాజెక్టులను, చెరువులను పట్టించుకోకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టులకు, అనుమతుల్లేని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, మంగళ హారతులు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఇప్పుడు కూడా అడుగడునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై చర్చ అనంతరం హరీశ్ సమాధానం ఇచ్చారు. నీటి లభ్యత లేనందునే ప్రాణహిత రీ డిజైన్ తమ్మిడిహెట్టి వద్ద సరైన నీటి లభ్యత లేని కారణంగానే ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని హరీశ్ తెలిపారు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2015లో చెప్పిందన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 270 టీఎంసీలు అనుకున్నామని... కానీ 165 టీఎంసీలే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొందన్నారు. 152 మీటర్ల వరకు కడితే 120 టీఎంసీలు వస్తాయని.. 148 వద్ద కడితే 44 టీఎంసీలే లభ్యతగా ఉంటాయని చెప్పిందన్నారు. 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం సైతం ముంపును ఒప్పుకోమని చెప్పారన్నారు. ‘‘మల్లన్నసాగర్‌ను నిలుపుదల చేసేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది. సిరిసిల్లలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మహేందర్‌రెడ్డి మల్లన్నసాగర్‌పై చనిపోయిన వ్యక్తుల పేర్లపై కేసులు వేశారు. రెండేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఆత్మలుగా వచ్చి కాంగ్రెస్ తరపున కేసులు వేశాయా? కొల్హాపూర్‌లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అడవి ఉందని... పులులు చనిపోతాయని చెప్పి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారు. నిజానికి అక్కడ పులులు కాదు కదా పిల్లులు, తొండలు కూడా లేవు..’’ అని హరీశ్ అన్నారు. మేం నీళ్లిచ్చింది వాస్తవం కాదా: జానా మంత్రి హరీశ్ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. తమ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులే కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులు ఒక్కటీ ముందుకు సాగడం లేదన్నారు. . ‘‘భీమా, నెట్టెంపాడులో మేం 70 శాతం నుంచి 80 శాతం నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? దేవాదుల కింద నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? గత వైఫల్యాలకు మమ్మల్ని బాధ్యులను చేసి మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ?: డీకే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులనే పూర్తి చేసి అంతా తామే చేశామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కొత్తగా మొదలుపెట్టిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులను 2012లోనే తామే పూర్తి చేశామని... అప్పుడే నీరిచ్చామన్నారు. అలాంటిది ఈ మంత్రి వచ్చి ఎలా ప్రారంభోత్సవం చేశారని ప్రశ్నించారు. -
ఆకలిచావులు లేని తెలంగాణే ధ్యేయం
⇒ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను నిలదీయాలి ⇒ మంత్రి హరీశ్‌రావు ⇒ మీ పాలనలో ఏనాడైనా రైతులు ధర్నా చేయకుండా ఉన్నారా... అని ప్రశ్న సాక్షి, యాదాద్రి: రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొ న్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే అత్యధి కంగా రాష్ట్రంలో రూ.600 కోట్లతో 12 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క మహబూబ్ నగర్లోనే నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసి 4.50 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో యాసంగి పంటకు 30 వేల ఎకరాలకు, బోధ్‌లో 40 వేల ఎకరాలకు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా 60 వేల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాని దేనని పేర్కొన్నారు. తమ పాలనలో చేయలేని పనులను మరొకరు చేయొద్దన్న అక్కసుతో మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడానికి చనిపోయిన రైతుల పేరుతో కాంగ్రెస్ కేసులు వేయించిందని మంత్రి ఆరోపించారు. మీ పాలనలో ఏనాడైనా రైతులు ధర్నా చేయ కుండా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను గట్టిగా ప్రశ్నించాలని కార్యకర్తలను కోరారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగైదు రోజుల్లో ‘కంది’ బకాయిల చెల్లింపు
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం • కంది సాగు పెరగడంతో ఆశించిన ధర రావడం లేదు • ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే • పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి • దిగుమతులపై సుంకాలు విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కంది రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి కంది పంటను కొనుగోలు చేసినా సొమ్ము చెల్లించని వైనాన్ని వివరిస్తూ.. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పైసలేవి సారూ!’ కథనంపై ఆయన స్పం దించారు. కంది క్రయ విక్రయాలు, వ్యవ సాయ మార్కెట్లలో తాజా పరిస్థితిపై సమీక్షించారు. చిట్టచివరి గింజ వరకు కంది కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 90 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 74 వేల టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ సంస్థ 49వేల టన్నులు కొనుగోలు చేసిందని, ఎఫ్‌సీఐ 25 వేల టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగు పెరగడంతో.. రాష్ట్రంలో ఇంతకు ముందు 2.47 లక్షల హెక్టార్ల కంది సాగు జరిగేదని, ఇప్పుడు 4.35 లక్షల హెక్టార్లకు పెరగడంతో.. రైతులకు ఆశించిన ధర లభించడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం దని చెప్పారు. కంది తదితర పంటల మార్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయ న్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధిం చి మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ తదితర ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తెలంగాణ కంది రైతులకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. 2016–17లో లక్ష టన్నులు, మరో మూడేళ్లలో 2 లక్షల టన్నుల కందిని దిగుమతి చేసు కోవడానికి కేంద్రం ఎంవోయూ చేసుకోవడం, శనగలు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వ 2006 ఎగుమతి విధానంలో నిషేధించడంతో ఈ సమస్య తలె త్తిందన్నారు. అంతేగాకుండా పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని, దిగుమతులపై సుంకాన్ని పెంచితేనే దేశంలోని రైతులకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను ఇదివరకే లేఖ రాశానని మంత్రి వెల్లడించారు. పప్పుధాన్యాల ఎగుమతి విధానాన్ని సులభతరం చేయాలని.. నిల్వలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా కంది దిగుబడులు వచ్చినందున మార్కెట్లో ధర తగ్గినట్టు మంత్రి విశ్లేషించారు. కంది రైతుల సమస్యలు, ఫిర్యాదుల కోసం జనవరి 21న ప్రారంభించిన కాల్ సెంటర్ పనితీరును సమీక్షించారు. దీనికి ఇప్పటివరకు 305కు పైగా ఫిర్యాదులు అందినట్టు మార్కెటింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసు కొచ్చారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్య లు తీసుకోవాలని హరీశ్ ఆదేశించారు. -
సచివాలయ భవనాల అప్పగింతే..!
-
సచివాలయ భవనాల అప్పగింతే..!
♦ ఏపీ త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయ అంగీకారం ♦ తొమ్మిదో షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల విభజనపై కీలక నిర్ణయాలు ♦ గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు రెండో భేటీ ♦ 26న రాజ్‌భవన్‌లో మూడో సమావేశం సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిరుపయోగంగా ఉన్నందున ఈ భవనాలను ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని, తమ ముఖ్యమంత్రితో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీ సభ్యులు గురువారం రెండోసారి భేటీ అయ్యా రు. తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రా వు, జగదీశ్‌రెడ్డి, సలహాదారు వివేక్, మెంబర్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ తరఫు న మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, విప్ కాల్వ శ్రీనివాసులు, మెంబర్ సెక్రెటరీ ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. 9 సంఘాల విభజనకు ఒప్పందం.. ఈ చర్చల సందర్భంగా 9 బీసీ సంఘాల విభజనకు పరస్పర ఒప్పందం కుదిరిం ది. ఏపీ వడ్డెర కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ వాల్మీకి బోయ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ కృష్ణబలిజ /పూసల కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ బట్రాజ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ విశ్వబ్రాహ్మణ కోఆప రేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ కుమ్మర (శాలివాహన) కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరే షన్ లిమిటెడ్, ఏపీ మేదర కోఆపరేటివ్ సొసై టీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ గీత కార్మికుల కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ సగర(ఉప్పర) కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజనకు రెండు కమిటీల మధ్యా అంగీకారం కుదిరింది. హైకోర్టు విభజనపై ప్రతిపాదన.. హైకోర్టు విభజనపై కూడా సత్వర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. దీనిపై రెండు రాష్ట్రాల కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. హైకోర్టుకు అమరావతిలో త్వరగా స్థలం కేటాయించుకుని, విభజనకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఏపీకే నిర్వహణ వ్యయం పెరిగిపోతోంది : హరీశ్‌రావు ‘ఏపీ సచివాలయం ఇప్పటికే ఖాళీ చేసి తాళాలేసి పెట్టారు. అక్కర లేకున్నా పన్ను లు, బిల్లులు కడుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికే నిర్వహణ వ్యయం పెరిగిపో తోంది. ఎలుకల బాధ. చెత్త పేరుకోవటంతో మాకూ ఇబ్బందిగానే ఉంది.. అదే విషయాన్ని చెప్పాం. సీఎంతో మాట్లాడి నిర్ణయం చెపుతామన్నారు’అని భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో అన్నారు. పరస్పర బదిలీలకు ఓకే.. సచివాలయంతో పాటు జిల్లాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రతిపాదనకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఏయే పోస్టులకు చెందిన వారు.. ఎంత మంది ఉద్యోగులు పరస్పర బదిలీకి అంగీకార యోగ్యంగా ఉన్నారో అభ్యర్థనల ను స్వీకరించి.. అంత మేరకు బదిలీ చేస్తే ఇబ్బందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైం ది. విద్యుత్ ఉద్యోగుల విభజన, పెండిం గ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల ఎండీలు కలసి మాట్లాడుకుని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లో తమకు అందిం చాలని కమిటీ సభ్యులు సూచించారు. తదుపరి సమావేశంలో ఈ వివరాలను చర్చించాలని నిర్ణయించారు. కాగా, ఈ నెల 26న రాజ్‌భవన్‌లో మూడోసారి సమావేశం కావాలని నిర్ణయం జరిగింది. -
హరీశ్ సభను తప్పుదోవ పట్టించారు
సాక్షి, హైదరాబాద్: సభానిర్వహణకు అడ్డుపడకపోయినా, కనీసం కుర్చీ నుంచి నిలబడకపోయినా శాసనసభ నుంచి తనను ఒకరోజు సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శనివారం శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ వెల్‌లోకి తాను వెళ్లలేదని, సభలో మాట్లాడుతున్న ఏ సభ్యుడినీ తాను అడ్డుకోలేదని అన్నారు. వెల్‌లోకి వెళ్లాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని ఇతర సభ్యులను తాను ప్రోత్సహించినట్టుగా శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడటం సరికాదని భట్టి అన్నారు. సభను తప్పుదోవ పట్టించేవిధంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారని ఆరోపించారు. శాసనసభలో వీడియో ఫుటేజీని సభాపతి ముందు పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. తాను తప్పుచేసినట్టుగా తేలితే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. స్పీకర్ ముందు వీడియో ఫుటేజీని పెట్టకుంటే, అబద్ధాలు మాట్లాడిన మంత్రి హరీశ్‌రావుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని భట్టి హెచ్చరించారు. -
'ఎస్ఈ ఆఫీసులలో ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు'
హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కార్యాలయాల్లో ఎమర్జెన్సీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆదేశించారు. ఒక ప్రత్యేక ఫోన్‌నంబర్ ఏర్పాటు చేసి అన్ని టీవీ ఛానళ్లు, ఇతర వార్త ప్రసార సాధనాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి ఇరిగేషన్ శాఖ సన్నధ్దంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన వర్షాలపై సీఈ, ఎస్ఈ, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఆందోళన కల్గిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నధ్దంగా ఉండాలన్నారు. వర్షాలతో వేలాది చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని, ఈ దృష్ట్యా ఇంజనీరంతా క్షేత్రస్థాయికి వెళ్లి విధులు నిర్వహించాలన్నారు. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున వరద నీటిని సురక్షితంగా అతి తక్కువ నష్టంతో దిగువకు విడుదల చేయాలని కోరారు. వరద నీరు చేరుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గ్రామ సర్పంచులు, వీఆర్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చెరువు కట్టలు, కాల్వల గండ్లను, బుంగలను వెంటనే పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిధ్దం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి, రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. -
‘సాక్షి’ చొరవ భేష్
♦ ఈత వనాల పెంపకం పెద్ద బాధ్యత ♦ సామాజిక సమస్యకు పరిష్కారం ♦ 16న చిట్టాపూర్‌లో జరిగే హరితహారానికి తరలిరండి ♦ గీత కార్మికులకు మంత్రి హరీశ్‌రావు పిలుపు గజ్వేల్: ఈత వనాల పెంపకం గీత కార్మిక సామాజిక వర్గానికి బతుకుదెరువని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. స్వచ్ఛమైన కల్లు రావాలంటే విరివిగా ఈత చెట్లను పెంచడమే పరిష్కారమన్నారు. ఈత వనాల ప్రాముఖ్యతకు గుర్తింపునిస్తూ సామాజిక బాధ్యతగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టడానికి ‘సాక్షి’ ముందుకు రావడం అభినందనీయమన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హరితహారాన్ని వినూత్న పంథాలో ముందుకు తీసుకువెళ్లడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. అడవుల్లో కోతులు, ఇతర జంతువులకు ఆహారాన్నిచ్చే చెట్లు అంతరించిపోతున్న తరుణంలో... ఆ చెట్లను పెంచి కోతులను వనాలకు తిప్పి పంపాలన్నారు. ఇలాంటి కార్యాచరణ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అంతేగాకుండా పట్టణాలను, గ్రామాలను అడవులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో అడవులు ఏడు శాతానికి మించిలేదని, దీన్ని 33శాతానికి పెంచడానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సి ఉందన్నారు. ఈ ఉద్యమంలో ‘సాక్షి’ సంస్థ భాగస్వామిగా మారి వైవిధ్యమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుందన్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈనెల 16న భారీ ఎత్తున ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమం నిజంగా జిల్లాలోని గీత కార్మికులను ఏకతాటిపైకి తీసుకువచ్చేదిగా మారబోతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని గీత కార్మికులు, గౌడ కులస్తులు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. -
పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు
సమన్వయ కమిటీ ప్రతిపాదనల్లో చేర్చాం: హరీశ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పలు ప్రతిపాదనలను రూపొందించిందని.. త్వరలోనే వాటిని కేంద్ర మంత్రి మండలికి అందజేయనుందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో పీఎంకేఎస్‌వై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీఎంకేఎస్వైలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు చేర్చాలని సిఫారసుల్లో చేర్చాం. మొత్తంగా ప్రాజెక్టులపై రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఎంవోయూ జరిగిన వారంలోనే నిధులు విడుదల చేయాలి, ప్రాజెక్టు వ్యయంలో 60% గ్రాంటుగా ఇవ్వాలి, ఆపైన నాబార్డు నుంచి కేంద్రం హామీదారుగా ఉంటూ రుణం ఇప్పించాలి, ఆ రుణంపై వడ్డీని 4.5 శాతానికి తగ్గించాలి, సకాలంలో పూర్తయిన ప్రాజెక్టుల రుణంపై వడ్డీని కేంద్రమే భరించాలి, అంచనా వ్యయం 200% పెరిగిన ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పునఃపరిశీలించాలని ప్రతిపాదించాం. వాటి ని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించి నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం..’’ అని హరీశ్ తెలిపారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో భేటీ తమ్మిడిహట్టి, మేడిగడ్డతోపాటు పలు ఇతర ప్రాజెక్టులకు సహకరించాలని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీలతో కలసి హన్స్‌రాజ్ అహిర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిర్మించే నీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చించాం. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. -
నాసా వెళ్లే విద్యార్థికి రూ.2 లక్షల సాయం..
సాక్షి, హైదరాబాద్: నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల సాయం అందించింది. సిద్ధిపేట నియోజకవర్గంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను మే 18 నుంచి 22 వరకు అమెరికాలో జరిగే సదస్సుకు హాజరు కావాలని నాసా ఆహ్వానించింది. అయితే విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం మంత్రి టి.హరీశ్‌రావు దృష్టికి రావడంతో ఆయన ప్రభుత్వం నుంచి రూ.2లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆదివారం సెక్రటేరియట్లో ప్రశాంత్‌కు మంత్రి అందజేశారు. -
రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు కుట్ర
♦ తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలన్న ఏపీ కేబినెట్ తీర్మానంపై హరీశ్ ♦ జగన్‌పై పైచేయి సాధించేందుకే ఈ కుటిల రాజకీయం ♦ ప్రాజెక్టులను కట్టి తీరుతామని స్పష్టీకరణ ♦ నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాలు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టుకు భూమి పూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే చూసి ఓర్వలేక కళ్ల మంటతో ఏపీ కేబినెట్ తీర్మానం చేసిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, దీక్ష చేస్తానంటున్న వైఎస్ జగన్‌పై పైచేయి సాధించడానికే... చంద్రబాబు సర్కారు కుటిల రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులను, ప్రాజెక్టులను బలి చేయాలనుకోవడం వారి వంకర బుద్ధిని బయట పెడుతోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ కేబినెట్ చేసిన తీర్మానంపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఏపీవన్నీ అవాస్తవాలే.. ప్రాజెక్టులు, జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ అవాస్తవాలని, వారి మాటలను ఎవరూ నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘‘ఏపీ కేబినెట్ తీర్మానం చెల్లని రూపాయి.. దానికి ఎలాంటి విలువా లేదు. కాబట్టే కోర్టులకు పోతామంటున్నారు. కోర్టుల్లో కేసును ఏళ్లకేళ్లు సాగదీసి ప్రాజెక్టులు కట్టకుండా కుట్రలు పన్నుతున్నారు. వారు ప్రాజెక్టులను ఆపలేరు. కట్టి తీరుతం. నేనే ప్రాజెక్టుల దగ్గర కూర్చుని, అక్కడే నిద్రపోయి ప్రాజెక్టులు పూర్తి చేస్తా..’’ అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులు కట్టింది ఏపీ అని, అన్యాయంగా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అనుమతి తీసుకుని పట్టిసీమ కట్టారని... పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ఏం అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు. కృష్ణాబేసిన్లోనే ఉన్న పాలమూరు, నల్లగొండ జిల్లాలకు కృష్ణా నీరు ఇస్తామంటే అడ్డుతగులుతారా అని నిలదీశారు. నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా, దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయగలరా అని సవాల్ విసిరారు. కేటాయింపుల మేరకే.. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా నికర జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారని.. దీంతోపాటు 77టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 376 టీఎంసీల నీటి వాటా ఉందని... పాలమూ రు, డిండి కట్టినా 250 టీఎంసీలకు మించి వాడుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటిది తెలంగాణ వాటాకు మించి నీళ్లు వాడుతున్నట్లు దుష్ర్పచారం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. కృష్ణా జలాల్లో ప్రతి రాష్ట్రానికి గంపగుత్త కేటాయింపులు (ఎన్‌బ్లాక్) ఉన్నాయని, దాని ప్రకారమే పాలమూరు, డిండి కడుతున్నామని తెలిపారు. అవి పాత ప్రాజెక్టులే.. కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారని... కృష్ణాలో 30టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతలను చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అంటే ఇవి పాత ప్రాజెక్టులేనని, దీనికోసం కొత్తగా అపెక్స్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలోనే నీటి కేటాయింపులు చేసి, సర్వేలు చేసి, కొంత ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను తప్పుబడతారా, రాజకీయాల కోసం ఇంత అబద్ధాలాడతారా? అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అనుమతుల్లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు కట్టి, విభజన చట్టాన్ని ఉల్లంఘించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. -
రూ. 6కోట్ల పనులకు రూ.36 కోట్లు ప్రతిపాదిస్తారా?
♦ మహబూబ్‌నగర్ జిల్లా అధికారులపై మంత్రి ఆగ్రహం ♦ ఈ నిధులతో మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించవచ్చు ♦ బాధ్యులందరికీ నోటీసులు జారీ చేస్తాం ♦ పనిచేయలేని అధికారులు వెళ్లిపోవచ్చు ♦ ‘మిషన్ కాకతీయ’పై ఖేడ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నారాయణఖేడ్: ఒక ఎకరం కూడా నీరందించని చెరువుకు రూ.6 కోట్లు సరిపోతాయని, దానికి రూ.36 కోట్లు ప్రతిపాదిస్తే ఎలా అని మహబూబ్‌నగర్‌జిల్లా అధికారులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ నిధులతో మధ్యతరహా ప్రాజెక్టునే నిర్మించవచ్చని, ఈ ప్రతిపాదనల ఫైలుపై సంతకం చేసిన అధికారులందరికీ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతోపాటు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. జిల్లాల వారీగా మిషన్ కాకతీయ పథకం పనుల తీరుతెన్నులను సమీక్షించారు. మిషన్‌కాకతీయ పనుల్లో మహబూబ్‌నగర్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉండడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో అధికారుల అలసత్వం సరికాదన్నారు. వారం తర్వాత మళ్లీ సమీక్షిస్తానని, అప్పటిలోగా పరిస్థితుల్లో మార్పు రాకుంటే సహించేది లేదన్నారు. పనిచేయలేని అధికారులు వెళ్లిపోవచ్చన్నారు. ఇతర జిల్లాల్లో 90 శాతం పురోగతి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 50 శాతం వరకే ఉందని మం త్రి పేర్కొన్నారు. కేవలం 30 శాతమే అగ్రిమెంట్లు అయ్యాయని, ఇందుకు ఎస్ఈ బాధ్యత వహించాలి కదా అని ప్ర శ్నించారు. డివిజన్ల వారీగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. జూన్ తొలి వారంలో వర్షాలు కురుస్తాయని, ఆ రేడు వారాల్లో పనుల అగ్రిమెంట్లు పూర్తవ్వాలన్నారు. త్రిబుల్ఆర్, నాబార్డు ఫేస్ 2, 3, 4 పనులు వేగవంతం చేయాల న్నారు. జైకా, ప్రపంచ బ్యాంకు నిధులు జూన్‌లోపు ఖర్చు చే యాలన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు సంతకాలు చేస్తే వారే బాధ్యత వహించాలని, చర్యలు తప్పవన్నారు. -
కాంగ్రెస్.. సెల్ఫ్ గోల్ చేసుకుంది
♦ అసెంబ్లీ సమావేశాలు గొప్పగా జరిగాయి ♦ సభా సమయం వృథా కాలేదు ♦ పన్నెండేళ్లలో అతి తక్కువ వాయిదాలు ♦ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈసారి అద్భుతంగా జరిగాయని, పదిహేడు రోజుల పాటు మంచి చర్చ జరిగిందని శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. సభా సమయం వృథా కాలేదన్నారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత గురువారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరులతో మాట్లాడారు. ‘గడిచిన 12 ఏళ్లలో అతి తక్కువ సార్లు సభ వాయిదా పడడం ఇదే తొలిసారి. పోడియంలోకి ఎవరూ రాలే దు. ఏ ఒక్క రోజూ సభా సమయం వృథా కాలేదు. ప్రతిపక్షాలను కలుపుకుని పోయాం. ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి సభ జరిపింది. గతంలో అన్ని పద్దులపై ఎప్పుడూ చర్చ జరగలేదు. గత ఏడాది, ఈసారి కలిపి రెండు సార్లూ అన్ని పద్దులపై చర్చించాం. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాం. మంత్రుల కంటే ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం’ అని మంత్రి హరీశ్ వెల్లడించారు. ప్రతిపక్షాల గైర్హాజరు దురదృష్టకరం చివరి రోజు ప్రతిపక్షాలు సభను బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమని హరీశ్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సభకు ఎందుకు హాజరు కాలేదో తమకు తెలియదని, టీవీలు చూసి బయట ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. ‘క్రికెట్ ఇంట్లో ఆడితే ఎలా? గ్రౌండ్లో కదా ఆడాల్సింది. మీ వాదనలో పసలేదు. నిజాయితీ ఉంటే సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష సభ్యులకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తామన్నాం. టెక్నాలజీ వాడొద్దని రూల్స్ ఉన్నాయా? ఆన్లైన్లో సమాచారం, మెయిల్స్ ద్వారా ప్రశ్నలు పంపాలని, సభలో ల్యాప్‌టాప్‌లు వాడాలని రూల్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన అన్నారు. సభకు రాకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను క ళ్లకు కట్టారని, ఒక విధంగా ఆయన తన ఆత్మను సభలో ఆవిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్‌ది కేవలం గోబెల్స్ ప్రచారమన్నారు. వారు మాట్లాడింది బోగసని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ కూడా సభలో ఉండిఉంటే బావుండే దని, సీఎం ప్రతీ సభ్యుని ప్రశ్నకు జవాబిచ్చారని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఇప్పటికైనా, కనీసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో పాల్గొని పనులు చేసుకోవాలని, ప్రజలకన్నా మేలు చేయాలని, మంచి పనులకు మద్దతుగా నిలవాలని హితవు పలికారు. సమావేశంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం మండలిలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం శాసన మండలిలో సాగునీటిపై లఘుచర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను, తెలంగాణ అవసరాలను ఎలా తీ ర్చబోతున్నామన్న అంశాలను అందరికీ తెలిపేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభ లో ఇచ్చిన ప్రజెంటేషన్ దేశంలోని ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాల్సిందిపోయి, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని పారిపోయాయన్నారు. వట్టిపోయిన ప్రాజెక్టులకు నీటిని ఎలా తెస్తామో సీఎం వివరించారని, పెండింగ్ ప్రాజెక్టులను కూడా ఎలా పూర్తిచేస్తామో తెలిపారని ఆయన పేర్కొన్నా రు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్‌కు, భీమ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్‌కు ఏడాదిన్నరలో సాగునీరందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలు ఎటువంటి సూచనలిచ్చినా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, నరేందర్‌రెడ్డి, శంబీపూర్రాజు, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హరిత విప్లవం, క్షీర విప్లవం మాదిరిగా జలవిప్లవానికి కేసీఆర్ నాంది పలికారని, త్వరలోనే కోటి ఎకరాల బీడుభూములు మాగాణంగా మారబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
కృష్ణా, గోదావరితో జిల్లా సస్యశ్యామలం
♦ పాలమూరు, డిండి, ప్రాణహితతో సాగులోకి 4.35 లక్షల ఎకరాలు ♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం ♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ♦ జిల్లా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కృష్ణా, గోదావరి జలాలతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి, చేవెళ్ల- ప్రాణహిత, డిండి ప్రాజెక్టుల ద్వారా 4.35 లక్షల ఎకరాలను స్థిరీకరిస్తామని చెప్పారు. సోమవారం శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై అనుమానాలను నివృత్తి చేసిన ఆయన.. పాలమూరు- రంగారెడ్డి పథకం కింద 2.75 లక్షల ఎకరాలను సాగులోకి తేనున్నట్లు చెప్పారు. గత పాలకులు కేవలం 2.10 లక్షల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు చేసి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్‌కు 35వేలు, పరిగి 38వేలు, తాండూరు 98వేలు, చేవెళ్లకు 27వేలు, ఇబ్రహీంపట్నంకు 25,400, రాజేంద్రనగర్ 6,600 ఎకరాలకు సేద్యపు నీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలను సాగులోకి తేనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రాణహిత -చేవెళ్ల ద్వారా మేడ్చల్‌లో 6వేల ఎకరాలను స్థిరీకరిస్తామని, మేటిగడ్డ ప్రాజెక్టు నీరు అందదనే అపోహ వద్దని అన్నారు. జిల్లాలో చెరువులు, చిన్న నీటి వనరుల పథకాలను పునరుద్ధరించడం ద్వారా సాగునీటి వనరులను పెంపొందిస్తామన్నారు. మూసీనది విస్తరణతో జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గానికి మేలు జరుగుతుందన్నారు. నారాయణరావు ఛానల్ మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, వివేక్, కిషన్‌రెడ్డి, యాదయ్య, గాంధీ, తీగల కృష్ణారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గాంధీ, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విహంగ వీక్షణం
♦ నల్లవాగు, గట్టులింగంపల్లి పరిసరాలపై మంత్రి హరీశ్‌రావు ఏరియల్ వ్యూ ♦ తాగు,సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చలు నారాయణఖేడ్/కల్హేర్/మనూరు: గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉదయం 10 గంటల కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుం చి నారాయణఖేడ్ వచ్చారు. తొలుత సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మనూరు మండలంలోని గట్టులింగంపల్లి చెరువును, కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ల మళ్లింపు, గట్టులింగంపల్లి ప్రాజెక్టులోకి సింగూరు నీరు మళ్లించే విషయమై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. నల్లవాగు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేసే విషయమై ఈ సర్వే చేపట్టారు. నల్లవాగు ప్రాజెక్టు పరిసరాలను ఆయన సుల్తానాబాద్, గోసాయిపల్లి, అంతర్గాం, కంగ్టి మండలం నాగన్‌పల్లి, పోట్పల్లి, నిజామాబాద్ జిల్లా తిమ్మనగర్ వరకు పర్యటించి విహంగ వీక్షణం చేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి అధికారుల సలహా సూచనలు స్వీకరించారు. అనంతరం మంత్రి గంగాపూ ర్లో మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ప్రారంభించారు. సాయంత్రం 4కి తిరిగి హెలికాప్టర్ ద్వారా మంత్రి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లారు. చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు గట్టులింగంపల్లి చెరువు గురించి మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమై న ‘గట్టు కదిలిక’, మంత్రి ఏరియల్ సర్వే కు రానున్నారనే విషయాలను మండల ప్రజలు ఆసక్తిగా చదివారు. ఈ చెరువు ప్రాజెక్టు రూపుదాలిస్తే మనూరు మండలానికి మంచి రోజులు వస్తాయని ప్రజ లు చర్చించుకోవడం కనిపించింది. మం త్రి పర్యటను ఆసక్తిగా తిలకించారు. ‘ఖేడ్’ దుఃఖం తీరుస్తా.. నీటి సమస్యను పరిష్కరిస్తా.. జిల్లాకు రూ.10 కోట్లు వస్తే.. ఖేడ్కే రూ.1.80 కోట్లు చిమ్నీమాయి కొడుకు పెళ్లికి వెళ్దాం మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్: ‘నారాయణఖేడ్ ని యోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా.. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను.. నా శక్తినంతా ఉపయోగించి ఖేడ్ నియోజకవర్గ ప్రజల దుఃఖం దూరం చేస్తా.. ఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పాను.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా..’ అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉద్వేగంతో అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఎన్నికైన సందర్భంగా స్థానిక రహమాన్ ఫంక్షన్‌హాలులో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రేమాభిమానాలతో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారను. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉందన్నారు. నీళ్ల కోసం గోస పడుతున్న సర్దార్ తండాలోని చిమ్నీమాయి వంటి వారి సమస్యలను పరిష్కరిద్దామని, చిమ్నీమాయి కొడుకు పెళ్లికి కూడా వెళ్దామని మంత్రి అన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. జిల్లాకు తాగునీటి కోసం రూ.10.80 కోట్లు రాగా తన సిద్దిపేకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకొని నారాయణఖేడ్‌కు రూ.1.80 కోట్లు ఇచ్చినట్లు తెలి పారు. ప్రాంతంలో గురుకులాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా చూస్తానని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఖేడ్‌లో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ షురూ ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణఖేడ్‌లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం. బెడ్రూం, డైనింగ్ హాల్ ఇతర ఆధునిక సాంకేతిక హంగులతో దీన్ని రూపొందించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఈ క్యాంపు ఆఫీస్‌లోనే బస చేస్తారు. రోజంతా ఇక్కడే గడిపి ఖేడ్ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. మరోపక్క మంత్రి హరీశ్‌రావు సైతం వీలైతే 15 రోజులకు లేదా నెలకోసారి వస్తానని ప్రకటించారు. ఏళ్లకేళ్లుగా అభివృద్ధి జాడలేక నెర్రెలు బాసిన నారాయణఖేడ్ ఇప్పుడిప్పుడే కొత్తరూపు దాల్చుతోంది. నీళ్లు.. బళ్లు.. రోడ్లు.. భవనాలు ఇలా ప్రతి పనికి లెక్కగట్టి అధికారులు నిధులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
'అందుకే తోటపల్లి రద్దు చేశాం'
కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం కరీంనగర్లో స్పందించారు. ఖర్చు అధికం ప్రయోజనం స్వల్పం కాబట్టే తోటపల్లి రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తోటపల్లి చెరువును రూ. 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని హారీశ్ రావు వెల్లడించారు. -
పనుల ఆరంభానికి ప్రజాప్రతినిధులే అడ్డు!
మిషన్ కాకతీయపై మంత్రుల దృష్టికి తెచ్చిన అధికారులు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనుల ఆరంభానికి ప్రజాప్రతినిధులే అడ్డుపడుతున్నారని చిన్న నీటిపారుదల శాఖ జిల్లాల అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తాము స్వయంగా పాల్గొనే వరకూ పనులు ఆరంభించరాదంటూ కొందరు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అందువల్లే కొన్నిచోట్ల పనుల్లో ఆలస్యం అనివార్యమవుతోందని వెల్లడించారు. శనివారం సచివాలయంలో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు టెండర్ల ప్రక్రియ ముగిసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగినా పనుల ఆలస్యానికి గల కారణాలపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధుల వైఖరిని వారి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో కొన్నిచోట్ల చెరువుల ఆక్రమణలు, అటవీ శాఖతో ఎదురవుతున్న సమస్యలను చెప్పారు. ఇతర శాఖలతో సమన్వయంపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయని, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని మంత్రులు సూచించారు. పూడిక మట్టి తరలింపునకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. మిషన్ కాకతీయ పనుల్లో అధికారుల పనితీరును ప్రశంసించిన మంత్రి హరీష్‌రావు.. నిర్ణీత సమయంలో లక్ష్యం చేరుకోవాలన్నారని సమాచారం. ప్రతి గురువారం ఐకేపీ మహిళల శ్రమదానం మిషన్ కాకతీయలో భాగస్వామ్యమయ్యేందుకు తెలంగాణ ఇందిరా కాంత్రిపథం రోస్టర్ యూనియన్ మహిళా విభాగం ముందుకొచ్చింది. ప్రతి గురువారం రాష్ట్రవ్యాప్తంగా మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొని శ్రమదానం చేయాలని నిర్ణయించినట్లు యూనియన్ చైర్మన్ సురేఖారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పకడ్బందీగా ఇసుక పాలసీ అమలు
గనుల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని పకడ్బందీగా, అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను గనుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖకు విధించిన రూ. 3,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గనుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా గత ఏడాది 90 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగామని అధికారులు మంత్రికి వివరించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి సంబంధించి ఇప్పటికి 120 కేసుల్లో ఎన్వోసీలను జారీ చేశామని, పెండింగ్ కేసులను వచ్చే 3 నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. సీనరేజి చార్జీల సవరణ విషయంలో కమిటీని నియమించి చార్జీలు నిర్ణయించాలని, గ్రానైట్ క్వారీయింగ్‌లో స్లాబ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో పెట్టిన విజిలెన్స్ కేసులను ఒకేసారి పరిష్కరించుకోవడానికి వీలు కల్పించాలని, బిల్డర్స్ చార్జీల కింద చదరపు అడుగుకు రూ.3 వసూలు చేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఉత్తర్వుల జారీకి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి కొత్త నిబంధనలను రూపొందించాలని కూడా మంత్రి పేర్కొన్నారు. -
''మరో 20ఏళ్లు మీరు అక్కడే ఉంటారు''
-
ముంపు మండలాలపై దద్దరిల్లిన టి.అసెంబ్లీ!
-
'అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు'
హైదరాబాద్: కాంగ్రెస్ వల్లే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా పోయాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో అన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏడు మండలాలను అనాధగా మార్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దిగువ సీలేరు ప్రాజెక్టులో వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణకు కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. తమ పార్టీపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
బడ్జెట్లో పాలమూరుకు పెద్దపీట
* కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలకు తొలి ప్రాధాన్యమివ్వాలని సర్కారు యోచన * మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మార్చిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చేలా నీటి పారుదల శాఖ కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. కృష్ణా జలాలను కేటాయింపుల మేర వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని, దానికి ప్రధాన కారణం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడమేనని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని పూర్తి చేయడం ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 3లక్షల ఎకరాలకు,ఆపై వచ్చే ఆర్ధిక ఏడాదికి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధికారులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై సమీక్షించిన మంత్రి టి.హరీశ్‌రావు ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే ఏడాదికి సుమారు 6లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం.. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాదే 80శాతంపైగా పనులు జరిగిన పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు రూ.312 కోట్లను కేటాయించింది. అయితే భూసేకరణ చట్టానికి తుది రూపు రావడంలో జరిగిన జాప్యంతో ఎక్కడా ప్రాజెక్టు పనులు ముందుకు కదల్లేదు. దీనికి తోడు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు ఎస్కలేషన్ ఛార్జీలు పెంచే వరకు పనులు చేసేది లేదని భీష్మించడం వల్ల కూడా పనులు మందగించాయి. నాలుగు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సుమారు 3 లక్షల ఎకరాలకైనా సాగునీటిని అందించాలని లక్ష్య సాధ్యపడలేదు. ప్రస్తుతం భూసేకరణ చట్టం మార్గదర్శకాలు ఖరారు కావడం, భూ పరిహారం విషయంలో స్పష్టత వచ్చిన దృష్ట్యా ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు సైతం నెల రోజుల వ్యవధిలో మూడుమార్లు జిల్లా పర్యటనలు చేసి అధికారులతో సమీక్షించారు. తాజాగా ప్రాజెక్టుల పురోగతిని ప్రశ్నిస్తూ బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో శుక్రవారం మరోమారు మంత్రి పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. జిల్లా ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సహకరిస్తుందనీ, సుమారు రూ.500 కోట్ల కేటాయింపులకు సిద్ధంగా ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. పనులు వేగిర పరిచేలా అధికారులకూ సూచించినట్లు తెలుస్తోంది. పాలమూరు ఎత్తిపోతలకు రూ.1500 కోట్లు.. ప్రభుత్వం కొత్తగా చేపట్టాలని నిర్ణయించి 14,350 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాదే రూ.1500 కోట్ల మేర కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా వాటిలో సగం ఇచ్చేందుకు ఆర్ధిక శాఖ సమ్మతి తె లిపినట్లుగా తెలిసింది. శుక్రవారం నాటి సమీక్షలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. -
సాగర్ కుడి కాల్వకు చుక్క నీరిచ్చేదిలేదు!
రాష్ట్ర సర్కారు నిర్ణయం కృష్ణా డెల్టాకూ అంతే మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం.. ఏపీ లిఖిత పూర్వకంగా కోరితే నీటి విడుదలను పరిశీలించేందుకు సుముఖత సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద నీటిని తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు అడ్డుకట్ట వేసే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుడి కాల్వ కింద నీటి మట్టాలు పడిపోవడంతో తూముల గేట్లు ఎత్తి నీరందించాలన్న ఏపీ వినతిని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. కుడి కాల్వ కింద ఇప్పటికే అదనంగా 6 నుంచి 7 టీఎంసీల మేర అదనపు నీటిని వాడుకున్న దృష్ట్యా చుక్క నీరు ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. కృష్ణా డెల్టాకు సైతం 18 టీఎంసీల మేర నీటిని అదనంగా వాడుకున్న దృష్ట్యా డెల్టాకు కూడా నీరిచ్చే పరిస్థితి లేదనే నిశ్చయానికి వచ్చింది. అయితే తమ సాగు అవసరాల నిమిత్తం ఏపీ ప్రభుత్వపరంగా లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకుంటే మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం చేసి నీటిని వదిలే అవకాశాన్ని పరిశీలిస్తామని ఏపీకి తెలియజేయాలని నిర్ణయించింది. కృష్ణా జలాల వివాదం, సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల తదితర అంశాలపై బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. దీనికి ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, సాగర్ సీఈ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు కృష్ణా బేసిన్లో లభ్యత జలాలు, ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు, జరిగిన వినియోగం, ప్రస్తుత లభ్యత జలాలపై చర్చించారు. మొత్తంగా లభ్యమైన 552 టీఎంసీల నీటిలో ఏపీ 322 టీఎంసీలు, తెలంగాణకు 239.5 టీఎంసీల మేర నీటి వాటాలు ఉండగా ఏపీ ఇప్పటికే అదనంగా 42 టీఎంసీలు వాడుకుందని అధికారులు మంత్రికి తెలిపారు. కుడి కాల్వకు 132 టీఎంసీల మేర నీటి కేటాయింపులుండగా 138 టీఎంసీల మేర వాడుకున్నారని, కృష్ణా డెల్టాలో సైతం 152 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉండగా, 170 టీఎంసీలను వాడుకున్నారని అధికారులు వివరించినట్లు సమాచారం. తెలంగాణ తన వాటా 239.5 టీఎంసీల నీటిలో కేవలం 137 టీఎంసీల మేర వాడుకుందని, మరో 102 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉందని, మొత్తంగా 51 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కుతాయని వివరించినట్లు తెలిసింది. వాటాకు మించి వాడుకున్నందున ఏపీకి కుడికాల్వ కింద నీరివ్వరాదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఏపీ తన అవసరాలకోసం అర్జీ పెట్టుకుంటే కొంత నీటిని విడుదల చేసేందుకు ను పరిశీలిద్దామని నిర్ణయించినట్లు సమాచారం. కుడి కాల్వకు నీటి నిలిపివేత నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను బుధవారం నిలిపివేశారు. ఈ కాల్వపై ఉన్న విద్యుదుత్పాదన కేంద్రానికి నీరందకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా కేంద్రంలోని 2 టర్బైన్ల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేటాయింపు కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని, వాడకాన్ని 3,000 క్యూసెక్కులకు తగ్గించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులను కుడికాల్వ అధికారులకు, జెన్కో ఇంజనీర్లకు సాగర్‌డ్యామ్ ఎస్ఈ విజయభాస్కర్‌రావు ఫిబ్రవరి 3న అందజేశారు. అయినా వారు పట్టించుకోకుండా 4,000 క్యూసెక్కుల విడుదలను కొనసాగించారు. దీంతో జలాశయంలో బుధవారం నీటి నిల్వలు 532.8 అడుగులకు తగ్గి విద్యుదుత్పాదన కేంద్రంలోని అంతరాయం ఏర్పడి కుడికాల్వకు వెళ్లే నీరు నిలిచిపోయింది. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. -
చిన్న నీటి వనరులతోనే ఎక్కువ మేలు
చెరువులపై వర్క్‌షాప్‌లో మంత్రి హరీశ్‌రావు ఐదురోజులు దాటినా నో పోస్టింగ్స్ సాక్షి, హైదరాబాద్: భారీ సాగునీటి ప్రాజెక్టుల కన్నా చిన్న నీటి వనరుల పునరుద్ధరణతో ఎక్కువ మేలు జరుగుతుందని, అందుకే ‘మిషన్ కాకతీయ’కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా, గోదావరి నదుల కింద చిన్న నీటి వనరులకు 265 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణలో ప్రతి నీటిచుక్కను సక్రమంగా వినియోగించుకునేలా చెరువుల పునరుద్ధరణ చేయాల్సి ఉంది. భారీ ప్రాజెక్టులు చేపడితే వాటికి భూసేకరణ, పర్యావరణం వంటి అన్ని అనుమతులు కావాలి. రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టు 13 ఏళ్లుగా, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 30 ఏళ్లుగా, కల్వకుర్తి 10 ఏళ్లుగా కొనసాగుతున్నా నిర్ణీత ఆయకట్టులో 10 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. అదే చెరువుల పునరుద్ధరణకు ఇలాంటి సమస్య ఉండదు. కేటాయింపుల మేర నీటిని వాడుకునేలా చెరువుల పునరుద్ధరణ చేయగలిగితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు సమానమైన ఆయకట్టుకు నీరివ్వగలం’ అని ఆయన పేర్కొన్నారు. అందుకే ఏడాదికి రూ.5,500ల కోట్లతో 9వేల చెరువుల చొప్పున పునరుద్ధరించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. శుక్రవారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి సంస్థ ఆడిటోరియంలో ‘తెలంగాణలో చెరువుల నిర్వహణ’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, వ్యవస్థాగత లోపాలను ఆసరాగా చేసుకొని పట్టణ ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తున్నారని, దీనికి సామాజిక రక్షణ (సోషల్ ఫెన్సింగ్) ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. చెరువుల పూర్తి సామర్థ్యం(ఎఫ్టీఎల్)ను నిర్ధారించి దాని చుట్టూ మొక్కలునాటే పనులు చేపట్టి వాటిని కాపాడుకునే బాధ్యత స్థానిక ప్రజా కమిటీలకే ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని చెరువుల కబ్జాలపై రెండు మూడు రోజుల్లో వివిధ శాఖలతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. చెరువుల్లో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గోదావరి పరీవాహకంలో ఇసుక లభ్యత ఉన్న దృష్ట్యా అక్కడ.. ప్రభుత్వమే ఇసుక తీసి అమ్మకాలు చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. వనరుల నిర్వహణలో నిపుణుడు బీవీ సుబ్బారావు మాట్లాడుతూ, చెరువుల్లో నీరు సమృధ్ధిగా వచ్చేందుకు పరీవాహక రక్షణ చాలా ముఖ్యమన్నారు. నీరు, ఆహార భద్రతకు నమూనాలుగా చెరువులను తీర్చిదిద్దాలని సూచించారు. పర్యావరణ విధాననిపుణుడు కె.పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ నగరంలో ఉన్న 2వేల చెరువులను నింపినప్పుడే అభివృధ్ధి సాధ్యమని అన్నారు. వర్క్‌షాప్‌లో ఎంసీహెఆర్డీఐ డీజీ లక్ష్మీ పార్థసారధి, ఐఐపీఏ శాశ్వత సభ్యుడు కృష్ణసాగర్‌రావు తది తరులు పాల్గొన్నారు. -
ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: జయప్రద
తిరుమల: ‘‘మొన్నమొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలో ఇంకా టైముంది కదా? త్వరలోనే వెల్లడిస్తా’’ అని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో సమావేశం కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హరీశ్‌రావు తన సోదరుడు లాంటివారని, మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసానని ఆమె స్పష్టం చేశారు. -
‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం
దేశానికే ఆదర్శంగా పునరుద్ధరణ చేపడదాం: మంత్రి హరీశ్ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సూచన మండలానికో చెరువుకు తట్ట మోసేందుకు సిద్ధమని ప్రకటన పనుల్లో నాణ్యత, పారదర్శకత విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. చెరువుల పునరుద్ధరణను విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని హితవు పలికారు. శుక్రవారం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదలశాఖ ఇంజనీర్లకు లాప్‌ట్యాప్‌లు, సర్వే పరికరాలు అందించే కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రూ.10కోట్ల విలువైన పరికరాలను వారికి అందించారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ లక్ష్యాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి సూచనలు చేశారు. ‘ఇంజనీర్లకు పని నేర్చుకోవడానికి ఇదో అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని పునరుద్ధరణను సవాల్‌గా స్వీకరించండి. చెరువుల ఎంపిక, పనుల నాణ్యత, అంచనాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించండి. సొంతింటి ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగుల పట్ల ఎంత ప్రేమగా ఉంటామో నాణ్యత విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తాం. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేయండి. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టండి. అమెరికాలో ఉన్నవారు సైతం తమ గ్రామం పనులను తెలసుకునేలా ఈ వివరాలుండాలి. వాటిపై మా కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చేంత వరకు ఆలస్యం చేయొద్దు. పనుల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకుండా చూస్తాం’ అని పేర్కొన్నారు. పనుల నాణ్యతపై రాష్ట్ర కార్యాలయంలోని అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో లోపాలుంటే ఇంజనీర్లదే బాధ్యత అని అన్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని, దీన్నొక ప్రజా ఉద్యమంగా మలచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. బుందేల్‌ఖంఢ్‌లో ప్రారంభిస్తామన్నారు... మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వచ్చేందుకు అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో సైతం ప్రారంభిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలిసిన సందర్భంలో ఉమాభారతి తెలిపారని ఆయన వెల్లడించారు. -
అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపు
డిజైన్‌పై అన్నిపక్షాలతో స్పీకర్ చర్చలు 160-165 కుర్చీలకే పరిమితం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో సీట్ల సంఖ్యను కుదించనున్నారు. భవిష్యత్‌లో పెరగబోయే స్థానాలను దృష్టిలో పెట్టుకుని 160-165 వరకు వీటిని కుదించాలని నిర్ణయించారు. దీనిపై బుధవారం స్పీకర్ మధుసూదనాచారి అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో చర్చించారు. అంతకుముందు ఇదే అంశంపై జి,చిన్నారెడ్డి (కాంగ్రెస్), అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చర్చించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో 300 సీట్లు ఉన్నాయి. రాష్ర్టం విడిపోయాక ఏపీ శాసనసభ సమావేశాల నిర్వహణకు మరో హాలును కేటాయించగా, తెలంగాణ శాసనసభ సమావేశాలను పాత హాలులోనే నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణ శాసనసభలో సభ్యుల సంఖ్య 120 మాత్రమే (ఆంగ్లో ఇండియన్ సభ్యునితో కలిపి). దీంతో తెలంగాణ శాసనసభ్యులు మొత్తం హాజరైనా హాలులోని సగం సీట్లు కూడా నిండడం లేదు. స్పీకర్ స్థానం నుంచి చూసినా, గ్యాలరీ నుంచి చూసినా హాలులో సీట్లన్నీ ఖాళీగా, బోసిగా కన్పిస్తున్నాయి. ఈ కారణంగా హాలులో సీట్ల సంఖ్యను సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కుదించాలని స్పీకర్ నిర్ణయించారు. ప్రస్తుతానికి శాసనసభలో 120, మండలిలో 40 స్థానాలుండడం వల్ల ఉభయసభల సమావేశానికి కూడా కుదించిన సీట్లు ఈ నాలుగేళ్లపాటు సరిపోతాయని స్పీకర్ భావిస్తున్నారు. కొత్త సంఖ్యకు అనుగుణంగా డిజైన్లను రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌శర్మను స్పీకర్ ఆదేశించారు. వీలైనంత త్వరగా డిజైన్లు తయారు చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త సీట్ల ఏర్పాటును పూర్తిచేయాలని సూచించారు. సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో సీట్లను ఇంకా సౌకర్యవంతంగా రూపొందించాలని ఆదేశించారు. -
రైలు వ్యాగన్లలో బొగ్గు కల్తీ
* మండలిలో మంత్రి హరీశ్‌రావు * కల్తీని నిరోధించేందుకు విజిలెన్స్ దాడులు నిర్వహిస్తాం * బొగ్గు అక్రమాలను ప్రస్తావించిన పొంగులేటి సాక్షి, హైదరాబాద్: సింగరేణి నుంచి బొగ్గును తరలించే క్రమంలో రైలు వ్యాగన్లలో బొగ్గును కల్తీ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు విజిలెన్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం శాసన మండలిలో లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి హరీశ్ పై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు, బొగ్గు అక్రమాలపై పొంగులేటితో పాటు ఇతర కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సుమారు గంటన్నర పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. నాణ్యత లేని నాసిరకం బొగ్గును రాష్ట్రంలోని విద్యుదుత్పాదన ప్లాంట్లకు అంటగట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టుతున్నారని ఆరోపించారు. దీనిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల హస్తముందన్నారు. నాణ్యత లేని బొగ్గు వల్లే తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విదేశాల నుంచి నాసిరకం బొగ్గుతో వైజాగ్ పోర్టుకు తరలివచ్చిన ఎంవీ-ఫుల్బియా అనే నౌకను నవంబర్ 1న అధికారులు పట్టుకున్న విషయాన్ని పొంగులేటి ప్రస్తావించారు. దీనిపై మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రాష్ట్రానికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయించుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుంచి బొగ్గును రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం లేదని స్పష్టంచేశారు. మూడేళ్లలో మిగులు విద్యుత్: హరీశ్ రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికలను ఆయన సభలో వెల్లడించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన 4 వేల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రంలో ప్రధాని, విద్యుత్ మంత్రి, ఎన్టీపీసీ చైర్మన్లను కలిశారని గుర్తుచేశారు. కేవలం నాలుగు నెలల కాలంలో ఏ ప్రభుత్వం సాధించలేని పురోగతిని ఎన్టీపీసీ ప్రాజెక్టుల విషయంలో సాధించామని వివరించారు. తమ పార్టీ అధినేత్రి సోనియా తెలంగాణకు కేటాయించిన ఎన్టీపీసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చొరవచూపడం లేదని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ అనడంతో మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోరుతూ ఇటీవలే టెండర్లు పిలిచామని, పలు ప్రైవేటు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని మంత్రి చెప్పారు. యూనిట్‌కు రూ.6.45 నుంచి రూ.6.99తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థల బిడ్లను పరిశీలించే యోచనలో ఉన్నామన్నారు. 45 నిమిషాలు కావాలి.. ‘సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉండగా.. వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరా చేసే అవకాశమున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో 400 మంది రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎందుకు కారణమైంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అడిగిన ప్రశ్న సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. గత కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే రైతు ఆత్మహత్యలు జరిగాయని.. రైతులను ఎవరు చంపిండ్రు.. చంపడానికి కారణాలేమిటీ.. ఈ విషయాలపై సమాధానమివ్వడానికి కనీసం 45 నిమిషాల సమయం పడుతుందంటూ మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులకు అన్యాయం: ఎమ్మెల్సీ రాములు నాయక్ సమైక్య రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను అమ్ముకునే స్థితికి గిరిజనుల స్థితిగతులు దిగజారాయన్నారు. సినిమాల్లో అందంగా చూపించడానికి, బిల్ క్లింటన్ లాంటి విదేశీ అతిథుల పర్యటన సందర్భంగా వారి మెప్పు కోసమే గిరిజన ఆడపడుచులతో సంప్రదాయ నృత్యాలు చేయించారని వ్యాఖ్యానించారు. గిరిజన సంస్కృతి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలపాలంటూ బుధవారం ఆయన శాసన మండలిలో ప్రశ్నించారు. ‘ఓ లంబాడోళ్ల పిల్ల.. ఎంత బాగున్నావ్’ అంటూ కించపరిచే రీతిలో గిరిజన యువతులపై సినిమా తీశారని వాపోయారు. అదే గిరిజన యువతులను సినిమాల్లో హీరోయిన్గా అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపించారన్నారు. గిరిజన యువతులకు సినిమాల్లో అవకాశమిస్తే మేకప్ ఆర్టిస్టులతో పని ఉండదని, దీంతో వారంతా ఉపాధిని కోల్పోతారని ఓ సినీ దర్శకుడు తనతో చెప్పాడని రాములు నాయక్ పేర్కొన్నారు. గిరిజన తండాల్లో ప్రతి ఇంట్లో సినీ హీరోలాగా అందమైన ఓ యువకుడు ఉంటాడని పేర్కొన్నారు. సంస్కృతిని పరిరక్షిస్తాం: ఈటెల గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు హైదరాబాద్ నెహ్రూ శతాబ్ది గిరిజన మ్యూజియం, మన్ననూర్(మహబూబ్‌నగర్)లో చెంచులక్ష్మీ మ్యూజియంలను ఏర్పాటు చేశామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. త్వరలో వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క మ్యూజియం, ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం మ్యూజియం, భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. దీపం పథకం కింద సాచురేషన్ విధానంలో ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక తయారు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమరవీరులకు అరకొర నిధులా: అరికెల మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరిగింది. ప్రభుత్వం బడ్జెట్లో అమరవీరుల కుటుంబాలకు అరకొర నిధులు కేటాయించిందని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి ఆక్షేపించారు. అమరుల సంఖ్యను 450కు కుదించడం శోచనీయమన్నారు. రెండు పడక గదుల ఇళ్లు, ఇరిగేషన్ విభాగాలకు అరకొరగా కేటాయించారన్నారు. ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అల్తాఫ్ మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ఆ శాఖను ఏపీ, తెలంగాణ విభాగాలుగా విభజించాలని కోరారు. తెలంగాణ ద్రోహుల పార్టీ: నాయిని అరికెల తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని తనదైన శైలిలో చమక్కులు విసిరారు. తమది నాలుగు నెలల శిశువు లాంటి సర్కారు అని, అప్పుడే డ్యాన్స్ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని, వారికి అమరుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి అసువులు బాసిన అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
నీతులు చెబుతున్న హరీష్‌రావు: సండ్ర
హైదరాబాద్: గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మరిచిపోయి భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రస్తుతం నీతులు చెబుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత అసెంబ్లీ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అందులోభాగంగానే టీడీపీపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో వారి సంఖ్యను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అమరవీరుల త్యాగాలను అవమానిస్తున్నారని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారంతో క్షమాపలు చెప్పించాలని అధికార పార్టీకి సూచించారు. ఆ తర్వాతే ఎలాంటి చర్చకైనా సిద్ధమని సండ్ర స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ఉండాల్సిన ఎంఐఎం అధికార పార్టీకి తొత్తుగా మారి భజన చేస్తుందని విమర్శించారు. తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ శుక్రవారం సభ కార్యక్రమాలకు అడ్డుతగిలింది. ఆ క్రమంలో టీటీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలని సభలో హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టారు. దాంతో స్పీకర్ టీటీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావుపై సండ్ర వెంకట వీరయ్య పైవిధంగా స్పందించారు. -
ద్రోహులమంటూ యాత్ర చేస్తారా?
తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేతలపై టీఆర్ఎస్ మంత్రులు, నేతలు మండిపడ్డారు. మంగళవా రం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల బస్సు యాత్రపై కస్సుబుస్సు అయ్యారు. తెలంగాణ ద్రోహులం, చంద్రబాబుకు తాబేదారులమంటూ బస్సుయాత్ర చేస్తారా అని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘కరెంటు చార్జీలను తగ్గించాలని అడిగితే.. ప్రజల్ని పిట్టలను కాల్చినట్టుగా చంపి, బ్యాంకు లోన్లు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టించిన చంద్రబాబు చరి త్రను యాత్రలో మీరు వివరిస్తారా’ అని నిల దీశారు. తెలంగాణలో కరెంటు కొరతకు చంద్రబాబు, కాంగ్రెస్ కారణమని విమర్శించారు. రేవంత్‌ను బజారుకీడుస్తాం.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టి, బజారుకీడుస్తామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ కొరత, ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల గురించి చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్నారు. ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు వరంగల్: కాంగ్రెస్, టీడీపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. తెలంగాణలో టీడీపీ ఉంటే.. విద్యుత్ ఇవ్వు కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉంటే, తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. యూనిట్‌కు రూ.14 ఖర్చుచేసైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి రానివ్వం వరంగల్: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా కర్రావును టీఆర్ఎస్లోకి రానివ్వబోమని ఆ పార్టీ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. మంగళ వారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీలు ఎటూ పాలుపోక విమర్శలు చేస్తున్నాయన్నారు. -
రైతన్నకు పూర్తి ‘మద్దతు’
సిద్దిపేట జోన్: రైతాంగానికి మద్దతు ధర అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నదని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖరీఫ్ ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ యేడు ఖరీఫ్ సీజన్ ధాన్యం, మక్కల కొనుగోళ్ల కోసం విస్తృతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 67 మొక్కజొన్న, 168 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొక్కజొన్న ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలుకు రూ. 1,310, కామన్ గ్రేడ్ వరికి రూ. 1,360, ఏ గ్రేడ్ వరికి రూ. 1,400 చెల్లించేలా నిర్ణయించామన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 168 కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో 125 ఐకేపీ, 48 పీఏసీఎస్ పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్ధతు ధరను పొందేందుకు కోతల అనంతరం ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మంత్రి సూచించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఈ యేడు 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వాటిలో బక్రిచెప్యాల, చిన్నగుండవెల్లి, చింతమడక, ఇర్కోడ్, నారాయణరావుపేట, పొన్నాల, పుల్లూరు, తోర్నాల, మాచాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి, ఖాతా, నంగునూరు, నర్మెట, పాలమాకుల, గట్లమల్యాల, సిద్ధన్నపేట, అల్లీపూర్, చిన్నకోడూర్, గోనెపల్లి, గుర్రాలగొంది, జక్కాపూర్, ఇబ్రహీంనగర్, మైలారం, రామంచ గ్రామాలున్నట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులను వేగవంతంగా జరిపేందుకు ఆన్లైన్ విధానాన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. రైతులకు 72 గంటల్లోగా ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తామన్నారు. మరోవైపు సంబంధిత రైతుకు బిల్లుకు సంబంధించిన చెల్లింపు ధర, తేదీతో కూడిన వివరాలను ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. ఆ దిశగా తొలి విడతలో ఆరు కేంద్రాలకు రూ. 35 లక్షలు మంజూరు చేశామన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 130 కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ స్థల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో కూరగాయల, మాంస మార్కెట్‌గా రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడం జరిగిందని త్వరలో నిధులు మంజూరు కానున్నయన్నారు. ఈ నిధుల ద్వారా కూరాయల మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ కేంద్రం తో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలో కనీస మౌలిక వసతుల కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశామన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ. 12 కోట్లు మంజూరు అయ్యాయని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభం జరిగేలా చర్యలు చేపడుతారన్నారు. సిద్దిపేటలో సుభోజన పథకం.. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సుభోజన పథకాన్ని త్వరలో సిద్దిపేటలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులోని రైతులకు, మాతా శిశు సంక్షేమ కేంద్రం, సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోని రోగులకు, రోగుల బంధువులకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, యార్డుకొస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మద్దతు ధరల పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ శరత్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, జిల్లా సహకార శాఖ అధికారి సాయికృష్ణుడు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడి, డీఎల్సీఓ ప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ రాములు, ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి ఎన్‌వైగిరి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చందు, టీఆర్ఎస్ నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, శేషుకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
67 ఏళ్లలో చేయలేనిది 67 రోజుల్లోనే చేయాలా?
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు తమపై జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 67 ఏళ్లలో మీరు చేయలేనిది... 67 రోజుల్లోనే మమ్మల్ని చేయమంటారా అని కాంగ్రెస్ నేతలను హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేయమని చంద్రబాబును ప్రశ్నించాలని తెలంగాణ టీడీపీకి సలహాయిచ్చారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలపై బీజేపీ, టీడీపీలకు స్పష్టమైన వైఖరి లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. -
'ప్రతిపక్షంపై ఎదురుదాడి సరికాదు'
హైదరాబాద్: విపక్ష నాయకుడు కె.జానారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి జానారెడ్డి నిర్మాణాత్మక సూచనలు చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేత జానారెడ్డివన్నీ చిల్లర విమర్శలని, కాంగ్రెస్ పార్టీలో ఉనికికోసమే ఆయన సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం విమర్శించారు. ఎవరికి చేతనవుతుందో ప్రజలకు తెలుసని, అందుకే కాంగ్రెస్‌ను గద్దె దింపి టీఆర్ఎస్కు అధికారాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుత సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. -
'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'
హైదరాబాద్: పాలసీలు సచివాలయంలో కాదు, ప్రజల మధ్య రూపొందిస్తామని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. రైతుబంధు పథకం చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు బంధు పథకంలో ఆర్నెల్ల వరకు రైతులకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. రుణం రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలకు పెంచుతామన్నారు. మార్కెట్ యార్డుల్లో 10 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఇ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అమల్లోకి తెస్తామన్నారు. రూ.13 వేల కోట్లతో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేట్లు ప్రయత్నిస్తామని హరీశ్‌రావు చెప్పారు. -
సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే...
హైదరాబాద్: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) గేట్ల ఎత్తు పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్‌రావు కోరారు. -
హరీష్.. పెద్ద సవాల్!
- ప్రతిష్టాత్మకంగా ఆ రెండు పథకాలు.. - ‘గొలుసు కట్టు’తో దశమార్చేందుకు యత్నం - వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ కోసం ఎలా పోరాడారో.. వచ్చిన తెలంగాణను బంగారుమయం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అంతే తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. గొలుసుకట్టు చెరువులు, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పథకాలను విజయవంతంచేయడానికి అహర్నిశలు పాటుపడుతున్నారు. అడ్డంకులు ఎదురవుతాయని తెలిసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతున్నారు. పై పథకాల ఫలాల రుచిని మెతుకుసీమ ప్రజలకు చూపిస్తానని చెప్తున్నారు. ఈ మహా సంకల్ప యజ్ఞంలో ప్రజల సహకారం ఉంటే సాధించి తీరతానని హరీష్ అంటున్నారు. తెలంగాణ సంస్కృతిలో గొలుసుకట్టు చెరువులు ఓ భాగం. కానీ నిజాం రాజుతో పాటే ఈ గొలుసుకట్టు చెరువులు అంతర్థానమైపోయాయి. ఎన్నికల మేనిఫెస్టోలో గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తామని గులాబీ దళపతి కేసీఆర్ హామీ ఇచ్చారు. 67 ఏళ్లుగా కబ్జాకు గురై అవశేషాలు కూడా కోల్పోయిన చెరువులను గుర్తించడం ఎలా? గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా? చెరువు భూముల స్వాధీనం అంటే తేనె తుట్టెను కదిపినంతగా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ సమస్య.. సవాల్‌గా మారింది. నీటిపారుదల శాఖమంత్రిగా హరీష్‌రావు సవాల్‌ను స్వీకరించారు. ఇందుకు నాందిగా మెతుకుసీమలోనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు తొలి అడుగుపడింది. చిన్న నీటిపారుదల శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో 100 ఎకరాలకు పైగా సాగు నీరు అందించే చెరువులు 582 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 1.28 లక్షల ఎకారలకు సాగు నీరు అందించవచ్చు. 100 ఎకరాలకులోపు సాగు నీరు అందించే చెరువులు 6,207 వరకు ఉన్నాయి. ఈ చెరువుల ద్వారా 1.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ, వీటిలో దాదాపు 70 శాతం చెరువులు(ఎఫ్టీఎల్.. ఫుల్ ట్యాంక్ లెవల్) కబ్జాకు గురి అయ్యాయని, పట్టణ ప్రాంతాల్లో నేతలు, రియల్ వ్యాపారులు కబ్జాపెట్టి ప్లాట్లు చేసి అమ్ముకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలుగా మార్చుకున్నారని అధికారులు తేల్చారు. మరి కొన్ని చెరువుల అలుగులు, తూములు కబ్జాకు గురి అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్యలను అధిగమించి గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేయడం సలువుకాదని అధికారులు నిరాసక్తత వ్యక్తం చేశారు. ‘కలిసి ప్రయత్నం చేద్దాం.. ఫలితం ఎందుకు రాదో చూద్దాం... నీళ్లు చేరే పది చెరువులు చూడండి. ప్రయోగాత్మకంగా పనులు మొదలు పెడదాం. నేను మీకు అండగా నిలబడతా’ అని హరీష్ చెప్పడంతో జిల్లా యంత్రాంగం చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమైంది. గొలుసుకట్టు చెరువుల స్వరూపాన్ని వెలికిపట్టుకునే పనిలో పడ్డారు. తేనె తుట్టెను పట్టేస్తారా..! మెతుకుసీమలో వక్ఫ్ బోర్డుకు 36 వేల ఎకరాల భూమి ఉండేది. ఇనాం భూముల ఆదాయంతో ఉర్సు, ఉత్సవాలతో దర్గాలు జోరుమీదుండేవి. ఇప్పుడా జోరు లేదు. దర్గా, మసీదుల ఆస్తులు కబ్జా కోరల్లో పడి కరిగిపోయాయి. రికార్డులు మాయమయ్యాయి. 66 ఏళ్లుగా వక్ఫ్ భూములపై అజమాయిషీ లేదు. ఎక్కడికక్కడా కబ్జా పెట్టారు. ఎవరికి అందినకాడికి వారు దోచుకున్నారు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ వక్ఫ్ భూముల వ్యవహారం తేనెతుట్టెలా మారింది. ఏ పాలకులూ ఈ తుట్టెను తట్టిలేపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడా తుట్టెను తట్టిలేపేందుకు మంత్రి హరీష్‌రావు ముందుకొచ్చారు. మెదక్ జిల్లా నుంచే సర్వే మొదలు పెట్టేందుకు అధికారులు కదిలారు. పాత రికార్డుల బూజు దులిపారు. ఒక్కొక్క పేజీని తిప్పేస్తే తొలి సర్వేలోనే జిల్లాలో 26 వేల ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నట్లు తేలింది. రెండోసారి సర్వే చేస్తే మరో 10 వేల ఎకరాలు తేలుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో సగభాగం జిల్లాలో ఉన్నట్లు తేలింది. అయితే ఈ భూమిలో 80 శాతం కబ్జా పాలైపోయింది. ఈ భూమిని సామాన్యుని నుంచి భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా నేతల వరకు అనుభవిస్తున్నారు. వ్యాపారులు, బడా నేతలు ఆయన మీద రాజకీయ కుట్రకు వ్యూహం పన్నేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదంటున్నారు మంత్రి హరీష్‌రావు. ఆ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్థానిక ప్రాంతంలోని ముస్లింల అభివృద్ధికి, యువతకు ఉపాధి, విద్యపై ప్రాముఖ్యనిస్తూ ఖర్చు చేస్తామని మంత్రి చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణలో ప్రజలు తమను అర్థం చేసుకుంటారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తరతరాలుగా పెరిగిపోతున్న అక్రమాల పుట్టను ప్రజా సంక్షేమం కోసం పెకిలిస్తామని అంటున్న మంత్రి సంకల్పానికి అండగా నిలబడాలని జిల్లాప్రజానీకం కోరుకుంటోంది. -
ల్యాంకో భూములను వెనక్కి తీసుకుంటాం
* కొత్తగా తెలంగాణ వక్ఫ్ యాక్ట్ * నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి * సాగుకు యోగ్యమైన భూములనే దళితులకు పంపిణీ చేస్తాం * ప్రతి మహిళా గ్రూపునకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ల్యాంకో హిల్స్ గ్రూపునకు కేటాయించిన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. అలాగే వక్ఫ్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్నారు. ల్యాంకోకు కేటాయించిన భూములు వక్ఫ్ ఆస్తులేనని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. అవి వక్ఫ్ భూములు కావంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసిందని, ఆ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్టు చెప్పారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వక్ఫ్ భూములపై సమీక్షా సమావేశం జరిగింది. దాదాపు 66 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన వక్ఫ్ భూముల సమీక్షకు మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి సర్వేలోనే దాదాపు 26వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు తేలిందని, కానీ ఇందులో 80 శాతం ఆక్రమణకు గురైందని, మరో 20 శాతం భూమికి సరైన రికార్డులు లేవన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. దీనికోసం చట్టంలో సవరణ చేసి తెలంగాణ వక్ఫ్ యాక్ట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేద ముస్లింల అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. కరెంటు కోతలు వద్దు రంజాన్ మాసంలో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. చినచిన్న మరమ్మతుల కోసం ఒక్కో మసీదుకు రూ. 5వేల చొప్పున నిధులు ఇప్పటికే మంజూరు చేశామని, ఆ నిధులను వెంటనే మసీదు కమిటీలకు అందజేయాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు. కాగా రంజాన్ మాసాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని, ఏదో ఒక రోజు జిల్లా కలెక్టరేట్లలో ప్రభుత్వ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామన్నారు. సాగుకు యోగ్యమైన భూమినే ఇద్దాం నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అది కూడా నూటికి నూరుపాళ్లు సాగుకు యోగ్యమైన భూములనే ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు భూమిని ఎంపిక చేసేటప్పుడే జాగ్రత్తపడాలన్నారు. భూ పంపిణీ కమిటీ.. స్థానిక యువకుల్లో ఒకరిని, మహిళా సంఘాల నుంచి ఒకరిని కమిటీ సభ్యులుగా తీసుకుని వారు సూచించిన భూములకే ప్రాధాన్యత ఇచ్చి, కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. సంక్షేమ పథకాలలో మహిళ సంఘాలకు ప్రాధాన్యం ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు ప్రతి గ్రూపునకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలను ఇస్తామని ప్రకటించారు. గ్రామీణ అభివృద్ధి శాఖలోని ఉపాధి హామీ పధకం నుంచి రూ. 200 కోట్లు, మార్కెటింగ్ శాఖ నుంచి రూ. 100 కోట్లు తీసుకుని ప్రతి ఐకేపీ కేంద్రంలో రూ.30 నుంచి రూ .40 లక్షలలో ధాన్యం గోదాంను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు ఒక సిమెంట్ గచ్చు(కారిడార్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
త్వరలో ఖరీఫ్ రుణాలు
- రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ఎజెండా - నాయకుల్లా కాదు.. సేవకుల్లా పనిచేస్తాం - మంత్రి హరీష్‌రావు వెల్లడి మెదక్: త్వరలో బ్యాంకుల ద్వారా రైతులకు ఖరీఫ్ రుణాలు ఇప్పిస్తామని, ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ప్రకటించారు. గురువారం ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులను ప్రారంభించిన అనంతరం మెదక్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.18వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, దీంతో 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనందున త్వరలో కొత్త రుణాలు ఇప్పిస్తామన్నారు. గతంలో కేవలం రూ.3,318 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారన్నారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా సీఎం చంద్రబాబులాగా ఎలాంటి కమిటీలు వేయకుండానే రుణమాఫీని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల శ్రేయస్సే తమ ఎజెండా అన్నారు. సాగునీటి రంగంలో జిల్లాకు పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో వలసలు, రైతు ఆత్మహత్యలు అధికంగా చోటు చేసుకుంటున్నందునా ప్రాజెక్టులు నిర్మించి ప్రతి నీటిబొట్టును ఒడిసి పడతామని చెప్పారు. జైకా నిధులతో ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. ప్రతి వారం పనుల అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తామన్నారు. గొలుసు చెరువులను పునరుద్ధరించి జలవనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెదక్ మార్కెట్ యార్డ్‌లో సీసీ రోడ్లు, రైతుల విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యాపారులు సహకరిస్తే షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో ఐదు ఐకేపీ సెంటర్లకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మంజీర నది వెంట పాదయాత్ర చేసి జలవనరుల వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులను రూపొందిస్తామన్నారు. పాపన్నపేటలో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్ ప్రాంతంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గుండువాగు ప్రాజెక్టును పూర్తిచేయాలని, హల్దివాగుపై చెక్‌డ్యాం నిర్మించాలని, బొల్లారం మత్తడి నుంచి కోంటూర్ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ మంజీర నీరు జిల్లాకు అందేలా చూడాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలు, బడిబాటను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ మెదక్ మార్కెట్ కమిటీలోని ఉల్లి గోదాములను ఆధునికీకరించాలని, రైతుల విశ్రాంతి భవనాన్ని, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ మధుసూదన్, జపాన్ దేశపు, జైకా ప్రతినిధి కామియ, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌గౌడ్, ఏ.కృష్ణారెడ్డి, రాగి అశోక్, జీవన్‌రావు, మాజీ మంత్రి కుమారుడు కరణం సోమశేఖర్, మాజీ ఎంపీపీ పద్మారావు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గంగాధర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాలాగౌడ్, విద్యావేత్త సుభాష్ చందర్‌గౌడ్, ఎంపీటీసీ గురుమూర్తిగౌడ్, టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు
తెలంగాణ శాసనసభను అర్థవంతంగా నడిపిస్తామని మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బోయనపల్లి కూరగాయల మార్కెట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌గా మారుస్తూ రూపొందించి దస్త్రంపై హరీష్ రావు తొలి సంతకం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
ఆ ఇద్దరివైపే అందరి చూపు
హరీశ్‌రావు, కేటీఆర్ పాత్రపై ఆసక్తి ఎలాంటి పోర్టుఫోలియోలు ఇస్తారనేదానిపై చర్చ మంత్రివర్గంలో ఆ ఇద్దరూ ఉంటారా? ఒకరికి పార్టీ పగ్గాలు, మరొకరికి కేబినెట్ మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు ఇద్దరికీ సమ ప్రాధాన్యం లభిస్తుందంటున్న టీఆర్ఎస్ వర్గాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటు కాబోయే తొలి మంత్రివర్గంలో ఇద్దరు ముఖ్యులు నిర్వహించబోయే పాత్రపై అత్యంత ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాల్లో సైతం ఈ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు.. వారికి అప్పగించే బాధ్యత ఏమిటి? అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి? అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఒకరుకాగా.. ఆయన మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మరొకరు. మంత్రివర్గంలో ఈ ఇద్దరూ ఉంటే పోర్టు ఫోలియోల్లో ఎవరికి ప్రాధాన్యం లభిస్తుంది? ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న శాఖలనే కేసీఆర్ అప్పగిస్తారా? అని అన్ని వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇద్దరూ.. ఇద్దరే.. టీఆర్ఎస్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లా? అంటూ 2009లో అనేక విమర్శలు వచ్చాయి. 2009లో దీక్ష, డిసెంబరు 9 ప్రకటన తర్వాత అలాంటి చర్చే లేకుండా చేయడంలో హరీశ్, కేటీఆర్ ఇద్దరూ సఫలీకృతులయ్యారు. ఉద్యమ కార్యక్రమాలు, పార్టీలో సంక్షోభం, ఇతర ముఖ్యమైన చేరికలు, విమర్శలను తిప్పికొట్టడం వంటి అంశాల్లో ఇద్దరూ సమర్థంగా వ్యవహరించారు. సాగునీరు, విద్యుత్, రెవెన్యూ, ఉద్యోగ, కార్మిక సమస్యలు వంటివాటిపై పోరాటంలో హరీశ్‌రావు ముందున్నారు. పార్టీకి సంక్షోభ సమయంలో ట్రబుల్ షూటర్‌గా హరీశ్ వ్యవహరిస్తున్నారు. ఇక వ్యవసాయం, పారిశ్రామిక, చేనేత, పవర్లూమ్ సమస్యలపై పోరాటంలో కేటీఆర్ క్రియాశీలంగా ఉన్నారు. పార్టీలోకి ముఖ్యమైన నాయకులను తీసుకురావడంతో పాటు కేసీఆర్‌కు అతి ముఖ్యమైన అన్ని పనుల్లో కేటీఆర్ కీలకంగా పనిచేస్తున్నారు. విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ వంటివాటితో జాతీయ వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2009 నవంబరు నుండి 2014లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా జరిగిన అనేక నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరిపైనా పలు కేసులు నమోదయ్యాయి. పార్టీలోని అన్ని స్థాయిల్లో సమస్యల పరిష్కారంతో పాటు వివిధ పార్టీల నేతలతో సంబంధాల విషయంలోనూ వారు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ అవకాశం..? తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో హరీశ్, కేటీఆర్ ఇద్దరికీ స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులు, పార్టీ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం ఇద్దరికీ ప్రాధాన్యమైన శాఖలే దక్కుతాయి. అయితే కేసీఆర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు, మనసులోని మాటను స్పష్టంగా వెల్లడించలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో మాత్రమే కేబినెట్లో ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై స్థూలంగా చర్చించారు. దాని ప్రకారమే మంత్రివర్గంలో ఎవరుంటారనే అంచనాలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కొందరి పేర్లను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాంటివారు తమకు నచ్చిన పోర్టు ఫోలియో కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. కేటీఆర్, హరీశ్‌లకు స్థానంపై ఎక్కడా బయటపడలేదు. తెలంగాణలో గరిష్టంగా 18 మందికి మాత్రమే కేబినెట్లో అవకాశముంది. అయితే ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబసభ్యులనే ముద్ర సమర్థులైనవారికి అవరోధంగా మారాలా? అని పేర్కొంటున్నారు. ఇలాంటి చర్చలు ఎలా ఉన్నా వారిద్దరూ లేకుండా మంత్రివర్గం ఉంటుందా? అన్న అనుమానాలను కేసీఆర్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఒక దశలో కేటీఆర్‌కు పార్టీపగ్గాలు అప్పగించి, పూర్తిగా పార్టీని బలోపేతం చేసే పని అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాల అనంత రం తొలిసారిగా గవ ర్నర్ వద్దకు వెళ్లిన టీఆర్ఎస్ బృందంలో హరీశ్ లేకపోవడం రాజకీయువర్గాల్లో రకరకాల చర్చకు తావిచ్చింది. ఐతే పార్టీవర్గాలు వూత్రం ఇద్దరికీ సవుప్రాధాన్యం దక్కుతుందనీ, మిగతావన్నీ అనవసర ప్రచారాలేనని కొట్టిపారేస్తున్నారు. -
2090లోనూ టీడీపీకి అధికారం రాదు: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2019లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఆశపడుతున్నారని.. 2019లో కాదు 2090లో అయినా టీడీపీకి అధికారం రాదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు, హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అవుతున్నాయని, ఇకపై టీఆర్ఎస్లోకి ప్రతీరోజూ చేరికలుంటాయని చెప్పారు. తెలంగాణకు జాతిపితలాంటి నేత కేసీఆర్ అని, అలాంటి నాయకుడే సీఎం అవుతున్నారని పేర్కొన్నారు. -
తెలంగాణ అమరవీరుల గురించి చంద్రబాబా మాట్లాడేది ?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబు...తెలంగాణ అమర వీరులు గురించి మాట్లాడడం సిగ్గూచేటుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే అధిక సీట్లు గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ హారీష్ రావు ఈ సందర్బంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికలో గెలవలేక బీజేపీతో పొత్తు కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారని చంద్రబాబుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకునేందుకు క్యాడర్ భయపడుతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఆయన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండేవాడు కాదంటూ విమర్శించారు. -
'టీడీపీ-బీజేపీ పొత్తు అపవిత్ర కలయిక'
మెదక్: టీడీపీ, బీజేపీల పొత్తును అపవిత్ర కలయికగా టీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్‌రావు వర్ణించారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవికి సరిపోరన్న చంద్రబాబు బీజేపీతో పొత్తు ఎలా కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణలో విజయం తమదే అని హరీష్‌రావు దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదరనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనీవిధంగా స్పందించారు. పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారన్నారని అంతకుముందు హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. -
తొలి సర్కార్ టీఆర్ఎస్దే: హరీష్‌రావు
మహబూబాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్, పాలకుర్తి, నర్సంపేట, మరిపెడలలో జరిగిన రోడ్ షోలలో మాట్లాడారు. మన రాష్ట్రంలో మన జెండా మాత్రమే ఉండాలని, ఆంధ్రా జెండాలను తెలంగాణలో లేకుండా చేయూలని కోరారు. ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించి రూ.6వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, తెలంగాణకు ప్రత్యేక హోదా కూడా కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లుతారని, టీడీపీకి ఓటేస్తే నేతలు.. చంద్రబాబు నివాసం ఉండే గుంటూరుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ పౌరుషం అసలే లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన టీడీపీ సభలో పార్టీ అధినేత చంద్రబాబు జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేస్తుంటే పక్కనే కూర్చున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏమీ మాట్లాడలేదని, ఆయన తెలంగాణ వ్యతిరేకి కాదా అని ప్రశ్నించారు. -
పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
హైదరాబాద్: రానున్న ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకుడు హరీష్‌రావు అన్నారు. 13 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. తెలంగాణలో తమకు సంపూర్ణ ఆధిక్యం వస్తుందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేమని అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వస్తున్న విమర్శలను హరీష్‌రావు తోసిపుపుచ్చారు. తాము ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉద్యమాల్లో తాను పలుమార్లు అరెస్టయ్యానని వెల్లడించారు. హైదరాబాద్‌లో తాను అరెస్టవని పోలీస్ స్టేషన్ లేదన్నారు. టీడీపీ లబ్ది చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అరోపించారు. టీడీపీ ఏజెంట్‌గా ముందుకు వచ్చారని చెప్పారు. జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని హరీష్‌రావు అన్నారు. చిరంజీవిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదన్నారు. -
అనవసరంగా నోరు జారొద్దు: కేకే
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అనవసరంగా నోరు జారొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావుతో కలిసి తెలంగాణభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 1,200 మంది విద్యార్థులు అమరులైతే ఏనాడూ రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయించలేని అసమర్థ మం త్రులు ఇప్పుడు జై తెలంగాణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌కు నీళ్లు రాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు అడ్డుకుంటే ఆ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగలరా? అని ప్రశ్నించారు. జాతీయ పార్టీల చేతిలో తెలంగాణ ఉంటే నదీజలాలు, ఉద్యోగాలు వంటి చాలా సమస్యలు శాశ్వతంగా ఉంటాయని హెచ్చరించారు. కొందరు బాధపడినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే అంతిమలక్ష్యంగా పోరాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను విమర్శించడానికి ముందుగా హుందాగా మెలగాలని కాంగ్రెస్ నేతలకు కేకే సూచించారు. బాబుది నాలుకేనా?: హరీష్‌రావు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుది నాలుకా, తాటిమట్టా అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని నిన్నటివరకు చెప్పిన చంద్రబాబే ఇప్పుడు టీఆర్ఎస్ విలీనం కాకుండా నమ్మకద్రోహం చేసిందంటూ విచిత్రంగా వాదిస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎస్ ఒంటరిపోరుకు సిద్ధమైందని ప్రకటించగానే కాంగ్రెస్‌కు, టీడీపీకి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వంత రాష్ట్రమని, టీడీపీ వంటి పరాయి రాష్ట్రాల పార్టీల అవసరం ఇక్కడ లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్కు అధిష్టానమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు. సీపీఐతో చర్చలు సీట్ట సర్దుబాటుపై సీపీఐతో చర్చలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ పొత్తుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.కేశవరావు వెల్లడించారు. పొత్తుల వివరాలను ఇప్పుడే మీడియాకు చెప్పలేమన్నారు. -
'కౌరవులపై పాండవులు గెలిచినట్లు..'
అలనాటి మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్లు నేడు తెలంగాణ ప్రజలు గెలిచారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు అభివర్ణించారు. మంగళవారం ఆయన మెదక్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని పునరుద్ఘాటించారు. అయితే దోపిడి పెత్తనాన్ని మాత్రం ఒప్పకోమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ భాగం కావాలని తమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. -
'ఉద్యమ నేతకు కనీవినీ ఎరగని రీతిలో స్వాగతం'
హైదరాబాద్: ఈ నెల 26న హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు చెప్పారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గన్‌పార్క్ వరకూ పాదయాత్ర ద్వారా ర్యాలీగా వెళ్తామని తెలిపారు. తెలంగాణలో విజయోత్సవాలు జరుపుకునే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. 26న కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మాట నిలబెట్టుకుని తిరగి వస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు కనీవినీ ఎరగని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. -
కిరణ్‌ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
-
కిరణ్‌ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు విమర్శించారు. పదవుల్లో కొనసాగే నైతిక అర్హత వారికిలేదని ఆయన అన్నారు. సీఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు అసెంబ్లీలో తీవ్రమైన నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా గుర్తించడం లేదన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంటే చంద్రబాబు అన్యాయమనడాన్ని హరీష్‌రావు తప్పుబట్టారు. విపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. -
టీడీపీకి ఎలా ఓటేశారు?: హరీష్‌రావు
జేపీ ఓటుపై చంద్రబాబును ప్రశ్నించిన హరీష్‌రావు మీ మధ్య ఉన్నది సామాజిక బంధమా? ఎన్టీఆర్‌ను దించిందీ, చెప్పులు వేయించిందీ నువ్వే కదా అపార అనుభవం ఉందంటావు.. అయినా జగన్‌ను అనుసరిస్తావు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని అంటున్న చంద్రబాబు.. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఏ ప్రాతిపదికన టీడీపీకి ఓటేశారో చెప్పాలని టీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉప నేత టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యేలు ఏనుగురు రవీందర్‌రెడ్డి, జోగురామన్న, హనుమంతు షిండేలతో కలసి హరీష్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభ్యర్థి కేశవరావు విజయానికి సహకరించుకోవడంలో ఒక పవిత్ర బంధం ఉంది. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇవ్వడం మీ విధానం. రాజకీయాల్లో సంస్కరణల కోసం పనిచేస్తానంటున్న లోక్‌సత్తా పార్టీ నేత ఏ ప్రాతిపదికన మీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ మధ్య ఉన్నది సామాజిక బంధమేనా’’ అని ప్రశ్నించారు. కేకే విజయాన్ని జీర్ణించుకోలేకే బాబు టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర రాజకీయాల్లో ఆయనంత అనుభవం మరెవ్వరికీ లేదని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్రెడ్డిని అనుసరిస్తున్నారు. కౌంటర్ రాజకీయాలు తప్ప ఏమి చేస్తున్నారు? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జగన్ జాతీయ నేతలను కలిస్తే ఈయనా జాతీయ నేతల్ని కలుస్తారు. జగన్ దీక్ష చేస్తే, ఈయన తరువాత ఢిల్లీలో దీక్ష చేస్తారు. ఆయన తండ్రిలా న్యాయం చేయాలంటే, ఈయన ఇద్దరు కొడుకులకూ సమన్యాయం అంటారు’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ వద్దకు చంద్రబాబు వెళ్లి వచ్చిన తరువాత టీటీడీపీ నేతలు వెళ్లి వినతిపత్రాలు అందజేయబోతే పార్టీ రెండు రకాల వైఖరిపై ఆమె కడిగి పారేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఆమోదంపై తమకు ఎలాంటి అనుమానాలూ లేవని హరీష్ అన్నారు. -
'సీఎం డ్యాన్స్ చేసినా అభ్యంతరం లేదు'
సిద్దిపేట: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు వాసిగా, సీమాంధ్ర బిడ్డగా దీక్షలు చేసినా, డ్యాన్స్‌లు చేసినా తమకు అభ్యంతరం లేదని, హైదరాబాద్ బిడ్డనని రాజధానికున్న బ్రాండ్ ఇమేజ్ను తన పిచ్చి చేష్టలతో డ్యామేజ్ చేయడం తగదని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ సీఎం పదవి హుందాతనాన్ని మంటగలుపుతూ, విలువలను నాశనం చేస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. బుధవారం తెలంగాణ మంత్రులను, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ వెళ్లడమే కాకుండా వారిపై లాఠీచార్జి చేయించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆహంకారానికి ఇది నిదర్శనమన్నారు. సొంత పార్టీ మంత్రుల పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి కలిసుండాలని కోరే హక్కు లేదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం తెలంగాణలోని పది జిల్లాల్లో టీఆర్ఎస్ పక్షాన నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు తెలంగాణ అంతటా కొనసాగుతాయన్నారు. మంత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సీఎం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ను మంచివాడు కాదని పక్షపాతి అని విమర్శించిన చంద్రబాబు నేడు కిరణ్‌ను నమ్ముతున్నాననడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు అనాధలుగా మిగిలి పోయారన్నారు. తెలంగాణకు తొలి ఒటుగా చెబుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావుది సీమాంధ్ర డీఎన్ఎగా అభివర్ణించారు. -
తెలంగాణకు 5 లక్షల కోట్లు ఇవ్వాలి: హరీష్‌రావు
స్పీకర్‌కు 65 పేజీల లిఖితపూర్వక అభిప్రాయమిచ్చిన హరీష్‌రావు సాక్షి, హైదరాబాద్: విభజన తరువాత తెలంగాణ పునర్మిర్మాణానికి కేంద్రం రూ. 5 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు బిల్లుపై తన అభిప్రాయం చెబుతూ 65 పేజీల లేఖను స్పీకర్‌కు అందజేశారు. తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపి, బిల్లును వెంటనే పార్లమెం ట్‌కు పంపాలని కోరారు. తెలంగాణ అమరవీరులు మరణ వాంగ్మూలాల్లో రాసిన అభిప్రాయాలను లేఖలో పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్, ప్రస్తుత సీఎం కిరణ్, బాబు, వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, చిరంజీవి వివిధ సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మాటలతో కూడిన సీడీల ను సమర్పించారు. సింగరేణి బొగ్గు ఎంత సీమాం ధ్రకు సరఫరా అయిందో తెలిపే డాక్యుమెంట్లు, సచి వాలయం, హైకోర్టులో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కు సంబంధించిన పత్రాలను జతపరిచారు. స్వాతంత్య్రం తర్వాత 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, ఏ రాష్ట్రానికీ లేని విధంగా తెలంగాణకు షరతులు, ఆంక్షలు, అధికారాల్లో కోతలు విధించడం సరికాదన్నారు. -
ఉద్యమించని వారు పునర్నిర్మిస్తారా?
తెలంగాణలో ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలు ఆలోచించాలి : హరీష్ సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న ఈ ప్రాంతప్రజలు రేపు తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలో కూడా ఆలోచించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కోరారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం 17వ రాష్ట్ర మహాసభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మొన్నటి వరకు ఏనాడూ పాల్గొనని వాళ్లు.. సకల జనుల సమ్మె, ధర్నాలు, ఇతర ఏ రకమైన ఆందోళన చేసినా బయటకు రాని వారు ఇప్పుడు ఇస్త్రీ చొక్కాలు తొడుక్కొని తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చిందీ మేమేనంటూ వస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. మరికొందరు తమవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పకుంటున్నారంటూ పరోక్షంగా టీడీపీ నేతలనూ తూర్పారపట్టారు. ఇన్నాళ్లు మనగోడు పట్టించుకోని వారు తెలంగాణలో అధికారంలో ఉంటే మన సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన వారు, ఉద్యమంలో ఉన్నవారే ఇక్కడి సమస్యలు అర్థం చేసుకోగలుగుతారని హరీష్‌రావు చెప్పారు. 13ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి ఉద్యమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వల్లే తెలంగాణలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తాను ఏ హోదాలో ఉన్నా ఉద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానన్నారు. 108, 104 ఉద్యోగులను కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగానే గురిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులందరికీ కనీసం వేతనం అమలు చేస్తామన్నారు. వచ్చే తెలంగాణలో టీఆర్ఎస్దే కీలక పాత్ర తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని కులవృత్తులకు సరైన గుర్తింపు ఇస్తామని హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని కొత్తపేట బీజేఆర్ భవన్లో తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామనిన్నారు. పక్కా గృహాలు, రిటైర్డ్ నాయీబ్రాహ్మణులకు పీఎఫ్, ఈఎఫ్ఐ పింఛన్ ఇప్పిస్తామన్నారు. ఆ నిధుల వెనుక సీఎం దురుద్దేశం.. హైకోర్టులో పిల్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరు తాగునీటి పథకానికి రూ. 4,300 కోట్లు కేటాయించారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. చిత్తూరు తాగునీటి పథకానికి నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన విభాగం (ఏపీఐఐసీ) గత అక్టోబర్ 10న జారీచేసిన 14,15 జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆ పిల్లో అభ్యర్థించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, గ్రామీణ నీటిపారుదల శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
కొబ్బరిచిప్పల న్యాయమేంది బాబూ?: టి.హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రెండు కళ్లు, ఇద్దరు కొడుకుల సిద్ధాంతాలు పోయి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చెబుతున్న కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి తెలంగాణభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కొబ్బరికాయ సిద్ధాంతం అర్థంగాక వారి పార్టీ నేతలే జుట్టు పీక్కుంటున్నారని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని, ఆయనకు వెంటనే వైద్యపరీక్షలు చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన జీవోఎంను గుర్తించం అని ఒకసారి, అఖిలపక్షం వేయాలని మరోసారి కోరిన చంద్రబాబు.. అసలు అఖిలపక్ష సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
అడ్డుకుంటే ఖబడ్దార్
సిద్దిపేట, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలను సాగనివ్వ మని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అడ్డు పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ సంఘటిత శక్తిని లోకానికి వురోసారి చాటిచెబుతావున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగే సకల జనుల భేరికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల వుంది తరలివెళ్తారన్నారు. సుమారు వంద బస్సులు, వంద సుమోల్లో ఉపాధ్యాయు, ఉద్యోగ, కార్మిక, కర్షకులు భారీగా తరలుతారని చెప్పారు. ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమయ్యారని తెలిపారు. సేవ్ ఏపీ సభ కు సీవూంధ్ర నేతలు జనాన్ని తరలించారని, కానీ... తెలంగాణవాదులు స్వచ్ఛందంగా కదిలొస్తారని హరీష్‌రావు అన్నారు. జిల్లాలో స్తంభించిన ప్రభుత్వ పాలన అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో సర్కారీ సేవలు పూర్తిగా స్తంభించిపోయూయని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సవుగ్రంగా చర్చించేందుకు జిల్లా సమీక్ష వుండ లి(డీఆర్సీ) సవూవేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి డీఆర్సీని ఆరు నెలలకోసారి నిర్వహించాల్సి ఉన్నా నిర్ణీత వ్యవధిలో జరగ డం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో జిల్లా యుంత్రాంగం జాప్యం చేస్తోందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి పంటల దిగుబడులు బాగానే ఉన్నాయని, ఇప్పటికే మొక్కజొన్న వూర్కెట్లోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస వుద్దతు ధర కల్పిం చేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. వడగళ్ల బాధితులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదని ఆయన సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రారుుతీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందన్నారు. విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిలిచిపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను చర్చించేందుకు వెంటనే డీఆర్సీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వుున్సిపల్ వూజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వూజీ కౌన్సిలర్ వుచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయుకులు రావుచంద్రం, రాధాకృష్ణశర్మ ఉన్నారు. -
సీఎంను బర్తరఫ్ చేయాలి: టి. హరీష్‌రావు
వరంగల్, న్యూస్‌లైన్: అధికార కార్యాలయంలో కూర్చొని తెలంగాణపై విషం కక్కుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హతలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పేర్కొన్నారు. రాగద్వేషాలకతీతంగా పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని, 24గంటల్లో ఆయన క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మట్టిమారినంత మాత్రాన చెట్టుమారదని కిరణ్ నిరూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించిన ఆయన 13 జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌ను, సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనను తొలగించకుండా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని కోరారు. సీమాంధ్రలో సమ్మెను కిరణ్ నడిపిస్తున్నారని, ఉద్యమానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీటి పంపిణీ గురించి చెబుతున్న ముఖ్యమంత్రి మాటల్లోనే ఇంతకాలం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా రాకుండా చేశారని తేలుతోందన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను సక్రమంగా పంపిణీ చేసుకోవాలంటే సమైక్య రాష్ట్రంగా ఉండాలంటున్నారని, అలాగైతే కర్నాటక, మహారాష్ట్రను కూడా కలపాలంటారా? అని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించలేదని, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1903లో నిజాం ప్రభుత్వం దీనిపై సర్వే చేయించిందని, 1953లో డిజైన్ రూపొందించారని, 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిన విషయం సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. మూడు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకావడానికి మీ పాలన కారణం కాదా? అంటూ హరీష్ నిలదీశారు. సీమాంధ్ర ప్రయోజనాలు ముఖ్యమంటున్న కిరణ్‌కు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదా? ఇక్కడి వారు రాష్ట్ర ప్రజలు కాదా? అంటూ ప్రశ్నించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పోలవరం, పులిచింతల ప్రాజెక్టు ఏదైనా ముంపు మాది.. పారకం మీది అనే తీరుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి తీరు చూసిన తర్వాతనైనా తెలంగాణ మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు మా బతుకుతో పాటు మీ బతుకు కోరుతామని, కానీ మీరు మాత్రం దీనికి భిన్నంగా సీమాంధ్ర పచ్చగుండాలే..తెలంగాణ ఎండిపోవాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ఉద్యమానికి ప్రజల మద్దతు లేనందున ఉద్యోగులతో సమ్మె చేయిస్తున్న కిరణ్‌కుమార్ ప్రైవేటు సంస్థలను ఎందుకు బంద్ చేయించడం లేదన్నారు. లగడపాటి ల్యాంకో, చంద్రబాబు హెరిటేజ్, దివాకర్‌రెడ్డి బస్సులు నడుస్తూనే ఉన్నాయన్నారు. పెట్టుబడిదారుల ఏజెంట్ అశోక్‌బాబు ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు పెట్టుబడిదారులకు ఏజెంట్‌గా మారారని, ఆయన కాల్‌లిస్ట్ తీస్తే ఇవన్నీ వెలుగు చూస్తాయన్నారు. సీఎంగా ఉండగా 52 చోట్ల ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలయ్యారని హరీష్‌రావు గుర్తుచేశారు. ‘‘నీ పాలన, నీ ముఖం బాగాలేకనే ప్రజలు తిరస్కరించారని’’ కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమం సన్నగిల్లుతున్న సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని కిరణ్ పరోక్షంగా అంగీకరిస్తున్నారన్నారు. బిల్లు పార్లమెంట్, అసెంబ్లీలోకి వస్తే వ్యతిరేకించాలని చెప్పడంలోనే బిల్లు వస్తుందనే అంశం దాగి ఉందన్నారు. తన పనైపోయిందని గ్రహించిన ఆయన ఈ విమర్శలు చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. చివరి బంతి పార్లమెంట్లో బిల్లుపెట్టడమేనన్నారు. సీఎం పెవిలియన్‌కు చేరుకోవడం ఖాయమన్నారు. కిరణ్‌ను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టబోరని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, వినయ్ భాస్కర్, భిక్షపతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీందర్రావు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే మా ఆప్షన్
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తోసహా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ఆప్షన్ అ ని, మరో ఆప్షన్‌ను ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితి లోనూ అంగీకరించరని టీఆర్ఎస్ఎల్పీ శాసన సభా ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌ను లూటీ చేసేందుకు యూటీగా, కేం ద్రపాలిత ప్రాంతంగా, ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే అం గీకరించేది లేదని, హెచ్చరించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో 29న హైదరాబాద్‌లో నిర్వహించే సకలజన భేరి వాల్ పోస్టర్లను టీజేఏసీ, టీఎన్జీఓ నేతలతో కల్సి సోమవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కిరణ్ డీజీపీ దినేశ్‌రెడ్డితో కలిసి సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి జోక్యం చేసుకొని వారిద్దరిని పదవులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో గంటపాటు కొనసాగుతున్న ఆందోళనలను సీమాంధ్ర మీడియా 24గంటల పాటు చూపిస్తోందని ఆరోపించారు. పార్ట్‌టైం ఉద్యమాన్ని పట్టించుకోవద్దన్నారు. ఎస్మా ప్రయోగం ఉత్తుత్తదేన ని ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్‌బాబు మట్లాడడం చూస్తుంటే వారి వెనక సీఎం, మంత్రి రాంనారాయణరెడ్డిల కుట్ర ఉందనిపిస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇక ఆలస్యం చేయవద్దని వెంటనే రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశా రు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ఇరు ప్రాంతాల ప్రజల్ని మోసం చేస్తూన్నారని విమర్శించారు. తిరుపతి హుండీలోని వాటా, గుంటూరులోని గుంట జాగా తమకు అక్కర లేదని, సీమాంధ్రులకు హైదరాబాద్‌లో అంగులం స్థలం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ తూర్పు జిల్లాల చైర్మన్ డాక్టర్ పాపయ్య, టీఎన్జీఓ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి, ఏపీటీఎఫ్, టీడీటీఎఫ్, టీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, చంద్రబాణు, వెంకటేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, అశ్వాక్, గౌస్‌బాబా, కమలాకర్‌రావు, బూర మల్లేశం, వెంకటేశం, అహ్మద్, అశోక్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
అంగుళం వెనక్కితగ్గినా ఊరుకోం: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్/అచ్చంపేట : హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ ప్రాంతప్రజలు తిరగబడుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ కోసం 13ఏళ్లు పోరాటం చేశామని, హైదరాబాద్ విషయంలో ఒక అంగుళం వెనక్కితగ్గినా ఊరుకునేది లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో విలేకరులతో, మహ బూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులు తెలంగాణను దొరికినకాడికి దోచుకున్నారని, ఇంకా దోచుకునేందుకు సమైక్యపాట పాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమంతో రాష్ట్రమంతా స్తంభించి పోయినట్టుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణను అడ్డుకోవడమనే ఏకైక అజెండాతో రెండు ప్రాంతాల వారికీ తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇస్తామంటూ రచ్చబండ నిర్వహించిన సీఎం, సీమాంధ్రలో ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదన్న ఆయన.. ఇప్పుడెందుకు ఆపుతున్నారో చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంతో అక్కడి కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆగినాయా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, పర్సంటేజీలు, చిరంజీవి సినిమాలు, లగడపాటి పైప్లైన్లు ఆపకుండా పేదలను మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించిన కిరణ్, ఇప్పుడు ఏపీసెట్‌ను ఎవరికోసం ఆపారని ప్రశ్నించారు. శాశ్వతంగా ఉండే రేషన్ కార్డులపై సీఎం కిరణ్ లాంటి ద్రోహుల బొమ్మలను ముద్రించొద్దన్నారు. తెలంగాణలో నాలుగేళ్ల కింద జరిగిన వడగళ్ల నష్ట పరిహారం కోసం ఇంకా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపకపోవడం దారుణమన్నారు. పదమూడేళ్లు ఉద్యమం చేస్తే మాట్లాడకుండా ముఖం చాటేసిన చంద్రబాబు 30రోజుల ఉద్యమం చేసిన సీమాంధ్రకు వెళ్లి బస్సుయాత్ర చేయడం, సమ న్యాయమంటూ ప్రధానమంత్రికి ఉత్తరం రాయడంతోనే అసలు నైజం బయటపడిందన్నారు. టీ-కాంగ్రెస్ పనైపోయింది : జూపల్లి మొన్నటిదాకా సమైక్యరాగం ఆలపించిన ఎంపీ రేణుకా చౌదరిని కలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంకేం కొట్లాడతారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీలో బాబు అజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ ఆపాలని పోతున్నట్టా? హైదరాబాద్‌ను యూటీ చేయాలని అడిగేందుకు పోతున్నట్టా? వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మానవీయతలేని ఉద్యమమది : హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో మానవీయతలేదని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్‌రావు ఆరోపించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సీమాంధ్రలో ఆర్టీసీ బస్సుల్ని ఆపేయించారు. సంస్థకు రూ.600 కోట్లు నష్టాన్ని కలిగించారు. జేసీ, కేశినేని, ఎస్వీఆర్, కాళేశ్వర్ వంటి ట్రావెల్స్ బస్సులు మాత్రం నడిపిస్తున్నారు. సర్కారు దవాఖానాలను మూసేయించారు. కార్పొరేట్ వైద్యశాలలకు గిరాకీ పెంచారు. పేద విద్యార్థులు చదువుకునే సర్కారు బడులను బందు చేయించారు. కానీ...నారాయణ, చైతన్యలాంటి ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడలేదు. లగడపాటి ల్యాంకో, చంద్రబాబు హెరిటేజ్‌లు మూసివేయలేదు. రేషన్ షాపులను మాత్రం తెరవనివ్వడంలేదు.. ఆఖరికు సంక్షేమ హాస్టళ్లను కూడా బంద్ చేయించి గరీబు పిల్లల కడుపు కొడతారట.. వారి కృత్రిమ ఉద్యమంలో మానవీయ విలువలు నశించాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..?’ అంటూ మండిపడ్డారు. సమ్మె పేరిట ఆ ప్రాంత నేతలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్, మంత్రి శైలజానాథ్ అక్కడి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తమకు రక్షణగా ఉన్న గన్మెన్లను కేవలం తెలంగాణ వారనే ఉద్దేశంతో వెనక్కి పంపించారని వెల్లడించారు. తద్వారా ఈ ప్రాంత పోలీసులను అవమానించారన్నారు. -
సకల జనుల సమ్మె కాలంలో ఎక్కడ పడుకున్నావు బాబూ?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగితే రోడ్ల మీదకు రాకుండా ఎక్కడ పడుకున్నారో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్ల మీదకు వస్తుంటే నేను ఇంట్లో కూచుంటానా అని అంటున్న చంద్రబాబు సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం వెయ్యిమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్నీ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు కష్టాలే కావా? తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజలు భాగం కాదా? అని నిలదీశారు. 2009 డిసెంబర్ 7న అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై తీర్మానం ప్రభుత్వం పెట్టకుంటే తాను పెడతానని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు, నీచ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే అని విమర్శించారు. ఎక్కువసార్లు మాటమార్చిన చరిత్ర కూడా ఆయనదేనని దుయ్యబట్టారు. అపోహలు, అనుమానాలతో ఆందోళనలు చేస్తుంటే ఇరు ప్రాంతాల వారినీ కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా మరింత గందరగోళం, అయోమయం సృష్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తే రాజనీతిజ్ఞుడు ఎలా అవుతారని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణను అడ్డుకున్నట్టుగా చెప్పిన చంద్రబాబు మరోసారి అడ్డుకుంటా అని చెబుతున్నట్టుగానే ఉందన్నారు. సమైక్యాంధ్ర ధర్మపోరాటమని అంటే మరి తెలంగాణ ప్రజలది అన్యాయమైన, అధర్మమైన పోరాటమని చంద్రబాబు చెప్పదలచుకున్నారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. వన్నారు. తెలంగాణ విభజన తర్వాత తలెత్తే సమస్యలేమిటో నిర్దిష్టంగా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని హరీష్‌రావు సూచించారు. -
హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు?: హరీష్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘హైదరాబాద్‌పై మాట్లాడటానికి మీరెవరు..? ఏ హోదాలో ఉదారతను ప్రకటిస్తున్నారు.. ఎవరిని అడిగి ప్రతిపాదిస్తున్నారు?’అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకు లు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సీమాంధ్ర అధికారిక కార్యకలాపాలకు మాత్రమే భాగ్యనగరాన్ని రాజధానిగా పరిమితం చేయాలని డిమాం డ్ చేశారు. రాబడి, శాంతిభద్రతలవంటివన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండాల్సిందేనని చెప్పారు. హెచ్ఎండీఏను కేంద్రం పరిధిలోకి తేవడమంటే తెలంగాణలోని సగం జిల్లాలను విడదీసినట్లేనని, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలను వెంటనే మానుకోవాలన్నారు. వారిని సస్పెండ్ చేసే దమ్ముందా?: చంద్రబాబుకు కేటీఆర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: తమది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఎందుకు చేయడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ప్రశ్నించారు. టీడీపీ విధానం తెలంగాణకు అనుకూలమని చెబుతున్న చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విభజనకు అంగీకరించిన చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఏమిటన్నారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని అర్భకుడు సీఎం కిరణ్ అని. ఆయనకు దమ్ముంటే కేసీఆర్ విసిరిన సవాల్‌కు స్పందించాలని కోరారు. తెలంగాణవాదులపై సంస్కారహీనంగా వ్యవహరిస్తున్న వారితో ఎలా కలిసుండాలని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్ష గురించి విలేకరులు ప్రస్తావించగా... వేరే రాష్ర్టంలో జరుగుతున్న దీక్ష గురించి తామెందుకు మాట్లాడాలని చెప్పారు. హరికృష్ణా.. ఎన్టీఆర్ ఇప్పుడే గుర్తుకొచ్చారా?: కడియం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావును సీఎం పదవి నుంచి దించేటప్పుడు అందులో భాగస్వామి అయిన హరికృష్ణకు ఇన్నాళ్లకు తండ్రి గుర్తుకొచ్చినట్టున్నారని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడూ చేసేప్పుడు తమతోనే ఉన్న హరికృష్ణ ఆనాడు నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన టీఆర్ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, రమణాచారిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బావమరిది ఎన్టీఆర్ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటికీ టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం తమ పార్టీది తెలంగాణ అనుకూల వైఖరి అని చెప్పడం వింతగా ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడంపై శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఈ స్థితిలోనే ఒత్తిడి చేయలేని కాంగ్రెస్ నేతలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా గౌరవిస్తారని సందేహం వ్యక్తం చేశారు. ఈనెలాఖరులో కరీంనగర్ నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుందని చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతం అనేది హైదరాబాద్‌కు నప్పదని తెలిపారు. దిగ్విజయ్‌సింగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు.