'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన' | government policies made among people, says T. Harish Rao | Sakshi
Sakshi News home page

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

Published Wed, Jul 9 2014 2:06 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

హైదరాబాద్: పాలసీలు సచివాలయంలో కాదు, ప్రజల మధ్య రూపొందిస్తామని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. రైతుబంధు పథకం చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు బంధు పథకంలో ఆర్నెల్ల వరకు రైతులకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. రుణం రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలకు పెంచుతామన్నారు.

మార్కెట్‌ యార్డుల్లో 10 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఇ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అమల్లోకి తెస్తామన్నారు. రూ.13 వేల కోట్లతో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేట్లు ప్రయత్నిస్తామని హరీశ్‌రావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement