'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'
హైదరాబాద్: పాలసీలు సచివాలయంలో కాదు, ప్రజల మధ్య రూపొందిస్తామని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. రైతుబంధు పథకం చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు బంధు పథకంలో ఆర్నెల్ల వరకు రైతులకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. రుణం రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలకు పెంచుతామన్నారు.
మార్కెట్ యార్డుల్లో 10 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఇ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అమల్లోకి తెస్తామన్నారు. రూ.13 వేల కోట్లతో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేట్లు ప్రయత్నిస్తామని హరీశ్‌రావు చెప్పారు.