సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తోసహా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ఆప్షన్ అ ని, మరో ఆప్షన్‌ను ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితి లోనూ అంగీకరించరని టీఆర్‌ఎస్‌ఎల్పీ శాసన సభా ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌ను లూటీ చేసేందుకు యూటీగా, కేం ద్రపాలిత ప్రాంతంగా, ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే అం గీకరించేది లేదని, హెచ్చరించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో 29న హైదరాబాద్‌లో నిర్వహించే సకలజన భేరి వాల్ పోస్టర్లను టీజేఏసీ, టీఎన్‌జీఓ నేతలతో కల్సి సోమవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కిరణ్ డీజీపీ దినేశ్‌రెడ్డితో కలిసి సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి జోక్యం చేసుకొని వారిద్దరిని పదవులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో గంటపాటు కొనసాగుతున్న ఆందోళనలను సీమాంధ్ర మీడియా 24గంటల పాటు చూపిస్తోందని ఆరోపించారు.
పార్ట్‌టైం ఉద్యమాన్ని పట్టించుకోవద్దన్నారు. ఎస్మా ప్రయోగం ఉత్తుత్తదేన ని ఏపీఎన్‌జీఓ అధ్యక్షులు అశోక్‌బాబు మట్లాడడం చూస్తుంటే వారి వెనక సీఎం, మంత్రి రాంనారాయణరెడ్డిల కుట్ర ఉందనిపిస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇక ఆలస్యం చేయవద్దని వెంటనే రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశా రు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ఇరు ప్రాంతాల ప్రజల్ని మోసం చేస్తూన్నారని విమర్శించారు. తిరుపతి హుండీలోని వాటా, గుంటూరులోని గుంట జాగా తమకు అక్కర లేదని, సీమాంధ్రులకు హైదరాబాద్‌లో అంగులం స్థలం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ తూర్పు జిల్లాల చైర్మన్ డాక్టర్ పాపయ్య, టీఎన్‌జీఓ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి, ఏపీటీఎఫ్, టీడీటీఎఫ్, టీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, చంద్రబాణు, వెంకటేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, అశ్వాక్, గౌస్‌బాబా, కమలాకర్‌రావు, బూర మల్లేశం, వెంకటేశం, అహ్మద్, అశోక్, మురళి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే మా ఆప్షన్
Published Tue, Sep 24 2013 1:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement