
'టీడీపీ-బీజేపీ పొత్తు అపవిత్ర కలయిక'
మెదక్: టీడీపీ, బీజేపీల పొత్తును అపవిత్ర కలయికగా టీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్‌రావు వర్ణించారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవికి సరిపోరన్న చంద్రబాబు బీజేపీతో పొత్తు ఎలా కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణలో విజయం తమదే అని హరీష్‌రావు దీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదరనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనీవిధంగా స్పందించారు. పొత్తుల కోసం చంద్రబాబు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారన్నారని అంతకుముందు హరీష్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.