
టీడీపీ, బిజెపిలది చారిత్రిక ద్రోహం: రాఘవులు
టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరం కాదు, చారిత్రక ద్రోహమని అన్నారు సీపీఎం రాష్ట్ర నాయకులు రాఘవులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కడపలో పర్యటించారు. తెలుగుదేశం అని పేరు పెట్టుకొని తెలుగుజాతినే టీడీపీ అవమానించిందని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఓట్ల కోసం వస్తున్న ఈ ఇద్దరు నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానన్న బాబు.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో ఎలా చేతులు కలిపారని ప్రశ్నించారు. ఈ జోడీ మాటలు ఎవరూ నమ్మొద్దని రాఘవులు ప్రజలకు చెప్పారు.