
టీడీపీ కరపత్రాల్లో గవర్నర్ ఫొటో!!
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తెలుగుదేశం పార్టీ - భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించింది. అదికూడా అలా, ఇలా కాదు.. ఏకంగా తమ ఎన్నికల ప్రచార కరపత్రాలలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫొటోను ముద్రించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఆయన ఫొటోను కరపత్రాలపై ముద్రించినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వ్యవహారంపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. తక్షణమే టీడీపీ, బీజేపీలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది.