సిద్దిపేట, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలను సాగనివ్వ మని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అడ్డు పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ సంఘటిత శక్తిని లోకానికి వురోసారి చాటిచెబుతావున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగే సకల జనుల భేరికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి కనీసం ఐదు వేల వుంది తరలివెళ్తారన్నారు. సుమారు వంద బస్సులు, వంద సుమోల్లో ఉపాధ్యాయు, ఉద్యోగ, కార్మిక, కర్షకులు భారీగా తరలుతారని చెప్పారు. ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమయ్యారని తెలిపారు. సేవ్ ఏపీ సభ కు సీవూంధ్ర నేతలు జనాన్ని తరలించారని, కానీ... తెలంగాణవాదులు స్వచ్ఛందంగా కదిలొస్తారని హరీష్‌రావు అన్నారు.
జిల్లాలో స్తంభించిన ప్రభుత్వ పాలన
అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో సర్కారీ సేవలు పూర్తిగా స్తంభించిపోయూయని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సవుగ్రంగా చర్చించేందుకు జిల్లా సమీక్ష వుండ లి(డీఆర్సీ) సవూవేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి డీఆర్సీని ఆరు నెలలకోసారి నిర్వహించాల్సి ఉన్నా నిర్ణీత వ్యవధిలో జరగ డం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో జిల్లా యుంత్రాంగం జాప్యం చేస్తోందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈసారి పంటల దిగుబడులు బాగానే ఉన్నాయని, ఇప్పటికే మొక్కజొన్న వూర్కెట్‌లోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస వుద్దతు ధర కల్పిం చేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. వడగళ్ల బాధితులకు ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని ఆయన సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రారుుతీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందన్నారు. విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిలిచిపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను చర్చించేందుకు వెంటనే డీఆర్సీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వుున్సిపల్ వూజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వూజీ కౌన్సిలర్ వుచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయుకులు రావుచంద్రం, రాధాకృష్ణశర్మ ఉన్నారు.
అడ్డుకుంటే ఖబడ్దార్
Published Sun, Sep 29 2013 2:01 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement