సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్‌ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్‌కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్‌కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
Published Sun, Mar 8 2020 2:50 PM | Last Updated on Sun, Mar 8 2020 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment