తెలంగాణకు 5 లక్షల కోట్లు ఇవ్వాలి: హరీష్‌రావు
స్పీకర్‌కు 65 పేజీల లిఖితపూర్వక అభిప్రాయమిచ్చిన హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: విభజన తరువాత తెలంగాణ పునర్మిర్మాణానికి కేంద్రం రూ. 5 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు బిల్లుపై తన అభిప్రాయం చెబుతూ 65 పేజీల లేఖను స్పీకర్‌కు అందజేశారు. తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపి, బిల్లును వెంటనే పార్లమెం ట్‌కు పంపాలని కోరారు. తెలంగాణ అమరవీరులు మరణ వాంగ్మూలాల్లో రాసిన అభిప్రాయాలను లేఖలో పేర్కొన్నారు.
దివంగత సీఎం వైఎస్, ప్రస్తుత సీఎం కిరణ్, బాబు, వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, చిరంజీవి వివిధ సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మాటలతో కూడిన సీడీల ను సమర్పించారు. సింగరేణి బొగ్గు ఎంత సీమాం ధ్రకు సరఫరా అయిందో తెలిపే డాక్యుమెంట్లు, సచి వాలయం, హైకోర్టులో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కు సంబంధించిన పత్రాలను జతపరిచారు. స్వాతంత్య్రం తర్వాత 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, ఏ రాష్ట్రానికీ లేని విధంగా తెలంగాణకు షరతులు, ఆంక్షలు, అధికారాల్లో కోతలు విధించడం సరికాదన్నారు.