
67 ఏళ్లలో చేయలేనిది 67 రోజుల్లోనే చేయాలా?
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు తమపై జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
67 ఏళ్లలో మీరు చేయలేనిది... 67 రోజుల్లోనే మమ్మల్ని చేయమంటారా అని కాంగ్రెస్ నేతలను హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేయమని చంద్రబాబును ప్రశ్నించాలని తెలంగాణ టీడీపీకి సలహాయిచ్చారు. హైదరాబాద్‌లో గవర్నర్కు అధికారాలపై బీజేపీ, టీడీపీలకు స్పష్టమైన వైఖరి లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.