
సీఐఎస్‌ఎఫ్ బలగాలను మొహరించైనా సరే...
హైదరాబాద్: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) గేట్ల ఎత్తు పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు.
నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్‌ఎఫ్ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్‌రావు కోరారు.