devineni umamaheswara rao
-
వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్ అండ్ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం. సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు. జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు. ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్‌కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు. గంటాతో భూకుంభకోణాలు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతిచోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈసారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు. అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు టీడీపీలోని పాపులర్ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు. అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్‌పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై 40కిపైగా కేసులున్నాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ డాన్‌గా పేరుపొందారు. లోకేశ్ అండతో ఆయన అక్రమ మైనింగ్‌లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. -
Vasantha vs Devineni: బల ప్రదర్శనలో ఆంతర్యమేంటి?
జి.కొండూరు: మైలవరం నియోజకవర్గం టీడీపీ నుంచి గత పదిహేనేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావుకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం కోసం బల ప్రదర్శన చేసే స్థాయికి దిగజారాల్సిన వచ్చింది. నాడు దేవినేని ఉమా అన్న దేవినేని వెంకటరమణకు నందిగామ సీటు నిరాకరించి వేరే వ్యక్తికి కేటాయించినప్పుడు రమణ బలప్రదర్శన చేసి సీటు సాధించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో కేడర్ గందరగోళంలో పడింది. ఒక వైపు వసంత వెంకటకృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని నేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. మరో వైపు సీటు నాదేనంటూ దేవినేని ఉమా సైతం తన అనుచరులతో గొల్లపూడిలో శుక్రవారం సాయంత్రం శంఖారావం సభ నిర్వహించారు. నాడు దేవినేని వెంకటరమణ, మరో వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రమణ విజయం సాధించినట్లే నేడు వసంత వెంకటకృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య జరుగుతున్న సీటు ఫైట్‌లో ఉమానే పంతం నెగ్గించుకుంటారని ఆయన అనుచరులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమా శంఖారావం సభలో మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో టీడీపీ కేడర్ తమ నిర్ణయాన్ని ప్రకటించారని, మరో రెండు మూడు పర్యాయాలు మైలవరం సీటు తనదేనన్న భావనను అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. అంతే కాకుండా వసంత కృష్ణప్రసాద్‌కు ఎట్టి పరిస్థితులలో సహకరించవద్దని, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. దేవినేని ఉమా, వసంత మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్న క్రమంలో బొమ్మసాని సైతం తగ్గేదేలేదన్నట్లు మైలవరం టీడీపీ సీటు తనకే కేటాయించాలని కోరుతూ తన అనుచరులను బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు పంపి నేరుగా చంద్రబాబుకే వినతిపత్రం అందించేలా చేశారు. ఈ క్రమంలో మైలవరం టీడీపీ సీటు కోసం జరుగుతున్న త్రిముఖపోరులో అంతిమంగా నెగ్గేదవెవరో కానీ కేడర్‌లో ఏర్పడిన గందరగోళానికి మాత్రం ఇప్పటిలో తెరపడేలా లేదు. అధిష్టానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన దేవినేని ఉమా శంఖారావం పేరుతో అనుచరులతో సమావేశం మరోవైపు టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ వెళ్లిన వసంత -
Krishna District: టీడీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు భారీ షాక్..
ఇప్పటి వరకూ ఎమ్మెల్యే టికెట్ తమదేనంటూ ఆశల పల్లకీలో ఊరేగారు. ఎక్కువ కేసులు పెట్టించుకుని అధినేత దృష్టిలో పడేందుకు అడ్డగోలు చర్యలతో చెలరేగారు. చంద్రబాబుకు తాము ఎంత చెబితే అంత, తమకు కాక టికెట్ ఇంకెవరికి ఇస్తారంటూ విర్రవీగారు. డబ్బు మూటలే ప్రామాణికంగా పక్కపార్టీ నుంచి వచ్చేవారు, ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకు అధినేత టికెట్లు కేటాయిస్తుండటంతో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యే టికెట్లపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు, చినబాబు మాటలు నీటి మూటలేనని తేలాయి. అధినేతల మెప్పు కోసం నియోజకవర్గాల్లో హడావిడి చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కేసులు పెట్టించుకోవడమే లక్ష్యంగా పని చేసిన వారికి నిరాశే మిగిలింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ డబ్బు మూటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకే ఎమ్మెల్యే సీట్లు కట్టబెడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ టికెట్ వెనిగండ్ల రాముకు, గన్నవరం టికెట్ యార్లగడ్డ వెంకటరావుకు కేటాయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసి, పలు కేసులు పెట్టించుకున్న పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడే ప్రసాద్ సీటు చింపేశారు. ఆయనకు టికెట్ లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. పక్క పార్టీల నుంచొచ్చే డబ్బున్న బడానేతలకు టికెట్ ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. తనకే టికెట్ వస్తుందని బోడే ప్రసాద్ పాద యాత్రలు చేస్తున్నా, ఆయన భార్య, కుమారుడు కాళ్లకు బలపం కట్టుకుని గడప గడపకూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యమన్న చర్చ జరుగుతోంది. టికెట్ కోసం తమ ప్రత్యర్థి, పార్టీ మారుతున్న నేత పంచకు చేరి కాళ్లావేళ్ల పడగా, తనకే ఇక్కడ టికెట్ లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, అధిష్టానం వద్దే విన్నవించుకోవాలని ఆ నేత సూచించడంతో బోడే ప్రసాద్‌కు దింపుడు కల్లం ఆశ కూడా లేకపోయిందన్న చర్చ సాగుతోంది. ఉమాకు టికెట్ గల్లంతు పార్టీలో నంబరు–2, అధినేతకు తాను ఎంత చెబితే అంత అని విర్రవీగిన దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధినేత వద్ద మెప్పుకోసం నానా హంగామా చేసి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఆయనను ఇప్పుడు అధినేత పట్టించుకోవటం లేదు. మైలవరం సీటు కోసం పక్క పార్టీల నుంచి వచ్చేవారు, పార్టీలోనే కొంత మంది డబ్బు మూటలు ఆశ చూపడంతో ఉమాకు చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటు సైతం డబ్బే ప్రామాణికంగా కేశినేని చిన్నికి కేటాయిస్తున్నారని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ముద్దరబోయినకు షాక్ నూజివీడు నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీజెండా మోస్తూ తిరుగుతున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, పార్టీ తరఫున పోరాటం చేసిన ముద్దరబోయినకు టికెట్ లేదని మొండి చెయ్యి చూపడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ కేటాయిస్తానని చెప్పడంపై, ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జనసేన పొత్తు నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులకు గండి పడింది. బీజేపీతో పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో మరికొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తోంది. మిగిలిన సీట్లు ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే, ఆది నుంచి పార్టీని నమ్ముకొని పని చేసిన వారి పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుతోంది. -
ఉన్న పరువు కాస్తా పాయే..!
సాక్షి, ఒంగోలు ప్రతినిధి: పాయే.. ఉన్న పరువు కాస్తా పాయే..! ఏదో చేద్దామనుకుంటే మరేదో జరిగింది. టీడీపీ త్రీమెన్ కమిటీ పేరుతో హడావిడి చేయాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. పార్టీ జిల్లా శ్రేణుల్లో భరోసా మాట అటుంచితే.. ముఖ్య నేతల్లోనే నమ్మకం కలిగించలేక పోయారు. త్రీమెన్ కమిటీ మొట్టమొదటి సమావేశానికే కమిటీలోని ఒక సభ్యుడు డుమ్మాకొట్టాడు. ఇక జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని సైతం మమః అనిపించేశారు. సమావేశానికి ఇద్దరు నియోజకవర్గ ఇన్చార్జిలు మినహా మిగతా వారంతా మొహం చాటేశారు. పట్టుమని పది మంది ముఖ్యనేతలు కూడా రాకపోవడంతో సమావేశాన్ని పది నిముషాల్లోనే ముగించేశారు. ఇలా వచ్చి అలా వెళ్లారు.. అన్న చందంగా త్రిసభ్య కమిటీ పర్యటన సాగింది. నిన్నమొన్నటి వరకూ పార్టీ జిల్లా నేతలపై ఉన్న చిన్నపాటి నమ్మకం సైతం నేటితో పోయిందని టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీ విలేకర్ల సమావేశం పెట్టి వైఎస్సార్ సీపీ నేతలను తిట్టడం మినహా కార్యకర్తలకు పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వకపోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచితే త్రిసభ్య కమిటీ రాకతో జిల్లాలో పార్టీ మరింత దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... జిల్లాలో టీడీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తామంటూ వచ్చిన త్రీమెన్ కమిటీ నిర్వాకంతో పార్టీ పరువు బజారునపడిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు మాజీమంత్రులు, ఓ ఎమ్మెల్సీతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శుక్రవారం ఒంగోలులో పర్యటించింది. త్రిసభ్య కమిటీ మొట్టమొదటి సమావేశానికి కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డుమ్మా కొట్టారు. మిగతా ఇద్దరు సభ్యులైన దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్‌లు ఇలా వచ్చి అలా వెళ్లారే తప్ప పార్టీ కార్యకర్తలతో మాట్లాడటంగానీ, వారి సమస్యలను తెలుసుకోవడంగానీ చేయకపోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తొలుత ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన నేతలు అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మొహం చాటేసిన టీడీపీ ముఖ్య నేతలు... జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, టీడీపీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు హాజరుకావాల్సి ఉంది. అయితే, శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి పట్టుమని పదిమంది ముఖ్య నాయకులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి దామచర్ల జనార్దన్, కనిగిరి ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి శిద్దా రాఘవరావు మినహా ఎవరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు నియోజకవర్గ ఇన్చార్జిలు డుమ్మా కొట్టడం చూస్తుంటే.. జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి నేతల నుంచి స్పందన కరువవడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు పది నిముషాల్లో ముగించి మమః అనిపించేశారు. -
అమ్మ.. ఉమా!
సాక్షి, అమరావతి: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాందా? అంటే.. ఎగురుతుంది అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో టన్నెల్ తవ్వలేక చేతులెత్తేసిన కాంట్రాక్టరు 17,561 క్యూసెక్కులను సరఫరా చేసే టన్నెల్‌ను తవ్వగలరా?.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికే దన్నుగా నిలుస్తోంది. నామినేషన్ పద్ధతిలో బినామీకి రూ.290 కోట్ల విలువైన పనులను అస్మదీయ కాంట్రాక్టరుకు కట్టబెట్టింది. వెంటనే ఆ పనులను బినామీ చేతుల్లో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కుడి అనుసంధానం (65వ ప్యాకేజీ) పనుల్లో కమీషన్ల కోసం ఆడిన నాటకంలో రూ.50కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు అధికారులు చెబుతున్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ బాగోతం వివరాలివీ.. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువను అనుసంధానం చేస్తూ నీటిని సరఫరా చేసే పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు యూనిటి ఇన్ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. ఎడమ కాలువకు 17,561 క్యూసెక్కులు సరఫరా చేసేలా 919 మీటర్ల పొడవున సొరంగం తవ్వకం, హెడ్ రెగ్యులేటర్, ఎగ్జిట్ ఛానల్ పనులు ఈ ప్యాకేజీ కింద చేయాలి. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తిచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన యూనిటి ఇన్ఫ్రా సంస్థ.. ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటైల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 72వ నిబంధన ప్రకారం ఆ సంస్థ మీద వేటు వేయాలన్న పోలవరం చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) ఆమోదముద్ర వేసింది. మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.276.80 కోట్లకు పెంచేసేలా ఆ శాఖా మంత్రి దేవినేని చక్రం తిప్పారు. నిబంధనల ప్రకారం ఈ పనులను టెండర్లు ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలి. నోటి మాటపై తన సన్నిహితుడు శ్రీనివాసరావుకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్కు నామినేషన్ పద్ధతిలోదేవినేని ఉమా కట్టబెట్టేశారు. అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు అడ్డం తిరగడంతో చేసేదిలేక టెండర్లు పిలిచారు. టెండర్లలో ఎంపిక చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే షెడ్యూలు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఇందులో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో ప్యాకేజీ–20 పనులను.. పాత కాంట్రాక్టర్‌పై వేటు వేసి 2015లో మ్యాక్స్ ఇన్ఫ్రాకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. కానీ, కేవలం 200 మీటర్ల టన్నెల్ తవ్విన మ్యాక్స్ ఇన్ఫ్రా ఆ తర్వాత చేతులెత్తేసింది. అదే సంస్థ పోలవరం కుడి అనుసంధానం (65వ ప్యాకేజీ) టెండర్లలో 4.76 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. ఈ సంస్థకు పనులు కట్టబెట్టేలా కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)పై ఒత్తిడి తెచ్చి టెండర్‌ను ఆమోదించారు. జలవనరుల శాఖతో మ్యాక్స్ ఇన్ఫ్రా ఒప్పందం చేసుకున్న వెంటనే ఆ పనులను సబ్ కాంట్రాక్టు కింద బినామీకి చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టేసేలా మంత్రి చక్రం తిప్పారు. -
సన్నిహితుడికే జీవనోపాధి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపర్చడం మాటేమోగానీ తన సన్నిహితుడికి మాత్రం భారీ ప్రయోజనం కల్పించడంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సఫలమయ్యారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పథకానికి తన సన్నిహితుడైన వ్యక్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేయడంతోపాటు భారీగా మొబిలైజేషన్ అడ్వాన్సులు సైతం చెల్లించేందుకు సిద్ధం కావడం వెనుక గూడుపుఠాణీ జరిగినట్లు భావిస్తున్నారు. కన్సల్టెన్సీగా మంత్రి ఉమా సన్నిహితుడి సంస్థ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధుల అభివృద్ధి పథకం(ఏపీఐఎల్‌ఐపీ) రెండో దశ అమలుకు రూ.రెండు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు తన సన్నిహితుడు డైరెక్టర్‌గా ఉన్న ‘నిప్పాన్ కోయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేసేలా మంత్రి దేవినేని ఉమా చక్రం తిప్పారు. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.61.24 కోట్లను ఆ సంస్థకు చెల్లించనున్నారు. ఎక్కడా లేని రీతిలో ఈ సంస్థకు అడ్వాన్సుగా రూ.3.06 కోట్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఉన్నతాధికారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కన్సల్టెన్సీకి అడ్వాన్సు కింద నిధులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. గ్లోబల్ టెండర్ల నిబంధన తుంగలోకి.. ఈ ప్రాజెక్టు అమలుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని జైకా నిబంధన విధించింది. కానీ మంత్రి దేవినేని ఉమా ఆదిలోనే ఈ పథకానికి గండి కొట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ టెండర్లను నీరుగార్చి తన సన్నిహితుడు డైరెక్టర్‌గా ఉన్న సంస్థను కన్సల్టెన్సీగా నియమించేలా చక్రం తిప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, పంటల సాగు.. వ్యవసాయ యంత్రీకరణ, చేపల పెంపకం, పాడి పశువుల పెంపకం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వంటి అంశాల్లో కన్సల్టెన్సీ సూచనలు, సలహాలు ఇస్తుంది. అనుభవం లేకున్నా అందలం.. ప్రభుత్వం కన్సల్టెన్సీగా ఎంపిక చేసిన సంస్థకు ఈ విభాగంలో ఏమాత్రం అనుభవం లేదని ఆదిలోనే అధికారులు అభ్యంతరం చెప్పారు. అయితే మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడడంతో చేసేదిలేక ఆ సంస్థనే కన్సల్టెన్సీగా ఎంపిక చేశామని జలవనరుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఐదేళ్లలో రూ.61.24 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన తరహాలో ఎన్నడూ లేని రీతిలో కన్సల్టెన్సీ సంస్థకు కూడా అడ్వాన్సుగా రూ.3.06 కోట్లు ఇవ్వాలని నిర్ణయించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. జైకా రుణం రూ.1,700 కోట్లు రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, చేతివృత్తిదారుల జీవనోపాధులను మెరుగుపర్చడం కోసం జైకా(జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) ఆర్థిక సాయంతో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఏపీఐఎల్ఐపీని 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ పథకానికి కొనసాగింపుగా ఏపీఐఎల్‌ఐపీ రెండో దశను ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో రూ.1,700 కోట్లు జైకా రుణం కాగా రూ.300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా. రెండు భారీ ప్రాజెక్టులు, 18 మధ్య తరహా ప్రాజెక్టులు, 445 చెరువులను ఆధునికీకరించడం ద్వారా 4,07,187 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, వ్యవసాయ యాంత్రీకరణ, చేపల పెంపకం, పాడి పరిశ్రమ లాంటి వాటి ద్వారా రైతులు, చేతివృత్తిదారుల ఆదాయాన్ని పెంచడం రెండో దశ లక్ష్యంగా నిర్ణయించారు. -
ఆ ‘ముగ్గురి’కీ అవార్డులు!
సాక్షి, అమరావతి: వివిధ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు బాగా పనిచేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు కితాబు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై వేధింపులు, తీవ్ర అవినీతికి పాల్పడినవారు, మాఫియాగా మారి ఇసుకను దోచేస్తున్న నాయకులు, ఇరిగేషన్ కాంట్రాక్టులు దక్కించుకుని రూ.వేల కోట్లు దోచి సీఎం చంద్రబాబుకు వాటా ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపైన సీఎం ప్రశంసలు కురిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శుక్రవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరుపై గత మూడు నెలల కోసం సర్వే నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. అందులో ముగ్గురు, నలుగురు బాగా పనిచేశారంటూ వారి పేర్లను ఆయన స్వయంగా చదివి వినిపించారు. వారిలో రాష్ట్రంలోనే వివాదాస్పద ఎమ్మెల్యేగా రికార్డులకెక్కిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు ఉండడం గమనార్హం. అధికారులు, సాధారణ పౌరులపై దాడులు, దౌర్జన్యాలతో రౌడీ రాజకీయం నడిపిస్తూ చింతమనేని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుండడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయడం నుంచి ఇటీవల హనుమాన్ జంక్షన్లో ఆర్టీసీ బస్సుపై అంటించిన పోస్టర్లో చంద్రబాబు బొమ్మ చిరిగిపోయిందని కండక్టర్, స్థానికులపై చేయిచేసుకునే వరకు ఆయన చేసిన అరాచకాలకు అంతే లేదు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఇటీవలే భీమడోలు కోర్టు ఆయనకు మూడేళ్ల శిక్ష విధించింది. అలాంటి వ్యక్తిని ఉత్తమ నాయకుడిగా ప్రకటించడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) అనే సంస్థ దేశవ్యాప్తంగా వెలువరించిన మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎమ్మెల్యేల జాబితాలో చింతమనేని పేరు ప్రముఖంగా ఉంది. ఆయనపై 23 కేసులున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బండారు సత్యనారాయణమూర్తిపై ఉన్న కేసులు, వారి ఆగడాలను వివరించింది. కాగా.. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనపై ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలున్నాయి. నోటి దురుసుతో ఇష్టానుసారం మాట్లాడే అచ్చెన్నను చూసి అందరూ పద్ధతి నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ సీనియర్ నేతలు బిత్తరపోయారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను దుర్భాషలాడడమే తన రోజువారీ పనిగా పెట్టుకుని మీడియా సమావేశాలతో విసుగుపుట్టించే మంత్రి దేవినేని ఉమాను ఉత్తమ ప్రజెంటర్‌గా ఎంపిక చేశారు. ప్రతిపక్షాన్ని దుమ్మెత్తి పోస్తున్నందుకు ఆయనకు కితాబు లభించింది. దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వైఎస్ జగన్‌ను తన కంటే ఎవరూ బాగా తిట్టలేదని, రోజుకు రెండు, మూడు మీడియా సమావేశాలు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నా తనను కాకుండా దేవినేనిని ఎలా ఉత్తమ ప్రజెంటర్‌గా ఎంపిక చేస్తారని ఆయన వర్గం వాదిస్తోంది. వివాదాల్లో మునిగితేలే నాయకులు, దుర్భాషల్లో ఆరితేరినవారు బాగా పనిచేస్తున్నారని సీఎం చెప్పడం టీడీపీ నేతలకు మింగుడుపడడంలేదు. -
దేవినేనికి సిగ్గులేదు.. నక్కాకు సోయిలేదు
సాక్షి, విజయవాడ: కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, టీడీపీ నేతలను ప్రజలెవరూ నమ్మడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ అన్నారు. ప్రధానమంత్రిని జగన్ విమర్శించడంలేదన్న టీడీపీ మంత్రుల వ్యాఖ్యలు అర్థంలేనివన్నారు. మోదీని విమర్శించడంకాదు ఏకంగా ఆయన ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే అని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది వైఎస్సార్సీపీనే. ఆ సంగతి మర్చిపోయి మాట్లాడుతున్న మంత్రి దేవినేనికి ఏమాత్రమైనా సిగ్గుందా? హోదా విషయంలో టీడీపీవి డ్రామాలు కాబట్టే అఖిలపక్ష పార్టీలన్నీ చంద్రబాబును ఛీకొట్టాయి. ఏకపక్షంగా మిగిలిన చంద్రబాబు ఏకాకిలా కాకి అరుపులు అరుస్తుంటే, ఆయనకు తోడుగా దేవినేని చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. మరో మంత్రి నక్కా ఆనందబాబు ఎప్పుడూ మైకంలో ఉండి మాట్లాడతారు. ఆయన సోయిలోకి వస్తేకదా రాష్ట్రంలో, కేంద్రంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇక లోకేశ్..! అమెరికాలో పెద్ద చదువులు చదివొచ్చిన ఆయనను తెలుగు ప్రజలపైకి వదిలిపెట్టారు.విభజన సమయంలో ప్రధాని ఎవరో కూడా తెలియనంత లోకజ్ఞానం, తెలివితేటలు ఆయనవి’’ అని జోగి రమేశ్ మండిపడ్డారు. వీరుడిలా పోరాడేది జగనే: ‘‘నాటు సోనియా గాంధీతోగానీ, నేడు ప్రధాని నరేంద్ర మోదీతోగానీ వీరుడిలా పోరాడింది ఒక్క వైఎస్ జగనే. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం మొదలు, అన్ని పార్టీలనూ ఏకం చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబు పూటకోమాట, రోజుకో పాట పాట పాడతాడు కాబట్టే జనం ఆయనను నమ్మరు’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు. -
హంద్రీ–నీవాకు ఇంకెన్ని ఆగస్టులు కావాలి
► మంత్రి దేవినేనికి ప్రకటనపై కట్టుబడే ధైర్యం ఉందా ? ► వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి బి.కొత్తకోట: హంద్రీ–నీవా కాలువల ద్వారా జిల్లాకు కృష్ణా నీరు అందించేందుకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇంకెన్ని ఆగస్టులు కావాలని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రశ్నించారు. రానున్న ఆగస్టులో నీటిని రప్పిస్తామని మంత్రి బుధవా రం రాత్రి బి.కొత్తకోట మండల పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. గురువారం నంద్యాల నుంచి ఆయన ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఆగస్టుకు నీరిస్తామన్న ప్రకటనకు కట్టుబడే ధైర్యం మంత్రికి ఉందా ? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రి నోటివెంట ఎన్ని ఆగస్టులు, ఎన్ని మార్చి లు, ఎన్ని డిసెంబర్లు గడచిపోయాయో ప్రజలకు తెలుసన్నా రు. జిల్లాలో ఇంకా రూ.900 కోట్లకుపైబడిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో బి.కొత్తకోట శివారులో నిర్మిస్తున్న బ్రిడ్జి ఉందని, ఆగస్టుకు ఈ ఒక బ్రిడ్జి పూర్తిచేయించే సామర్థ్యం ఉందా ? ఉంటే సవాలు స్వీకరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇప్పించేందుకు మంత్రి దృష్టిపెట్టాలని కోరారు. -
గాలేరు–నగరి..నిర్లక్ష్యంతో సరి
► బడ్జెట్ కాగితాల్లోనే కనిపిస్తున్న నిధులు ► ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ముందుకు సాగని పనులు ► అధికారులే కారణమంటున్న పాలకులు ► ఎప్పుటికి పూర్తవుతుందో? పాలకులు మారుతున్నారు.. అధికారులు మారిపోతున్నారు.. ఏళ్లు గడిచిపోతున్నాయి.. కృష్ణా జలాలు నగరికి చేరనే లేదు.. రైతుల జీవితాల్లో మార్పు కొంచెమైనా లేదు. అవే అవస్థలు.. కన్నీటి తడులు.. ఎడారిని తలపించే పొలాలు.. ఆశల మోములు.. ఆవేదన సుడిగుండాలు.. అవస్థల బతుకులు.. ఇదీ జిల్లా రైతుల దీన పరిస్థితి. ప్రభుత్వం అధికారుల అలసత్వం వల్ల పనులు ఆలస్యమవు తున్నాయంటోంది. నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేయాలని అధికారులు తలపట్టుకుంటు న్నారు. ఇదీ పాలకుల తీరు. నగరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం గాలేరు–నగరికి శాపంగా మారింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2009 వరకు పనుల్లో వేగం పుంజుకుంది. తర్వాత ఆయన మరణించారు. ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. కాలువల ఏర్పాటుకు భూములు స్వాధీనం చేసుకున్న పనులే అడపాదడపా చేస్తున్నారు. కాగితాల్లోనే నిధులు 2015–16 వరకు 4,789.96 కోట్లు వెచ్చించారు. 2016–17 బడ్జెట్లో 358.12 కోట్లు, 2017–18లో 363.12 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. జూలై 2017 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇదివరలో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మాటమార్చింది. ఆడలేనమ్మ మద్దెలపై పడ్డట్టుంది జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రకటించారు. ఆపై మాట మార్చేశారు. అధికారుల అలసత్వం వల్లే పనులు మందకొడిగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. నిధులు విడుదల చేయకుండా తాము ఏపనులు చేస్తామంటూ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఓవైపు కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు. ఇంకా ఎర్త్ వర్క్, రివిట్మెంట్, కాలువల పనులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతంలో ముళ్లకంపలు పేరుకుపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో పగుళ్లు వదలి ఉండటంతో ఇదివరలో చేపట్టిన పనులు కొంతమేరకు మళ్లీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంలో స్పష్టత రాలేదు. ఏదో ఒకటి చెబుతూ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో తమను మభ్యపెడుతోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 1.03 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 0.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుంది. 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్పి అవుతాయి. 20 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. -
'కృష్ణా జలాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం'
- రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటాం - మంత్రి దేవినేని ఉమా మచిలీపట్నం : కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో న్యాయనిపుణులతో చర్చించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జెడ్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నీటి పంపకాల విషయంలో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీరు తరలింపులో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించామన్నారు. జిల్లాలో దాళ్వా సాగుకు నీటి విడుదలపై ఇరురాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం నీటి విడుదల విషయం ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో పెడన శాసన సభ్యుడు కాగిత వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, బంటుమిల్లి మార్కెట్ యార్డు చైర్మన్ వాటాల నరసింహస్వామి పాల్గొన్నారు. -
శ్రీవారి వద్ద పోలవరం ప్రాజెక్టు డిజైన్లు
2018 నాటికి ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉమా సాక్షి, తిరుమల: ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని 2018 నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆదివారం తిరుమలలో ఆయన పోలవరం ప్రాజెక్టు డిజైన్లను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర ్వహించి, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. అలాగే బాలాజీ హైడ్రో మెకానికల్ నిపుణులు కన్నయ్యనాయుడుకు ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఉందని, ఆయనతోపాటు చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వర్లు సూచనలు మేరకు పోలవరం నిర్మాణం చేపడతామన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్‌కు పంపుతామని చెప్పారు. -
అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి
విజయవాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. తనకు గజం స్థలం కూడా లేదని, కృష్ణా జిల్లా గొల్లపూడిలోని అద్దె ఇంట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గొల్లపూడిలో మంత్రి ఇంటి నుంచి ప్రజాసాధికారిక సర్వే ప్రారంభించిన అధికారులకు ఆయన ఈ వివరాలు ఇచ్చారు. అధికారులకు తన ఆధార్, ఓటరుకార్డులోని విషయాలు మాత్రమే అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి ఈ వివరాలను నమోదుచేసుకున్నారు. -
‘పోలవరం’ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
అసెంబ్లీలో మంత్రి ఉమా వెల్లడి సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల కు పరిహారం చెల్లించడంలో పూర్తి న్యాయం చేస్తామని, ఎవరికీ అన్యాయం జరగనీయబోమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అసెంబ్లీలో శనివా రం ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, చిల్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రూ.1.50 లక్షల పరిహారం ప్రకటించగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో రూ.7లక్షల నుంచి రూ.9లక్షల వరకూ పెంచిందన్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు వెళ్లి డ్యామ్సైట్లో గ్రామాలను ఖాళీ చేయవద్దంటూ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. చేగొండపల్లిలో నిర్వాసితులకు ప్రభుత్వం కొత్త వస్త్రాలు, స్వీట్లు ఇచ్చి శుక్రవారమే ఖాళీ చేయించినట్లు తెలిపారు. నిర్వాసితులైన పేద గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ వద్ద రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందని, రామయ్యపేట, పైడిపాక గ్రామాలు ఖాళీ చేస్తే రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పని జరుగుతుందన్నారు. త్వరలోనే ఆయా గ్రామాల వారిని ఒప్పించి ఖాళీ చేయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఉద్ఘాటించారు. నిర్వాసిత గ్రామాల వారిని ఖాళీ చేయవద్దంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజుతోపాటు వామపక్షాల నేతలు కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. -
అ‘ధనం’పై పట్టువీడని మంత్రి
‘అవుకు’ కాంట్రాక్టర్‌కు అదనపు సొమ్ము చెల్లింపు దిశగా మళ్లీ చర్యలు రూ. 44 కోట్లు అప్పనంగా ఇచ్చేయడానికి దారులు వెతుకుతున్న మంత్రి? సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్లో ఓ ఫైలు ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా కేబినెట్ ఆమోదం పొంది ఉత్తర్వులు కూడా జారీ అయిపోవడాన్ని మనం చూశాం. అదే శాఖలో అలాంటిదే మరో ఉదంతమిది. అవుకు సొరంగం పనుల్లో అదనపు చెల్లింపుల వ్యవహారం స్టాండింగ్ కమిటీ ముందుకు పదేపదే వస్తున్నది. ఒకసారి కూడదు అని సిఫార్సు చేసినా మరలా అదే కమిటీకి పరిశీలన నిమిత్తం జలవనరుల శాఖ ఎందుకు పంపుతోంది అనేది గ్రహించడానికి ఎక్కువ శ్రమించనక్కరలేదు. అందులో ఎందరో ‘ప్రయోజనాలు’ ఇమిడి ఉంటాయి మరి.. ఆ సంగతేమిటో చూద్దామా.. కర్నూలు జిల్లాలోని అవుకు సొరంగంలో అవినీతి ప్రవహించాల్సిందేనని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టుబడుతున్నారని ఆ శాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించే దిశగా పావులు కదుపుతుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. అవుకు సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం కావడాన్ని తప్పుబడుతూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. అదనపు చెల్లింపులు అంశంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలంటూ సీఎం రమేష్ రాసిన లేఖను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)కి ప్రభుత్వం నేవిదించింది. అదనంగా కాంక్రీట్ పనులు చేసినా ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) పరిమాణం కంటే పెరగనందున.. అదనంగా చెల్లించడానికి నిబంధనలు అంగీకరించవని, చెల్లించాలనుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఎస్ఎల్ఎస్సీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసుతో సంతృప్తి చెందని మంత్రి.. ఏదో విధంగా చెల్లింపులు చేయడానికి దారులు వెతికారు. అడ్డదారిలో చెల్లిస్తే అవినీతి బయటపడుతుందని జంకినట్లు సాగునీటి శాఖ అధికార వర్గాల సమాచారం. దాంతో ఎస్ఎల్ఎస్సీకి మరోసారి ఇదే అంశాన్ని నివేదించాలని నిర్ణయించారు. ఈసారి సానుకూలంగా సిఫారసు వచ్చే విధంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎస్ఎల్ఎస్సీ సిఫారసు మేరకే అదనపు చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకోవడానికి వీలు ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. రూ. 44 కోట్లు అదనం గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) వరద కాల్వ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా రూ. 401 కోట్ల విలువైన అవుకు టన్నెల్-2 పనిని ప్యాకేజీ 30 కింద ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో ఎన్సీసీ-మేటాస్ జాయింట్‌వెంచర్‌కు 2007లో ప్రభుత్వం అప్పగించింది. సొరంగం తవ్వకంలో ఎలాంటి ప్రతికూల అంశాలు, ప్రతిబంధకాలు ఎదురైనా పూర్తి బాధ్యత తీసుకొని పని పూర్తి చేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు. ఒప్పందంలో ఉన్న దానికంటే 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అదనంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, దానికి ఒప్పంద విలువ కంటే రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలని కాంట్రాక్టర్‌ను ప్రభుత్వాన్ని కోరితే.. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది. సాధారణంగా ఈపీసీ విధానంలో అదనపు చెల్లింపులకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని.. నిబంధనలకు విరుద్ధంగా అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయిందని పేర్కొంటూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. అధికార పార్టీ ఎంపీ రాసిన లేఖ బయటకు పొక్కిన నేపథ్యంలోనే గత ఏడాది ఈ అంశాన్ని ప్రభుత్వం ఎస్ఎల్ఎస్సీకి నివేదించింది. ప్రభుత్వం ఆశించినట్లుగా కాకుండా, భిన్నంగా సిఫారసు రావడంతో, కొంతకాలం ఆగి మళ్లీ ఇప్పుడు తాజాగా రెండోసారి ఎస్ఎల్ఎస్సీకి నివేదించడం గమనార్హం. -
భారీ దోపిడీకి కేబినెట్ సై!
సాక్షాత్తు ఒక మాజీ సీఎస్, ప్రస్తుత సీఎస్ కూడా వద్దని చెప్పిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసేసింది. నీటి ప్రాజెక్టుల భారీ దోపిడీకి రంగం సిద్ధమైపోయింది. హంద్రీ- నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆర్థికశాఖ సైతం అభ్యంతరం తెలిపిన ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కలిసి ఆమోదముద్ర వేయించారు. మొత్తం రూ. 13,475 కోట్ల అదనపు చెల్లింపులకు సర్వం సిద్ధమైపోయింది. అంతకు ముందున్న అంచనాలను రూ. 24,705 కోట్లకు పెంచారు. దీనికి పాత సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రస్తుత సీఎస్ ఠక్కర్ కూడా విముఖత చూపి, సంబంధిత ఫైళ్లను వెనక్కి తిప్పి పంపారు. అయినా కూడా, గతంలో ఎన్నడూ లేని రీతిలో మూడుసార్లు ఈ అంశంపై చర్చ జరిపి.. చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. -
వంశీ, ఉమా ఇన్నర్ వార్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పటమట పోలీసులు కేసు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నర్‌రింగ్ రోడ్డుకు కావాల్సిన భూమిని సేకరించటం కోసం పేదల గుడిసెల తొలగింపు నోటీసులు ఇచ్చేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ఆదివారం ఉదయం వెళ్లగా స్థానికులు నిరసన వ్యక్తంచేసి అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ అక్కడకు వచ్చి గ్రామస్తుల్ని శాంతపరిచి ఈ విషయం ముఖ్యమంత్రితో చ ర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామని అధికారులకు గట్టిగా చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఇరువర్గాల మధ్య వివాదాన్ని తగ్గించడానికి వచ్చిన ఎమ్మెల్యే వంశీపై అధికారుల విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారంటూ కేసు నమోదు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఉమాతో ఎమ్మెల్యే వంశీకి విభేదాలు... మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఎమ్మెల్యే వంశీకి విభేదాలున్నాయి. మంత్రి ఉమా ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను వంశీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కుడికాల్వ నుంచి దెందులూరు, మైలవరం నియోజకవర్గాల రైతులు మోటార్లు ఉపయోగించి నీరు తీసుకున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని రైతుల పంటలను కాపాడేందుకు ఎమ్మెల్యే వంశీ పోలవరం కాల్వకు మోటార్లు ఏర్పాటు చేశారు. గన్నవరం రైతుల్లో వంశీకి బలం పెరుగుతోందని భావించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇరిగేషన్ అధికారులను ఉపయోగించి ఆయా మోటార్లను తొలగించేందుకు ప్రయత్నించారు. దీన్ని వంశీ అడ్డుకుని.. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానంటూ హెచ్చరించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. పోలవరం కుడికాల్వలో మట్టిని కూడా గన్నవరం నియోజకవర్గ రైతులు తమ పొలాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని జలవనరుల శాఖాధికారులు అడ్డుకోవడం వెనుక కూడా మంత్రి ఉమా హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి. రామవరప్పాడులో ప్రజల కోరిక మేరకు వంతెన నిర్మాణానికి ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి రూ.5 కోట్లను ఎమ్మెల్యే వంశీ మంజూరు చేయించారు. ప్రస్తుతం రైవస్కాల్వపై వంతెన కడితే భవిష్యత్తులో మెట్రో రైలు నిర్మాణానికి ఇబ్బంది వస్తుందంటూ ఇరిగేషన్ అధికారులు దీనికి అనుమతులు ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో తన ను గెలిపిస్తే వంతెన నిర్మిస్తానంటూ ఎమ్మెల్యే వంశీ రామవరప్పాడు రైతులకు హామీ ఇచ్చారు. అది నెరవేరకుండా అధికారులు అడ్డుపడుతున్నారని వంశీ వర్గం భావిస్తోంది. ఇప్పుడు రామవరప్పాడు ప్రజల్లో వంశీని పలచన చేయడానికే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పేదల ఇళ్లను బలవంతంగా తీసుకునేందుకు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు ముందుకు వచ్చారని, దీని వెనుక మంత్రి ఉమా హస్తం ఉండవచ్చని వంశీ వర్గం భావిస్తోంది. స్వపక్షంలోనే విపక్షం... గత ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన రామవరప్పాడు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వంశీ అధికారులతో వివాదానికి దిగారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఇళ్లు తొలగిస్తానని గతంలో కలెక్టర్ హామీ ఇచ్చి ఇప్పుడు ఆకస్మికంగా ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడంపై వంశీ అధికారులను ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోదరుడు బాజీప్రసాద్‌కు చెందిన ఇనోటెల్ హోటల్‌ను కాపాడేందుకే పేదల ఇళ్లను తొలగిస్తున్నారంటూ బహిరంగంగా ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వంశీ స్వపక్షంలోనే విపక్షంగా మారడం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పార్టీలో వాడివేడిగా చర్చ సాగుతోంది. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుల్లో నిందితులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఎమ్మెల్యేను పిలిచి కనీసం ప్రశ్నించడానికి సాహసించని బెజవాడ పోలీసులు ఎమ్మెల్యే వంశీపై అంత దూకుడుగా కేసు నమోదు చేయడం వెనుక ఎవరి హస్తం ఉండవచ్చని ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. -
మంత్రి, ఎమ్మెల్యే గోడ గొడవ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే వినవస్తున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రాజకీయ వైరమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య నెలకొన్న వైరం తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ పనులు పూర్తయితే గద్దెకు నియోజకవర్గంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయని, పార్టీ అధినేత చంద్రబాబు వద్ద గ్రాఫ్ పెరుగుతుందనే అభద్రతా భావంతో ఉమా ఆటంకాలు కలిగిస్తున్నారని చెబుతున్నారు. కొందరు ఇంజనీర్లు ఒక వర్గంగా ఏర్పడి ఆయన చెప్పిన పనులను.. నిబంధనలకు వ్యతిరేకమైనా నిమిషాల్లో చేసేస్తున్నారు. మరికొందరు ఇంజనీర్లు అత్యుత్సాహంతో మంత్రిని వ్యతిరేకించే నేతల పనులకు బ్రేక్‌లు వేస్తున్నారు. కృష్ణానది రిటైనింగ్‌వాల్ నిర్మాణమే ఇందుకు ఉదాహరణగా ఉంది. కృష్ణానది వరదల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురై ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగకపోవడంతో ఎడమ వైపున విజయవాడలో బ్యారేజి నుంచి రామలింగేశ్వరనగర్ వరకు ఉన్న ప్రాంతం వరదకు మునిగిపోతోంది. 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో నదికి అనుకున్న అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. 15 రోజులపాటు ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే యల మంచిలి రవి రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరాన్ని ప్రభుత్వానికి వివరించడంతో 2014 ఫిబ్రవరిలో రూ.104 కోట్ల విలువతో టెండర్లు ఆహ్వానించారు. అంచనాకన్నా 5.4 శాతం తక్కువ రేటుకు ఎస్‌ఈడబ్ల్యు, దీపిక కనస్ట్రక్షన్ సంస్ధ లు టెండరు దక్కించుకున్నాయి. 24 నెలల కాలపరిమితిలో రిటైనింగ్ వాల్ నిర్మిం చాలనే నిబంధన విధించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికే 14 నెలలు విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని కేసీ డివిజన్ దీనికి సంబంధించిన పనులను ముందుకు సాగనీయలేదు. సాధారణంగా ఇంజనీరింగ్శాఖలో టెండర్ల ఖరారు తరువాత నెలరోజుల్లో నిర్మాణసంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డరు ఇస్తుంది. రిటైనింగ్ వాల్ విషయంలో మాత్రం 14 నెలల తరువాత (జూన్ 2015లో) ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అగ్రిమెంట్ జాప్యం వెనుక ఇంజనీర్ల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి. అగ్రిమెంట్ కుదుర్చుకున్న తరువాత కూడా పనులు ప్రారంభించడానికి ఇంజనీరింగ్ శాఖ రీఇన్ఫోర్స్మెంట్కు సంబంధించి డిజైన్లు ఇవ్వలేదు. డిజైన్ల కోసం నిర్మాణసంస్థల ప్రతినిధులు ఐదునెలలుగా ఇంజనీర్లను కలుస్తున్నా ఇప్పటివరకు వాటిని తీసుకోలేక పోయారు. కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కడియాల రవి ఈ డిజైన్లు ఇవ్వడంలేదని వారం రోజుల కిందట నిర్మాణసంస్థల ప్రతి నిధులు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. డిజైన్లు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై కేసీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కె.రవిని ‘సాక్షి’ వివరణ కోరగా డిజైన్లు ఇచ్చామని, నిర్మాణసంస్థ పని ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారంటే ఈ మధ్యనే.. అన్నారు. డిజైన్లు ఇవ్వనందునే పని ప్రారంభం కావడం లేదనే మాటలు వినవస్తున్నాయని అడగగాా అదేం లేదు.. రెండు రోజుల్లో క్లియర్‌గా వివరాలు చెబుతా.. అంటూ దాటవేశారు. -
సదుపాయాలు లేకుండా విజయవాడకు వెళ్లలేం!
హైదరాబాద్: ఏపీ ఇరిగేషన్ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలన్నప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. విజయవాడలో మౌలిక సదుపాయాలు లేకుండా అక్కడకు ఎలా వెళతామని ఇరిగేషన్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కనీసం సరైన వసతులు లేకుండా విజయవాడకు వెళ్లలేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఏపీ ఇరిగేషన్ కార్యాలయాన్ని తక్షణమే విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ హెచ్ వోడీలకు సర్క్యులర్ పంపింది. దీనిలో భాగంగానే ఇరిగేషన్ శాఖలోని తొమ్మిది శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. -
బాబుపై ఉక్రోషంతో దాడి చేయిస్తారా?
ఏపీ మంత్రి దేవినేని మండిపాటు సాక్షి, విజయవాడ: నాగార్జునసాగర్ జలాల విషయంలో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తెలంగాణలోని వరంగల్‌లో పర్యటిస్తే మీకెందుకంత ఉక్రోషమంటూ ఆ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుపై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులతో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చి మా అధికారులు, పోలీసులపై దాడి చేయిస్తారా? అని ధ్వజమెత్తారు. ఇది చట్టబద్ధమైన చర్య కాదన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకోసం నీరు విడుదల చేసేవరకు తమ రాష్ట్ర నీటిపారుదలశాఖ, రెవెన్యూ, పోలీసులు నాగార్జునసాగర్ వద్దే ఉండి ప్రయత్నాలు చేస్తారని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం రాత్రి విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలవల్ల గుంటూరు, కృష్ణా జిల్లా, కృష్ణా డెల్టా, ప్రకాశం జిల్లాలోని ఐదు లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు, 1.49 లక్షల ఎకరాల్లో వరికి నష్టం కలుగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు వరంగల్ వచ్చారనేగా.. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీటి కేటాయింపుల విషయంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, బచావత్ ట్రిబ్యునల్ వద్ద, కృష్ణా బోర్డులోనూ ఈ వ్యవహారం ఉన్నప్పటికీ ఎందుకిలా చేయడమన్నారు. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించిన 99 టీఎంసీల నీటిని దాటి 15 టీఎంసీలను వారు ఎక్కువగా వినియోగించుకున్నారని, కృష్ణా డెల్టాకు 38 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా 15 టీఎంసీలే ఇప్పటికి వచ్చిందని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ నెలాఖరుకు, ప్రకాశం జిల్లాలో వచ్చేనెల 15 నాటికి ఖరీఫ్ పూర్తవుతుందని చెప్పారు. పంటలు చివరి దశలో ఉన్నప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, దీనికోసం రోజుకు 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నెలరోజులుగా కోరుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పారు. హరీశ్‌రావుతో మాట్లాడా... తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో శుక్రవారం తాను మాట్లాడి పరిస్థితిని వివరించి నీటిని విడుదల చేయాలని కోరానని ఉమా చెప్పారు. ఇందుకు బోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా పంపిస్తున్నానని చెప్పానన్నారు. 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకోవాలంటూ, రెండు రాష్ట్రాల్లో రైతులందరికీ న్యాయం జరగాలనేదే తమ అభిమతమని ఆయన చెప్పారు. తమపై కోపంతో కృష్ణా డెల్టా కన్ను పొడవాలని తెలంగాణ యత్నించటం సరికాదన్నారు. 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయకుండా 2 వేల క్యూసెక్కులను కాలువలద్వారా పులిచింతలకు పంపటం సరికాదన్నారు. పంతాలు, పట్టింపులు మానుకోవాలని, చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కారును ఆయన కోరారు. -
'పుష్కరఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తాం'
రాజమండ్రి : గోదావరి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి అవరసమైన నిధులను త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రిలో దేవినేని ఉమా పర్యటించారు. అందులోభాగంగా పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర రూరల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతోపాటు పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలు మంత్రి దేవినేని ఉమా వెంటనే ఉన్నారు. -
చంద్రబాబు వద్దకు టీడీపీ పంచాయితీ!
-
చంద్రబాబు వద్దకు టీడీపీ పంచాయితీ!
విజయవాడ: బెజవాడలో ఆధిపత్య పోరుపై చిచ్చు మరింత రాజుకుంది. నగరంలో టీడీపీ నేతల మధ్య చాపకింద నీరులా మారిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆధిపత్య పంచాయితీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెంతకు చేరింది. కేశినేని నాని నిన్నటి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో బాబును కలిసేందుకు నాని నిశ్చయించుకున్నారు. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని బాబు వద్దకు తీసుకువెళ్లాలనే యోచనలో నాని ఉన్నారు. గత ఆరు నెలల్లో ఉమ వ్యవహారశైలికి సంబంధించి బాబుకు నాని ఫిర్యాదు చేయనున్నారు. శుక్రవారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్నవిభేదాలు బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు. మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉండగానే నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తడం కాస్తా టీడీపీలో విభేదాలకు తావిచ్చింది. -
టీడీపీలో ఆధిపత్య పోరు
-
బెజవాడ టీడీపీలో ఆధిపత్య పోరు
మంత్రి దేవినేని ఉమాపై ఎంపీ కేశినేని నాని బహిరంగ విమర్శలు చాప కింద నీరులా కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ఎంపీ, ఎమ్మెల్యేలను అధికారుల బేఖాతరు.. ఫోన్ చేసినా పలకని వైనం సాక్షి, విజయవాడ బ్యూరో: బెజవాడ టీడీపీ లో చిచ్చు రగులుకుంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య చాప కింద నీరులా పాకుతున్న విభేదాలు శుక్రవారం బహిర్గతమయ్యాయి. ఆటోనగర్‌లో జరిగిన సీవరేజి ప్లాంటు ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘జిల్లా మంత్రిగారికి చెబుతున్నా.. మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదరదు’’ అంటూ ఉమాపై ఆయన సమక్షంలోనే ఘాటుగా స్పందించారు.అప్పుడు మరో మంత్రి నారాయణ కూడా వేదికపైనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. జిల్లా పార్టీని గుప్పిట్లో ఉంచుకోవడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కేశినేని నానికి లోక్‌సభ టికెట్ రాకుండా ఉమా యత్నించారు. దీంతో చంద్రబాబు కూడా పునరాలోచలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాని అధినేతతో పోరాడి మరీ టికెట్ సాధించుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా నుంచి ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలకు మంత్రి పదవులు లభించాయి. అప్పటి నుంచి జిల్లా పార్టీపై, అధికార యంత్రాంగంపై మరింత పట్టు సాధిం చేందుకు ఉమా యత్నిస్తున్నారు. జిల్లా నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే తన అధికారానికి గండి పడుతుందని తొలిసారి ఎమ్మెల్యే అయిన కొల్లు రవీంద్రకు కేబినెట్లో చోటు దక్కేలా పావులు కదిపారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, వంశీ, మండలి బుద్ధప్రసాద్‌లు ఉమాకు దూరంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే గద్దే రాంమోహన్‌రావు సైతం అలానే ఉంటున్నారు. విజయవాడ నగరానికి సంబంధించిన అధికారిక, పార్టీ వ్యవహారాల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అధికారులూ ఎంపీ, ఎమ్మెల్యేలను ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ నాని శుక్రవారం అధికారిక కార్యక్రమంలోనే ఉమా మీద, అధికారుల మీద ధ్వజమెత్తారు. అధికారులు తీసుకుంటున్న బఫూన్ చర్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు కశ్మీర్లో కూడా లేని ఆంక్షలు విజయవాడలో అమలు చేస్తూ, నగరానికి చెడ్డ పేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలన్నీ సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లాలనే తాను బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఎంపీ నాని చెప్పారు. -
మూడున్నరే ళ్లలో ‘పోలవరం’ పూర్తిచేస్తాం
అనపర్తి :ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్ట్‌ను మూడున్నరేళ్లలో పూర్తి చేసి అమలులోకి తీసుకు వస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన పెదపూడిలో రూ.5 కోట్ల 76 లక్షలతో నిర్మించిన పెదపూడి ఎత్తి పోతల పథకాన్ని మంత్రి ఉమామహేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే అదనంగా 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సుమా రు 542 గ్రామాలకు దాహార్తి తీరుతుం దని చెప్పారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలు గోదావరి డెల్టాల సాగునీటితో పంటలు పండుతున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్ర విభజనతో 7 మండలాల్లోని ముంపు గ్రామాలు తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉన్నాయని, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యేటట్టు ఆర్డినెన్స్ జారీ చేయించారని తెలిపారు.అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరిక మేరకు చాగల్నాడు ఎత్తి పోతల పథకం, వెంకటనగర్ ఎత్తి పోతల పథకాల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్ల 50 లక్షల నిధులు అవసరమవుతాయని, నిధులను మంజూరు చేయనున్నట్టు మంత్రి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనపర్తి, కొమరిపాలెం, కొంకుదురు గ్రామాల్లో పూర్తి దశకు చేరకుండా ఉన్న వంతెనల నిర్మాణాలను పూర్తి చేసేందు కు నిధులు మంజూరు చేయాలని కోరా రు. నల్ల కాలువపై తొస్సిపూడి లాకుల నుంచి శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందించేందుకు రెగ్యులేటర్ నిర్మించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి ఉమామహేశ్వరరావు స్పందిస్తూ రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు రైతులకు రుణ విముక్తి పత్రాలు, పలువురు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్య క్రమంలో మండపేట, ముమ్మిడివరం, రాజానగరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిబాబు, పెందుర్తి వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, ఏపీఎస్ఐడీసీ జేఎండీ వేంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ ఈఈ రమేష్‌బాబు, గోదావరి డెల్టా సీఈ ఎస్. హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం మండపేట : పోలవరం పనులను వేగవంతం చేస్తున్నట్టు రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మండపేట వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు. అనంతరం వారితో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అది పూర్తయితే రైతులకు సాగునీటికి, విద్యుత్‌కు కొరత ఉండదన్నారు. గోదావరి డెల్డాకు రెండో పంటకు నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నామని వివరించారు. మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల నీటిని గోదావరికి మళ్లించి రబీ పంట పూర్తయ్యే వరకు శివారు భూములకు సాగు నీరందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర వద్ద హైలెవల్‌గా కెనాల్ అభివృద్ధి చేసి నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. -
హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీస్తోంది కేసీఆరే
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి దేవినేని ఎదురుదాడి సాక్షి, విజయవాడ బ్యూరో: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను చెడగొడుతున్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాదని, తెలంగాణ ప్రభుత్వమూ, దానికి సీఎం అయిన కె.చంద్రశేఖరరావేనని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయంత్రం విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలంగాణ ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకత, రైతుల ఆత్మహత్యల అంశాల నుంచి ఆ రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాలలపై సరైన అవగాహన లేని కేసీఆర్, హరీశ్‌రావులు హైదరాబాద్‌కు నీరు రానీయకుండా ఏపీ అడ్డుపడుతోందని కేంద్రం దగ్గర ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. జూరాల, పాకాలకు నీళ్లంటూ నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. -
'దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు'
విజయవాడ: ఏపీ మంత్రులు సంస్కారంలతో మాట్లాడాలని వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, కొలుసు పార్థసారధి సూచించారు. రాజీవ్ గాంధీ భిక్షతోనే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్థాయి దేవినేని ఉమకు లేదన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది దేవినేని ఉమానే అని ఆరోపించారు. కృష్ణానది రిటైనింగ్ గోడ నిర్మించాలని ధర్నా చేసిన దేవినేని ఉమ.. నేడు ఆ టెండర్ ను రద్దు చేశారని తెలిపారు. ఎన్నికల హామీలపై దమ్ముంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ ను కొడాలి నాని, పార్థసారధి గురువారం విడుదల చేశారు. -
'ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ వదలవు'
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్ కు తెలియజేసినట్టు ఈ సందర్భంగా మంత్రి దేవినేని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో 73 టీఎంసీల నీటి కొరత ఉందన్నారు. రెండు రాష్టాలకు ఇబ్బంది కలగకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు. విద్యుత్ తక్కువగా ఉంటే మిగులు కరెంట్ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుక్కునే వెసులుబాటు ఉందన్నారు. అదే తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురైతే ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ నీరు కూడా విడుదల చేయవని చెప్పారు. -
టీడీపీ ఆఫీసులు ఎందుకు తగులబెట్టారు?
విజయవాడ: తెలంగాణలో టీడీపీ కార్యాలయాలు తగులబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో మిగిలిన విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. నీటి వినియోగం విషయంలో నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోఉన్న నీటిని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఎగువనుంచి ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే విద్యుత్ ఉత్పత్తి వల్ల వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవులోందని దేవినేని అన్నారు. కాగ, తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లగొండ జిల్లాలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. -
'మీకు బీపీ పెరిగితే.. పదవిని గోరంట్లకు ఇవ్వండి'
హైదరాబాద్ : శాసనసభలో నిన్న నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పలు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లగా అప్పటి వరకూ రక్తపోటు సాధారణంగా ఉండేదని, ఆ తర్వాత 140/80కి పెరిగిందని మంత్రి దేవినేని అన్నారు. దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రికి ఆరోగ్యం బాగోలేకపోతే పదవికి రాజీనామా చేసి పక్కనే ఉన్న సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఇస్తే బావుంటుందేమో ఆలోచించాలని సూచించారు. దీంతో సభ్యుల మధ్య ఒక్కసారిగా నవ్వుల పూలు పూశాయి. -
జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతాం
హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అలాగే జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. జలయజ్ఞంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు తోటపల్లి బ్యారేజ్ ఆయకట్టుపై సదరు మంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా దేవినేని ఉమాపై విధంగా స్పందించారు. -
'తిరుమలకు తెలుగుగంగా నీటిని తరలిస్తాం'
హైదరాబాద్: తిరుమలలో తాగునీటి సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అందులోభాగంగా తెలుగుగంగా నీటిని తిరుమలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమలలో శ్రీవారిని దేవినేని ఉమా దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శేషాచల కొండల్లో ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ఎర్రచందనాన్ని రెండు నెలలో వేలం వేస్తామని దేవినేని ఉమా వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఇచ్చిన హమీలను తమ తప్పక నెరవేరుస్తుందని తెలిపారు. -
'మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పలేదు'
హైదరాబాద్: వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ. లక్ష కోట్ల రుణాలు మాఫీ అనలేదని చెప్పారు. 43 లక్షల మందికి రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. బంగారం రుణాల్లో చాలా మంది వ్యాపారం కోసం తీసుకున్నవారున్నారని పేర్కొన్నారు. రూ. 24 వేల కోట్ల టర్మ్ లోన్ల మాఫీ అవసరం లేదని తేల్చిచెప్పారు. రైతులపై పడ్డ 12 శాతం వడ్డీ భారాన్ని తమ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. -
వాస్తు బాగోలేదు.. కూల్చి పారేయ్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులు అందరూ వాస్తు పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. అసలే ఒకపక్క రాష్ట్రం లోటులో ఉందని, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలంతా విరివిగా విరాళాలు ఇవ్వాలని జోలె పట్టి మరీ అడుగుతున్న టీడీపీ నాయకులు.. వాస్తు పేరుతో పదే పదే భవనాలు మారుస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు తాత్కాలికంగా పరిపాలన సాగించడానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. తర్వాత మళ్లీ పది కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్ బ్లాకులో కొత్తగా పనులు చేపడుతున్నారు. ఇవి మూడునెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత ఆయన అందులోకి వెళ్తారని చెప్పారు. ఇక ఆయన బాటలోనే ఆయన అనుంగు సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పయనిస్తున్నారు. తాజాగా విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో ఉమా ఆదేశాల మేరకు ఓ భవంతిని కూల్చారు. వాస్తు ప్రకారం లేదని ఆమాత్యులు హుకుం జారీ చేయడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ బిల్డింగ్‌ను కూల్చేశారు. ఈ భవనంలో రెండో అంతస్తు కోసం ఇటీవలే పదిలక్షల రూపాయల మేర ఖర్చు పెట్టాటి అధికారులు.. మంత్రి ఆదేశంతో మరోమాట మాట లేకుండా కూల్చేశారు. ఇలా టీడీపీ నాయకులు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు ప్రజాధనాన్ని వృథా చేస్తూనే ఉన్నారు. -
సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే...
హైదరాబాద్: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) గేట్ల ఎత్తు పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్‌రావు కోరారు. -
జుట్టు కేంద్రం చేతికివ్వొద్దు: దేవినేని
హైదరాబాద్ : రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వనరుల సమస్యలను రాష్ట్రాస్థాయిలో పరిష్కరించుకుంటేనే మంచిదని, అలాగాక జటిలం చేసుకుని మన హక్కులను కేంద్రం చేతికిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా బేసిన్లో 10 లక్షల ఎకరాలకు పైబడి వరి చేయాల్సి ఉండగా, కేవలం 150 హెకార్టలోనే నారుమళ్లు పడ్డాయంటే... అదికూడా బోర్ల కింద పడటాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. తాగునీటికి సైతం గడ్డుకాలం దాపురించిందని మంత్రి అన్నారు. వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయం ఏంటనే పరిస్థితి భయపెడుతోందన్నారు. -
మంత్రి పదవి ఉమాకే చాన్స్
*తొలి విడత ఒక్కరికే అవకాశం *మలివిడతలో మిగిలిన వారి పేర్ల పరిశీలన *రేసులో మండలి, కాగిత సాక్షి, విజయవాడ : సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతుండడంతో మంత్రి పదవి ఆశిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో అవకాశం కల్పించడంపై చంద్రబాబు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తారని తొలుత ప్రచారం జరిగినా.. తొలి విడత ఒక్కరినే మంత్రి పదవి వరించే వీలుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు అమాత్య పదవి దక్కనుంది. ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పశ్చిమ కృష్ణా నుంచి ఉమకు అవకాశం కల్పిస్తున్నందున.. తూర్పు కృష్ణాకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తొలివిడతలో ఉమకు అవకాశం ఇచ్చి, తర్వాత జరిగే విస్తరణలో తూర్పుకృష్ణా నుంచి ఇంకొకరికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణలు.. చంద్రబాబు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పశ్చిమకృష్ణా నుంచి దేవినేని ఉమకు ఇస్తే.. తూర్పు కృష్ణా నుంచి బీసీ, కాపులలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటిస్తారా.. లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అలా ఇచ్చినట్లయితే మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు అవకాశం లభిస్తుంది. కేవలం పార్టీలోని సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నించినా.. తొలి విడత మంత్రివర్గం పరిమితంగా ఉంచాలని చంద్రబాబు భావించడంతో వీరంతా ఆశ వదులుకున్నట్లు సమాచారం. -
బలప్రదర్శనా క్షేత్రం!
= విస్తృతస్థాయి సమావేశం పేరుతో అధిపత్య ప్రదర్శనకు యత్నం = విరాళాలు, చందాల పట్టుకోసం కుమ్ములాటల్లో భాగమే! సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో పట్టుపెంచుకుని రాబోయే రోజుల్లో పార్టీకి వచ్చే విరాళాలు, చందాల వసూళ్లపై ఆధిపత్యం చెలాయించేందుకు కొంతమంది నేతలు తహతహలాడుతున్నారు. ఆదివారం జరగబోయే విజయశంఖారావాన్ని ఇందుకు వేదికగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని సాగనీయకూడదనే ఆలోచనలో మరో వర్గం ఉన్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం వరకు జిల్లా, అర్బన్ తెలుగుదేశం పార్టీలు ఒకే గొడుగు కింద ఉండేవి. కార్యాలయ నిర్వహణ బాధ్యతంతా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు చూసుకునేవారు. జిల్లాలో పార్టీకి నెలవారీ వసూళ్లు, విరాళాలు ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన హోటల్ యజమానులు, పారిశ్రామివేత్తలు, ఆటోమొబైల్ ముఖ్యుల నుంచి పార్టీ నేతలు ప్రతి నెలా లక్షల్లో చందాలు వసూలు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో, చంద్రబాబు వచ్చినప్పుడు, ఇతర పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వసూళ్లు మరికాస్త పెరిగి కోట్లకు చేరతాయి. ఈ సొమ్మంతా జిల్లా అధ్యక్షుడు ఉమా ఆధ్వర్యంలోనే ఖర్చు చేసేవారు. పార్టీ కార్యాలయ నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు నెలకు రూ.25 లక్షల వరకు ఖర్చయ్యేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమా కాకుండా ఇతర సామాజికవర్గాల నేత జిల్లా అధ్యక్షుడైతే ఈ వసూళ్లు ఆగిపోతాయని, అప్పుడు పార్టీ నిర్వహణ భారం అవుతుందని పార్టీ సీనియర్ నేతలు భావించేవారు. సొంత కుంపటి పెట్టుకున్న కేశినేని... విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా కేశినేని శ్రీనివాస్ (నాని)ని నియమించిన తరువాత ఆయన సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా అర్బన్ పార్టీని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి విడదీసి తన కార్యాలయానికి తెచ్చుకున్నారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రస్తుతం ఇక్కడ నుంచే కార్యక్రమాలు చేస్తున్నారు. అర్బన్ అనుబంధ సంఘాలు కూడా ఇక్కడ నుంచే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో పార్టీ వసూలు చేసే సొమ్ము తమకే దక్కాలనే అభిప్రాయం ఈ నేతల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో వసూలు చేసే సొమ్మును జిల్లా పార్టీ కార్యాలయంలో వినియోగించినప్పటికీ, నగర పరిధిలో వసూళ్లు తమకు వదిలివేయాలని వీరు గత కొద్దికాలంగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. దేవినేని ఉమా కూడా జిల్లాకే పరిమితం కావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. విజయశంఖారావం వేదికగా... ఆదివారం విజయవాడలో విజయశంఖారావం పేరుతో అర్బన్ స్థాయిలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే పార్టీ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తారని చెబుతున్నారు. ఈ సభకు జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇదంతా పైకి చెబుతున్న విషయమే అయినప్పటికీ అంతర్గతంగా రాబోయే 100 రోజులకు పార్టీ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయంపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేదిక ద్వారా అర్బన్ నేతలు కూడా తమ బలం నిరూపించుకుని వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వద్ద గుర్తింపు పొందాలని భావిస్తున్నారు. నగరంలో వసూళ్లపై సుజనాచౌదరి వద్దనే తేల్చుకునేందుకు కొంతమంది నగర నేతలు సిద్ధమౌతున్నారు. విస్తృతస్థాయి సమావేశంపై విసుర్లు... జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోనూ, నగరంలోనూ అనేక విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయని, అందువల్ల ఇప్పుడు జరిగే విస్తృతస్థాయి సమావేశానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. విస్తృతస్థాయి సమావేశానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంటోంది. రాబోయే రోజుల్లో కూడా ఉమా సూచించిన విధంగా పార్టీ నడుస్తుందని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ వెంటే ఉంటారని చెబుతోంది. ఏమైనా ప్రస్తుతం అర్బన్, జిల్లా పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో చందాలు ఇచ్చే ప్రముఖులు ఉన్నారు. -
దేవినేని దీక్ష భగ్నం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావులు విజయవాడలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. అవనిగడ్డ ఉపఎన్నిక నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శుక్రవారం రాత్రే నగర పోలీసు కమిషనర్ బీ.శ్రీనివాసులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను ధిక్కరించి వారు తమ ఇళ్ల వద్ద నుంచి దీక్షస్థలికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఈ ఇరువురు నేతల్ని అడ్డుకుని అరెస్టు చేశారు. -
టీడీపీలో మైలవరం చిచ్చు
* అక్కడి నుంచి పోటీ కి బాలకృష్ణ సిద్ధం * ససేమిరా అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే దేవినేని ఉమ * ఉమకు పెనమలూరు లేదా నూజివీడు సూచించిన బాలయ్య * చంద్రబాబు వద్దకు చేరిన పంచాయితీ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసే అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే బాలకృష్ణ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. దీంతో ఈ సీటు పంచాయితీ ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఆయన సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, ఎవ్వరికీ సర్దిచెప్పలేక తలపట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని బాలకృష్ణ ఎంతో కాలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయాలని తొలుత భావించారు. దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆ గ్రామం పామర్రు (ఎస్సీ) నియోజకవర్గంలో కలవడంతో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు తనకు సన్నిహితులైన వారితో సర్వేలు చేయించగా గుడివాడ నుంచి పోటీ చేయకపోవటమే మంచిదని తేలింది. దీంతో బాలకృష్ణ మైలవరంపై కన్నేయడం దేవినేని ఉమామహేశ్వరరావుకు షాకిచ్చింది. తన సీటును వదులుకునేది లేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. గతంలో ఉమ పోటీచేసి గెలిచిన నందిగామ 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్ అయింది. దాంతో ఆయన మైలవరంనుంచి పోటీచేసి గెలిచారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేశాన ని, అలాంటప్పుడు వేరే నియోజకవర్గానికి ఎలా వెళతానని ఉమ సన్నిహితుల ముందు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందున నూజివీడు లేదా పెనమలూరు నుంచి పోటీ చేయాలని బాలకృష్ణ సూచిస్తున్నారు. ఈ పరిణామాలు రుచించని ఉమ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మైలవరం నుంచే పోటీచేస్తానని అధినేతకు స్పష్టం చేయగా, ఆయన నుంచి స్పందనలేదని తెలి సింది. ఆ అంశంపై మళ్లీ మాట్లాడదామని అందరికీ చెప్పినట్లే ఉమకూ చెప్పి పంపినట్లు సమాచారం. కాగా, మైలవరం నుంచే తను పోటీకి వీలుగా ఉమను ఒప్పించే బాధ్యత మీదేనని బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబుకు తేల్చిచెప్పినట్లు తెలిసింది.