దేవినేని దీక్ష భగ్నం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావులు విజయవాడలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. అవనిగడ్డ ఉపఎన్నిక నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శుక్రవారం రాత్రే నగర పోలీసు కమిషనర్ బీ.శ్రీనివాసులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను ధిక్కరించి వారు తమ ఇళ్ల వద్ద నుంచి దీక్షస్థలికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఈ ఇరువురు నేతల్ని అడ్డుకుని అరెస్టు చేశారు.