'దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు' | kodali nani, kolusu parthasaradhi slams devineni umamaheswara rao | Sakshi
Sakshi News home page

'దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు'

Published Thu, Nov 27 2014 8:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

కొడాలి నాని(ఫైల్)

కొడాలి నాని(ఫైల్)

విజయవాడ: ఏపీ మంత్రులు సంస్కారంలతో మాట్లాడాలని వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, కొలుసు పార్థసారధి సూచించారు. రాజీవ్ గాంధీ భిక్షతోనే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్థాయి దేవినేని ఉమకు లేదన్నారు.

కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది దేవినేని ఉమానే అని ఆరోపించారు. కృష్ణానది రిటైనింగ్ గోడ నిర్మించాలని ధర్నా చేసిన దేవినేని ఉమ.. నేడు ఆ టెండర్ ను రద్దు చేశారని తెలిపారు. ఎన్నికల హామీలపై దమ్ముంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ ను కొడాలి నాని, పార్థసారధి గురువారం విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement