'ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ వదలవు'
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్ కు తెలియజేసినట్టు ఈ సందర్భంగా మంత్రి దేవినేని చెప్పారు.
నాగార్జున సాగర్, శ్రీశైలంలో 73 టీఎంసీల నీటి కొరత ఉందన్నారు. రెండు రాష్టాలకు ఇబ్బంది కలగకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు. విద్యుత్ తక్కువగా ఉంటే మిగులు కరెంట్ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుక్కునే వెసులుబాటు ఉందన్నారు. అదే తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురైతే ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ నీరు కూడా విడుదల చేయవని చెప్పారు.