Krishna river water dispute
-
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్
-
కేసీఆర్ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల విషయంలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జరిగిన ఆలస్యానికి కేంద్రం కానీ, మంత్రిగా తాను కానీ ఎలా బాధ్యత వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశ్నించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకునేందుకు సుప్రీం కోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని చెప్పారు. ఈ ఆలస్యానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్రం ఇన్నేళ్లుగా చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందని తెలిపారు. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయగా, రెండు రోజుల్లో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే 8 నెలల వరకు ఈ విషయంలో ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పారు. రెండు రాష్ట్రాలు ఒప్పుకొన్నాకే నోటిఫై చేశాం నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని, పరిస్థితి ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిన కారణంగా ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని ప్రధాని సూచన మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పడినప్పటికీ, పరిధి నోటిఫై చేయని కారణంగా ఆ రెండు బోర్డులు అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ అన్నారు. ఈ బోర్డుల పరిధిని నోటిఫై చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు గతేడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో జరిగిన చర్చల తర్వాతే రెండు బోర్డుల పరిధిని నిర్ణయించామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. బోర్డులను నోటిఫై చేసే విషయంలో ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటిఫై చేసినా.. ఇదంతా డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని విమర్శించారు. అదే సమయలో నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా లేక ఉన్న ట్రిబ్యునల్‌కే టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఇవ్వాలనే విషయంలో న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరామని తెలిపారు. రెండు బోర్డులను మరింత శక్తిమంతంగా చేసేందుకు ఇరు రాష్ట్రాలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని షెకావత్ సూచించారు. కాగా, విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నిర్వహణ కోసం డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, ఈ విషయంలో రాష్ట్రాలను తాము ఎలాంటి ఒత్తిడి చేయబోమన్నారు. చదవండి: దూరదర్శన్ కేంద్రం: మహిళల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా ఏవో పేపర్లు పంపడం కాదు.. డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించిన ఏదో ఒక పేపర్లను రాష్ట్రాలు పంపడం ఎలా సరైనదో చెప్పాలని షెకావత్ ప్రశ్నించారు. డీపీఆర్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన ఫార్మాట్లోనే పంపాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పును సవరించే ప్రక్రియ పార్లమెంటులో జరగాలని, ఇది ఇప్పటికే అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని తెలిపారు. ఈ విషయంలో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. -
Parliament Session 2021: ‘పోలవరం’పై ఒత్తిడి తేవాలి
రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తండి. పరిస్థితిని, వాస్తవాలను సమగ్రంగా వివరించి.. బకాయిలు వెంటనే విడుదల చేసేలా గట్టి ప్రయత్నం చేయండి. ఇందుకోసం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులను కూడా కలిసి మాట్లాడండి. రాష్ట్రపతి, ఇతర ముఖ్య నేతలకు కూడా రాష్ట్ర పరిస్థితిని వివరించండి. అన్ని విధాలా రాష్ట్రానికి న్యాయం జరిగేలా అడుగులు ముందుకు వేయండి. – వైఎస్సార్సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా ఆమోదింపజేయడంతో పాటు కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఖరారు చేసి 29 నెలలు అవుతోందని సీఎం అన్నారు. గతంలో ఏదైనా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే కేంద్రమే ఆ ఖర్చంతా భరించే పరిస్థితులు ఉండేవని, అయితే పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత రీయింబర్స్ చేసే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని చెప్పారు. మిగిలిన ఏ జాతీయ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించడం లేదని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధులు రూ.1,971 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. అయినప్పటికీ పోలవరం నిర్మాణం ఎక్కడా ఆగకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి పనులు జోరుగా ముందుకు సాగేలా చేస్తోందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు సహాయ, పునరావాస (ఆర్అండ్ఆర్) ప్యాకేజీకి సంబంధించి దాదాపు రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ఈ మేరకు నిధులను సత్వరమే విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడిన విషయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జలాల్లో వాటా నీటినే వాడుకుంటాం ► రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశాం. ఈ ఎత్తిపోతల కింద ఒక్క ఎకరం కూడా అదనపు ఆయుకట్టు లేదు. ఒక్క నీటి చుక్కనూ అదనంగా మనం తరలించడం లేదు. ► శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది. గత 20 సంవత్సరాల్లో ఈ రెండేళ్లు మినహా సరాసరి ఏడాదికి 20–25 రోజులకు మించి శ్రీశైలంలో ఈ స్థాయిలో నీటి మట్టం ఉండటం లేదు. తెలంగాణాలో పెట్టిన అన్ని లిప్టులు 800 అడుగుల లోపలే నీటిని తీసుకునేలా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ► చంద్రబాబు హయాంలో తెలంగాణ సర్కార్.. అనుమతి లేకుండా ఒక్క శ్రీశైలంలోనే 5 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంది. ఇది చట్టానికి పూర్తి భిన్నంగా జరిగింది. ► కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి కడుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అనుమతి లేకుండా చేపట్టారు. ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)ని విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు 800 అడుగుల లోపల నుంచే నీటిని తెలంగాణ తరలిస్తుంది. ► శ్రీశైలంలో 796 అడుగుల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం తెలంగాణాకు ఉంది. ఈ పరిస్థితుల్లో 881 అడుగుల నీటిమట్టం కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 800 అడుగుల్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఈ ఎత్తిపోతల ద్వారా మన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలనేది ఆలోచన. తెలంగాణ తీరు ఒప్పందాలకు భిన్నం ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ నీటిని కేటాయించింది. అప్పట్లో రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాంధ్రాకు 367.34 టీఎంసీలు, తెలంగాణాకు 298.96 టీఎంసీలు కేటాయించారు. దీనికి సంబంధించి ఒప్పందాలపై 2015 జూన్ 19న తెలంగాణా, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంతకాలు కూడా చేశారు. ► దానికి పూర్తి భిన్నంగా ఈరోజు తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో అక్రమంగా విద్యుదుత్పత్తి కోసం 63 టీఎంసీలను వాడుకుంది. ఇప్పటికే ఎనిమిది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి.. రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తోంది. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాం. ► వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని తక్షణమే నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ► విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి వైఎస్సార్సీపీ కేంద్రానికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే దీనికి క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించాలని కోరాం. ► రూ.14 వేల కోట్ల రుణాన్ని ఈక్విటీ కింద పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుందని చెప్పాం. అలా చేస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుంది. అప్పుడు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పాం. ► ప్రైవేటీకరణ చేసే బదులు.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కో, ఎన్ఎండీసీలోనే విలీనం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని నొక్కి వక్కాణించి కేంద్రానికి తెలియజేశాం. పార్లమెంటులో ఇదే అంశాన్ని లేవనెత్తండి. రూ.6,112 కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టండి ► 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేశారు. ఈ విద్యుత్ బిల్లుల విలువ రూ.6,112 కోట్లు. ఇప్పటి వరకు ఆ బిల్లులను తెలంగాణ సర్కార్ చెల్లించ లేదు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్లో ప్రస్తావించండి. ► గతంలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా మధ్య.. పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మధ్య తలెత్తిన వివాదాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇదే రీతిలో మన రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.6,112 కోట్లను తెలంగాణ సర్కార్ చెల్లించకపోతే.. కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్ (పన్నుల్లో వాటా)లో తెలంగాణా రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల నుంచి వాటిని మినహాయించి మన రాష్ట్రానికి ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసి, బకాయిలు రాబట్టండి. జాతీయ ఆహార భద్రత చట్టంలో అసమానతలు ► రాష్ట్రం విడిపోయినప్పుడు ఆహార భద్రత చట్టంలో అసమానతల వల్ల తక్కువ రేషన్ కార్డులు వచ్చాయి. రేషన్ కార్డులు కేంద్రం ఎన్నైతే ఆమోదించిందో అంత వరకు మాత్రమే రేషన్ సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. మిగిలినది రాష్ట్రం భరిస్తుంది. ఇందుకు రెండు ప్రామాణికాలు తీసుకున్నారు. ► రాష్ట్ర విభజన సందర్భంలో తీసుకున్న పర్సెంటేజ్ ప్రాతిపదికన రేషన్ కార్డులు విడదీశారు. దాని ఆధారంగానే సబ్సిడీ ఇస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశాం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీకి ఎంత అన్యాయం జరుగుతుందో వివరించాం. ► రేషన్ సబ్సిడీలో గ్రామీణ ప్రాంతంలో కర్ణాటకలో 76.04 శాతం, గుజరాత్లో 76.64 శాతం, మహారాష్ట్రలో 76.32 శాతం కవర్ అవుతున్నారు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కేవలం 60.96 శాతం మాత్రమే కవర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేటప్పటికి కేవలం 60 శాతానికి పరిమితం చేసింది. ఈ అసమానతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరండి. ► కేంద్రం నుంచి ధాన్యం బకాయిలు రూ.5,056 కోట్లు రావాల్సి ఉంది. వాటిని కేంద్రం విడుదల చేయక పోవడంతో కిందామీదా పడి రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేసి రైతులకు చెల్లిస్తున్నాం. ధాన్యం బకాయిలను తక్షణమే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెండి. దిశ చట్టాన్ని ఆమోదించాలని ఒత్తిడి చేయండి ► దిశ చట్టం చాలా కాలంగా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. దాన్ని తక్షణమే ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి. ► రాష్ట్రంలో 17,005 లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశా>ం. ఆ నిధులను రాబట్టడానికి ప్రయత్నించండి. ఉపాధి హామీ పథకం కింద రూ.6,750 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెండి. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ► విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేసింది. దానికి భూమిని గత ప్రభుత్వం గిరిజనేతర ప్రాంతంలో కేటాయించింది. గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఎస్.కోట నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గానికి తరలించి అక్కడ భూమిని కేటాయించింది. ► దాన్ని ఆమోదించి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయండి. విభజన చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్లో అమలుకు నోచుకోని వాటిని ప్రస్తావించి, వాటన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి.. అమలు చేసేలా ఒత్తిడి తెండి. కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలు ► కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించిన తీరు.. మరణాలు అతి స్వల్పంగా నమోదైన రాష్ట్రాలలో రెండో స్థానంలో రాష్ట్రం ఉందనే అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించండి. ► రాష్ట్రంలో 12 సార్లు డోర్ టూ డోర్ సర్వే చేసి.. ప్రతి కుటుంబంలో ఎవరైనా జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్న వారందరికీ ఉచితంగా పరీక్షలు చేశాం. పరీక్షలు కావాలనుకున్న వారందరికీ పరీక్షలు చేశాం. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి, అత్యుత్తమ చికిత్స అందించడంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది. ► కేంద్రం 28 పీఎస్ఏ ప్లాంట్లు ఇస్తే.. వాటితో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 134 చోట్ల ఏర్పాటు చేస్తోంది. ఇవికాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశాం. మొదటి వేవ్‌లో ఇంచుమించుగా రాష్ట్రం రూ.20 వేల కోట్లు నష్టపోయింది. కోవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. మూడో వేవ్ వస్తుందంటున్నారు. వచ్చినా రాకపోయినా ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమై ఎదుర్కునే పరిస్థితి ఉంది. రేషన్‌ను ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్ర పన్నుల్లో తగ్గుతున్న వాటా ► కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రం వాటా 42 శాతం. డెవల్యూషన్ ఫండ్స్ ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తున్నాయి. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి.. వాటా నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయండి. ► పార్లమెంట్లో వాస్తవాలనే ప్రస్తావించండి. సమావేశాలకు సభ్యులంతా విధిగా హాజరై.. చర్చల్లో పాల్గొని.. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి. అన్ని అంశాలపై ఒత్తిడి తెస్తాం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాలుగు వారాలు జరుగుతాయి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీకి కేటాయించిన సమయంలోనే సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేసిన అంశాలన్నీ ప్రస్తావిస్తాం. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. ప్రత్యేక హోదా కావాలే తప్ప ప్రత్యామ్నాయం లేదని మేం మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు హోదాను కేంద్రానికి అమ్మేశాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అవసరం లేదని, తనకు ఒక ప్యాకేజి ఇస్తే చాలని ముందుకెళ్లాడు. కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇంచుమించుగా ఇప్పటి దాకా ఢిల్లీకి వెళ్లిన 12 సందర్భాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన మంత్రి, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే సమస్య లేదు. -వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత -
తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. కృష్ణాజలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), (బి) ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు, నీటి లభ్యత రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ధర్మాసనం కొట్టివేస్తూ మిగతా పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ
-
‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ
సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో ఏర్పాటు ► ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జల వనరుల శాఖ ► గతంలో రాష్ట్రం అభ్యంతరం తెలిపిన సభ్యుల తొలగింపు ► ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి, గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపు అంశాలపై అధ్యయనం ► 90 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కృష్ణా జలాల నిర్వహణ ఎలా ఉండాలో తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిం చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ చైర్మన్ గా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాలకృష్ణన్, రూర్కీ సైంటిస్ట్ డాక్టర్ ఆర్పీ పాండే, చీఫ్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ శుక్లా, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ ఎన్ఎన్ రాయ్ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ మనోజ్ శర్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియమావళి, మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు, గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్–1980కి అనుగుణంగా గోదావరికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై అధ్యయనం చేస్తుంది. ఈ అంశాలపై అధ్యయనం చేసి అందించే నివేదిక, సూచించే విధానానికి అనుగుణంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నడుచుకోనుంది. ఈ కమిటీ తన నివేదికను 90 రోజుల్లో కేంద్ర జల వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. కమిటీ అధ్యయనానికి అవసరమైన సంపూర్ణ సహకారం, సమాచారాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. కమిటీ అవసరమనుకుంటే సీడబ్ల్యూసీ, ఇతర రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల సహకారాన్ని సైతం తీసుకుంటుంది. ఆ సభ్యుల తొలగింపు.. నిజానికి కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కమిటీని నియమిస్తామని జూన్ 21, 22 తేదీల్లో జరిగిన కేంద్ర జల వనరుల శాఖ సమావేశంలోనే నిర్ణయం జరిగింది. దీనికి అనుగుణంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ మొహిలే అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలోని ఇద్దరు సభ్యులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. గత కమిటీలో ఉన్న మొహిలే రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా పని చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఏకపక్షం గా ఉందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇక మరో సభ్యుడిగా ఉన్న ఎంకే గోయల్ రూర్కీ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో శాస్తవేత్తగా ఉంటూ, కృష్ణా బేసిన్ లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలం గాణకు సంబంధం లేని తటస్థ నిపుణులతో కమిటీని వేయాలని తెలంగాణ సూచించగా, అందుకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం చేసింది. -
‘కృష్ణా’పై కేంద్రం వైఖరేమిటో?
10న సుప్రీంకోర్టులో తన వైఖరిని చెప్పనున్న కేంద్రం ట్రిబ్యునల్ సభ్యుడి ఎంపికపైనా స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదంలో నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు 4 రాష్ట్రాల వాదనలు వినాలా? లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలన్న దానిపై కేంద్రం చెప్పే వైఖరిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో కేంద్రం ఏం చెబుతుందన్న దానిపై నాలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ మాత్రం మరోమారు నాలుగు రాష్ట్రాల వాదనలు విని పునఃకేటాయింపులపై నిర్ణయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనుంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే దృష్ట్యా, దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని రాష్ట్రం సుప్రీంను అభ్యర్థించింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం.. తెలంగాణ వినతిపై వైఖరిని చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. గతంలోనే ఒకమారు వైఖరిని చెప్పాలని సుప్రీం సూచించినా కేంద్రం ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నందున త్వరగా వైఖరిని చెప్పాలని సుప్రీం గట్టిగానే చెప్పడంతో ఈ నెల 10న జరగబోయే విచారణలో ఏదో ఒక వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ సభ్యుడు డీకే సేథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో మరో సభ్యుడి నియామకంలో చేపట్టిన చర్యలపైనా కేంద్రం స్పష్టతనిచ్చే అవకాశముంది. -
కృష్ణా నీటి వివాదంపై చేతులెత్తేసిన బోర్డు
-
కేంద్రమే తేల్చాలి
కృష్ణా నీటి వివాదంపై చేతులెత్తేసిన బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్టా నీటి కేటాయింపుల వివాదం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. దీనిపై కేంద్రంలో తేలేవరకు తామేమీ చేయలేమని కృష్ణా నది యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఈ వివాదాన్ని తేల్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విఫలమైనందున ఈ అంశాన్ని కేంద్రం తేల్చిన తర్వాతే బోర్డు సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్-15 ప్రకారం ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామని, కేంద్రం స్పందించే వరకు బోర్డు భేటీ వల్ల ప్రయోజనం ఉండదని లేఖలో అభిప్రాయపడింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి ఆర్.కె.గుప్తా రెండు రాష్ట్రాలకు లేఖలు రాశారు. లేఖలో క్లాజ్-15 గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్లాజ్‌కు న్యాయపరమైన భాష్యం(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) తెలియజేయాలంటూ రెండు రాష్ట్రాలకు గతంలో బోర్డు లేఖలు రాసినా సమాధానం రాలేదని వివరించారు. కేటాయింపులకు మించి నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేశామని, బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి కేటాయింపుల విధానాన్ని తేల్చే వరకు కుడి కాల్వకు నీటి విడుదల నిలిపివేస్తామంటూ తెలంగాణ రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గుప్తా స్పష్టం చేశారు. కాగా, ఈ వివాదంపై ఇప్పటికే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరిన తెలంగాణ ప్రభుత్వం.. అక్కడి నుంచి వచ్చే స్పందన కోసం వేచిచూస్తోంది. ఒకట్రెండు రోజుల్లో న్యాయసలహా అందుతుందని, ఆ వెంటనే తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. క్లాజ్-15లో ఏముందంటే.. నీటి అవసరాలను సమీక్షించి కేటాయింపుల మేరకు ఆయా సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యతను కృష్ణా వ్యాలీ అథారిటీకి అప్పగించినట్లు బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15 చెబుతోంది. నీటి అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన ఆదేశాలను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు ఇవ్వడానికి అథారిటీకి అధికారం ఉంది. ప్రస్తుతం కృష్ణా వ్యాలీ అథారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తిన విభేదాలను క్లాజ్-15 ప్రకారం కేంద్రమే పరిష్కరించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. ‘‘కేటాయింపుల మేరకు కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు నీరు అందతున్న తీరును కృష్ణా వ్యాలీ అథారిటీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటర్ ఇయర్లో దిగువ రాష్ట్రాలకు కేటాయింపుల మేరకు నీరందని పక్షంలో.. ఎగవ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని అథారిటీ ఆదేశాలు జారీ చేయాలి. కరువు పరిస్థితులు ఉండి దిగువ రాష్ట్రానికి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. జూలై నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నీటి విడుదలకు ఎగువ రాష్ట్రాలను ఆదేశించకూడదు’’ అని క్లాజ్-15 పేర్కొంటోంది. లేఖలో కృష్ణా బోర్డు పేర్కొన్న అంశాలు # సాగర్ కుడి కాల్వ కింద ఏపీకి ఉన్న 132 టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేశామని, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి అనుసరించాల్సిన విధానం తేలే వరకు ఇకపై కుడి కాల్వకు నీరివ్వడం సాధ్యం కాదని బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కున్న కేటాయింపులను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15కు సంబంధించిన అంశం. ఈ విషయం గురించి రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో బోర్డు పలుమార్లు చర్చించింది. క్లాజ్-15పై వివరణ(లీగల్ ఇంటర్‌ప్రిటేషన్) ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించినా సమాధానం లేదు. # ఇరు రాష్ట్రాలు క్లాజ్-15 మీద స్పందించని నేపథ్యంలో.. ఈ అంశం మీద స్పష్టత ఇవ్వాలని కేంద్ర జల వనరుల శాఖకు విజ్ఞప్తి చే శాం. కేంద్రం ఇచ్చే స్పష్టతపై ఆధారపడే నీటి విడుదలను నియంత్రించే అంశం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత నీటి సంవత్సరం(వాటర్ ఇయర్)లో బోర్డు తన విధులను నిర్వర్తించడానికి కేంద్రం ఇచ్చే వివరణ అత్యంత ముఖ్యమైన అంశంగా బోర్డు భావిస్తోంది. # రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీల సమావేశం ఎలాంటి పరిష్కారం ఇవ్వలేకపోయింది. బోర్డులో వారే సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు బోర్డు భేటీ నిర్వహించినా నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో క్లాజ్-15 మీద కేంద్రం స్పష్టత ఇచ్చిన తర్వాతే బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తాం. -
ముందుగా ఉన్నతాధికారుల భేటీ
కృష్ణా జల వివాదాల వ్యవహారం... ఈ నెల మూడో వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ నెల మూడోవారంలో రానున్న నేపథ్యంలో జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందుగా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యే ఆస్కారముంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు... ఈఎన్సీలు మరోసారి భేటీ కావాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ అధికారులు ధ్రువీకరించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి అవసరమైన ఎజెండా తయారీకి కూడా అధికారుల సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. నాగార్జున సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాల విషయంలో రెండు రాష్ట్రాలు పొంతనలేని లెక్కలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కూర్చుని ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించింది. సమావేశమైతే జరిగింది కానీ.. నీటి వినియోగం, డిమాండ్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సాధ్యం కాలేదు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకార ధోరణిలో వెళితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదని సూచిస్తూ కృష్ణా నదీ బోర్డు ఇటీవల రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బోర్డు ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ భేటీయే ఇందుకు మార్గంగా భావిస్తున్నారు. తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
రెండు రాష్ట్రాలా.. నాలుగు రాష్ట్రాలా?
* కృష్ణాజల వివాదాల్లో రాష్ట్రాల పరిధిపై నేడు మరోమారు బ్రజేష్ ట్రిబ్యునల్ విచారణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై గురువారం మరోమారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివాదాలకే విచారణను పరిమితం చేయాలా, మహారాష్ట్ర, కర్ణాటకలను చేర్చాలా అన్న దానిపై ట్రిబ్యునల్ అందరి వాదనలు విననుంది. ఇందులో కేంద్రం వెల్లడించే నిర్ణయమే కీలకం కానుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. దీనిపై గతంలో జరిగిన విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ఏపీ, తెలంగాణలు నాలుగు రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరపాలని కోరగా, కర్ణాటక, మహారాష్ట్ర వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం చేసే నిర్ణయం కీలకంగా మారింది. దీనిపై గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన కేంద్రం, రెండు రాష్ట్రాలకే విచారణను పరిమితం చేయాలని తెలిపింది. నివేదిక రూపంలో అభిప్రాయాన్ని చెప్పాలని ట్రిబ్యునల్ సూచించినా అది జరుగలేదు. కాగా, కృష్ణా జలాలపై బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే నెల 1 న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
కుదరని ఏకాభిప్రాయం!
హైదరాబాద్: కృష్ణా నదీజలాలు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సుదీర్ఘంగా మూడు గంటలపాటు జరిగిన కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టంపై ఇరు ప్రాంతాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు.834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారుల వాదన. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆపాల్సిందేనని ఏపీ అధికారులు వాదించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూడా వాదోపవాదాలు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం 3వ తేదీ వరకు 3 టీఎంసీల నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. అందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్లు కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి ఆర్కే గుప్త చెప్పారు. నదీజలాల వివాదాలకు సంబంధించి సాంకేతిక అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశం వివరాలతో పూర్తి ప్రకటన రేపు విడుదల చేస్తామని చెప్పారు. ** -
'ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ వదలవు'
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్ కు తెలియజేసినట్టు ఈ సందర్భంగా మంత్రి దేవినేని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో 73 టీఎంసీల నీటి కొరత ఉందన్నారు. రెండు రాష్టాలకు ఇబ్బంది కలగకూడదన్నదే తమ ఉద్దేశమని అన్నారు. విద్యుత్ తక్కువగా ఉంటే మిగులు కరెంట్ ఉన్న రాష్ట్రాల నుంచి కొనుక్కునే వెసులుబాటు ఉందన్నారు. అదే తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురైతే ఎగువ రాష్ట్రాలు ఒక్క టీఎంసీ నీరు కూడా విడుదల చేయవని చెప్పారు.